EPFOకి సంబంధించి కీలక ప్రకటన.. ఆ గడువు మార్చి 15 వరకు పొడిగింపు
EPFO: ఉద్యోగులకు ఆధార్‌తో అనుసంధానించిన యాక్టివ్ UAN ఒకే పోర్టల్ ద్వారా బహుళ EPFO సేవలను పొందేందుకు వీలు కల్పిస్తుంది. ఇందులో ప్రావిడెంట్ ఫండ్ పాస్‌బుక్‌లను వీక్షించడం, డౌన్‌లోడ్ చేయడం, ఉపసంహరణలు లేదా బదిలీల కోసం ఆన్‌లైన్ క్లెయిమ్‌లు చేయడం, వ్యక్తిగత వివరాలను అప్‌డేట్..

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కు సంబంధించిన కీలక అంశాలున్నాయి. ఎంప్లాయ్‌మెంట్-లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) పథకం కింద ప్రయోజనాలను పొందడానికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని యాక్టివేట్ చేయడానికి, బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీని మార్చి 15, 2025 వరకు పొడిగించారు. ఈ గడువును గతంలో అనేకసార్లు పొడిగించారు. మునుపటి గడువు ఫిబ్రవరి 15, 2025 వరకు ఉండేది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 21, 2025న జారీ చేసిన సర్క్యులర్‌లో UAN యాక్టివేషన్, బ్యాంక్ ఖాతాతో ఆధార్‌ను లింక్ చేయడానికి గడువును మార్చి 15, 2025 వరకు పొడిగించిందని తెలిపింది.
UAN అంటే ఏమిటి?
UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్) అనేది EPFO ద్వారా ప్రతి జీతం పొందే ఉద్యోగికి అందించే 12 అంకెల సంఖ్య. ఇది ఉద్యోగులు తమ కెరీర్ అంతటా వివిధ యజమానుల కింద వారి పీఎఫ్ ఖాతాలను నిర్వహించడానికి యాక్సెస్‌ను అందిస్తుంది. దీనితో వారు ఒకే నంబర్ కింద వారి ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్‌ను ట్రాక్ చేయవచ్చు. యాక్సెస్ చేయవచ్చు.
ELI పథకం కింద ఆర్థిక ప్రయోజనాలను పొందడానికి, ఉద్యోగులు తమ UAN ని యాక్టివేట్ చేసుకోవడం, వారి బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్‌లో EPFO తెలిపింది.
UAN ని ఆధార్ కార్డుతో లింక్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ఉద్యోగులకు ఆధార్‌తో అనుసంధానించిన యాక్టివ్ UAN ఒకే పోర్టల్ ద్వారా బహుళ EPFO సేవలను పొందేందుకు వీలు కల్పిస్తుంది. ఇందులో ప్రావిడెంట్ ఫండ్ పాస్‌బుక్‌లను వీక్షించడం, డౌన్‌లోడ్ చేయడం, ఉపసంహరణలు లేదా బదిలీల కోసం ఆన్‌లైన్ క్లెయిమ్‌లు చేయడం, వ్యక్తిగత వివరాలను అప్‌డేట్, క్లెయిమ్‌లను ట్రాక్ చేయడం వంటివి ఉంటాయి. ఆధార్ ఆధారిత OTP ఉపయోగించి యాక్టివేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




