Elon Musk: ఎలోన్ మస్క్ మళ్లీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు.. 38వ స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ

గత ఏడాది అధిక నష్టాల కారణంగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రెండవ స్థానానికి పడిపోయాడు. అయితే..

Elon Musk: ఎలోన్ మస్క్ మళ్లీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు.. 38వ స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ
Elon Musk Adani

Updated on: Feb 28, 2023 | 11:00 AM

గత ఏడాది అధిక నష్టాల కారణంగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రెండవ స్థానానికి పడిపోయాడు. అయితే ఈ సంవత్సరం ఆస్తులు పెరగడంతో, అతను ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు. గత ఏడాది డిసెంబరులో ఎలోన్ మస్క్ సంపద 200 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోగా, ఆర్నాల్డ్ సంపద పెరగడంతో ఎలోన్ మస్క్‌ను బెర్నార్డ్ ఆర్నాల్ట్ అధిగమించారు. అయితే, బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ నివేదిక ప్రకారం.. ఎలోన్ మస్క్ కేవలం 2 నెలల్లోనే నంబర్ వన్ కిరీటాన్ని తిరిగి పొందాడు. అయితే ఫోర్బ్స్ బిలియనీర్‌ల జాబితాలో అతను ఇప్పటికీ రెండవ స్థానంలో ఉన్నాడు.

ఎలోన్ మస్క్ ఆస్తి ఎంత?

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఎలోన్ మస్క్ మొత్తం నికర విలువ 187 బిలియన్ డాలర్లకు చేరుకోగా, రెండవ స్థానానికి చేరుకున్న బెర్నార్డ్ ఆర్నాల్ట్ నికర విలువ 185 బిలియన్ డాలర్లు. ఈ ఏడాది ఎలాన్ మస్క్ సంపద రికార్డు స్థాయిలో పెరిగింది. జనవరి నుంచి మస్క్ తన సంపదకు $50.1 బిలియన్లను జోడించాడు. సోమవారం ఎలోన్ మస్క్ సంపద 6.98 బిలియన్ డాలర్లు పెరిగింది.

గతేడాది భారీ నష్టం

2021 సంవత్సరంలో టెస్లా CEO ఎలోన్ మస్క్ $ 200 బిలియన్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్నారు. గత ఏడాది నవంబర్, డిసెంబర్‌లలో అతని సంపదలో క్షీణత ఉంది. అది $150 బిలియన్ల కంటే తక్కువకు పడిపోయింది. టెస్లా షేర్ల విక్రయం కారణంగా మస్క్ సంపద తగ్గింది.

ఇవి కూడా చదవండి

గౌతమ్ అదానీ 38వ స్థానానికి..

ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో గౌతమ్ అదానీ 38వ స్థానానికి చేరుకున్నారు. అతని మొత్తం ఆస్తులు 33.4 బిలియన్ డాలర్లు. మరోవైపు, బ్లూమ్‌బెర్గ్ జాబితాలో గౌతమ్ అదానీ 32వ స్థానంలో ఉన్నారు. ఇక్కడ అతని మొత్తం ఆస్తులు $37.7 బిలియన్లు.

టాప్ 10లో ముఖేష్ అంబానీ

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని బిలియనీర్ల జాబితాలో అతను $ 81.1 బిలియన్ల ఆస్తులతో 10వ స్థానంలో ఉన్నాడు. మరోవైపు అంబానీ 84.3 బిలియన్ డాలర్ల ఆస్తులతో ఫోర్బ్స్ జాబితాలో 8వ స్థానంలో ఉన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి