AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Antilia: ముఖేష్ అంబానీ ఇంటి విద్యుత్ బిల్లును చూస్తే షాక్.. సామాన్యుడి 30 ఏళ్ల కష్టం

సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో విద్యుత్ ను చాలా పొదుపుగా వినియోగిస్తారు. అవసరమైన మేర మాత్రమే ఫ్యాన్లు, లైట్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులను వాడుకుంటారు. ప్రతి నెలా వచ్చే విద్యుత్ బిల్లును లెక్కించకుంటూ చాలా జాగ్రత్తగా ఉంటారు. మరి దేశంలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ విద్యుత్ వాడకం ఎలా ఉంటుంది.

Antilia: ముఖేష్ అంబానీ ఇంటి విద్యుత్ బిల్లును చూస్తే షాక్.. సామాన్యుడి 30 ఏళ్ల కష్టం
Mukesh Ambani House
Nikhil
|

Updated on: Apr 04, 2025 | 8:11 PM

Share

అత్యంత విలాసవంతమైన అంబానీ ఇంటికి నెలకు విద్యుత్ బిల్లు ఎంత వస్తుందనే ప్రశ్న ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. 2010లో ముఖేష్ అంబానీ భవనం ప్రారంభమైన తర్వాత మొదటి నెల విద్యుత్ బిల్లు అక్షరాలా రూ.70,69,488 వచ్చింది. ఇది ఒక సగటు భారతీయుడు 30 ఏళ్లలో సంపాదించే ఆదాయం. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల కలల సౌధం అయిన భవనం పేరు ఆంటిలియా. ఇది 27 అంతస్తులు కలిగిన ఒక అద్భుత భవనం. ప్రపంచంలో రెండో అత్యంత ఖరీదైన నివాసం. దీనిలో హెలీప్యాడ్లు, స్పా, ఆలయం, 168 కార్లకు సరిపడే పార్కింగ్ స్థలం ఉన్నాయి. ఇంతపెద్ద భవనానికి విద్యుత్ వినియోగంగా కూడా భారీగా ఉంటుంది. ఆంటిలియా భవన నిర్మాణాన్ని 2005లో ప్రారంభించగా, 2010 నాటికి పూర్తయ్యింది. దీనికి సుమారు 2 బిలియన్ల డాలర్లు ఖర్చయినట్టు అంచనా. బకింగ్ హామ్ ప్యాలెస్ తర్వాత ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదైన భవనంగా పేరు పొందింది.

ముఖేష్ అంబానీ తన భవనానికి ఆంటిలియా అనే పేరు పెట్టడానికి ప్రత్యేక కారణముంది. దీనికి ఒక ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్నట్టు చెబుతారు. అట్లాంటిక్ మహా సముద్రంలోని ఒక పురాణ ఫాంటమ్ ద్వీపం నుంచి ప్రేరణ పొంది ఈ పేరు పెట్టారు. ఇది కేవలం ఇల్లు మాత్రమే కాదు. ఒక ఆశయం, విజయం, ఆవిష్కరణలకు చిహ్నంగా చెప్పవచ్చు. ముంబై లోని అత్యంత విలాస వంతమైన నివాసంగా పేరుపొందింది.

ఆంటిలియాను ఒక అద్బుతమైన హై – ఎండ్ లక్షణాలతో కూడిన ఇంజినీరింగ్ టెక్నాలజీతో, అన్ని రకాల వసతులతో రూపొందించారు. మూడు హెలిప్యాడ్లు, 168 కార్లకు సరిపడే పార్కింగ్ స్థలం, విలాసవంతమైన స్పా, హెల్త్ సెంటర్, ఈత కొలను, ఆలయం, పచ్చదనంతో కూడిన టెర్రస్ కోట, తొమ్మిది హై స్పీడ్ లిఫ్ట్ లు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

ఆంటిలియా భవన నిర్మాణం 2010లో పూర్తయ్యింది. అనంతరం ముఖేష్, నీతా అంబానీ దంపతులు ఆ ఇంటిలోకి అధికారికంగా మారిపోయారు. ఈ 400,000 చదరపు అడుగుల పరిమాణం గల విలాసవంతమైన భవనానికి విద్యుత్ వాడకం కూడా అదే రేంజ్ లో అవసరమవుతుంది. దీంతో మొట్టమొదటి నెలలో వచ్చిన విద్యుత్ బిల్లును చూసి దేశం మొత్తం షాకైంది. ఒక నెలలోనే 6,37,240 యూనిట్లను వినియోగించగా, బిల్లు రూ.70,69,488 వచ్చింది. ఈ మొత్తంతో ముంబైలో సరికొత్త లగ్జరీ కారును కొనుగోలు చేయవచ్చు. లేదా అపార్టుమెంటును తీసుకోవచ్చు.