EPFO: ఉద్యోగులకు ఈపీఎఫ్‌ అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. పీఎఫ్‌ విత్‌డ్రా పరిమితి పెంపు

ఈపీఎఫ్ నుంచి మరిన్ని నిధులను ఇప్పుడు వైద్య చికిత్సకు వినియోగించుకోవచ్చు. ఈపీఎఫ్ ఖాతా నుంచి సెక్షన్ 68జే కింద విత్ డ్రా పరిమితిని రూ.50,000 నుంచి రూ.లక్షకు పెంచారు. అంటే, వైద్య చికిత్స విషయంలో ఒక లక్ష రూపాయల వరకు ఈపీఎఫ్‌ డబ్బును క్లెయిమ్ చేయవచ్చు. ఈపీఎఫ్‌ఓ ఏప్రిల్ 16న 68J కింద ఉపసంహరణ పరిమితిని పెంచుతూ సర్క్యులర్ జారీ చేసింది. ఏప్రిల్ 10న ఈపీఎఫ్‌ యాప్..

EPFO: ఉద్యోగులకు ఈపీఎఫ్‌ అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. పీఎఫ్‌ విత్‌డ్రా పరిమితి పెంపు
Epfo
Follow us

|

Updated on: Apr 17, 2024 | 5:41 PM

ఈపీఎఫ్ నుంచి మరిన్ని నిధులను ఇప్పుడు వైద్య చికిత్సకు వినియోగించుకోవచ్చు. ఈపీఎఫ్ ఖాతా నుంచి సెక్షన్ 68జే కింద విత్ డ్రా పరిమితిని రూ.50,000 నుంచి రూ.లక్షకు పెంచారు. అంటే, వైద్య చికిత్స విషయంలో ఒక లక్ష రూపాయల వరకు ఈపీఎఫ్‌ డబ్బును క్లెయిమ్ చేయవచ్చు. ఈపీఎఫ్‌ఓ ఏప్రిల్ 16న 68J కింద ఉపసంహరణ పరిమితిని పెంచుతూ సర్క్యులర్ జారీ చేసింది. ఏప్రిల్ 10న ఈపీఎఫ్‌ యాప్ సాఫ్ట్‌వేర్‌లో తగిన మార్పులు చేసింది. సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (CPFC) కూడా ఈ మార్పును ఆమోదించింది.

వివిధ ప్రయోజనాల కోసం ఈపీఎఫ్‌ ఖాతాలోని నిధుల పాక్షిక ఉపసంహరణను దరఖాస్తు ఫారమ్ 31 ద్వారా చేయవచ్చు. పెళ్లి, రుణం, ఇంటి కొనుగోలు, ఇంటి నిర్మాణం, వైద్యం ఇలా రకరకాల కారణాల జాబితా ఉంది. అయితే వైద్య చికిత్స కోసం ఈపీఎఫ్‌ నిధులు ఈ ఫారమ్‌లోని పేరా 68J కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఇపిఎఫ్ సభ్యుడికే కాదు, అతని కుటుంబ సభ్యులు కూడా అనారోగ్యం కారణంగా వైద్య చికిత్స పొందనప్పుడు కూడా ఉపసంహరణకు అర్హులు. దరఖాస్తు ఫారమ్ 31తో పాటు, ఈపీఎఫ్‌ ఖాతాదారుడు ఈపీఎఫ్‌ ఖాతాదారు పనిచేసే సంస్థ, వైద్య చికిత్స చేసే డాక్టర్ సంతకం చేసిన సర్టిఫికేట్‌ను కూడా సమర్పించాలి.

ఫారం 31 ఏమి ఉంది?

ఈపీఎఫ్‌ ఫారమ్ 31 వివిధ కారణాల వల్ల డబ్బును ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తుంది. ఇంటి కొనుగోలు, ఇంటి నిర్మాణం, ప్లాట్ కొనుగోలు వంటివి పేరా 68B కింద కారణంగా ఇవ్వవచ్చు. పేరా 68బీబీ కింద రుణం చెల్లింపు: 68H కింద ప్రత్యేక సందర్భం కోసం ముందస్తు అవసరం. 68J కింద వైద్య చికిత్స, పేరా 68K పిల్లల వివాహం, విద్య ఖర్చుల కోసం, శారీరక వికలాంగులకు 68N పేరా, 68NN కింద పదవీ విరమణకు ఒక సంవత్సరం ముందు వరకు డబ్బు ఉపసంహరణ అనుమతించబడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles