UPI Payment: యూపీఐతో రాంగ్ పేమెంట్ చేశారా? కంగారొద్దు.. ఇలా చేస్తే వాపస్ వచ్చేస్తాయి..

యూపీఐ ద్వారా డబ్బులు పంపేటప్పుడు కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి. నంబర్ ఏమాత్రం తప్పుగా కొట్టిన మనం పంపాల్సిన వారికి కాకుండా వేరొకరికి డబ్బులు వెళ్లిపోతాయి. వాళ్లు మన మిత్రులు, బంధువులు అయితే వెంటనే వెనక్కి వేసేస్తారు. కానీ బయటి వాళ్లు అయ్యి, డబ్బులు వెనకకు పంపడానికి ఇష్టపడకపోతే ఇబ్బంది ఎదురవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? తెలుసుకుందాం రండి..

UPI Payment: యూపీఐతో రాంగ్ పేమెంట్ చేశారా? కంగారొద్దు.. ఇలా చేస్తే వాపస్ వచ్చేస్తాయి..
Upi Id
Follow us

|

Updated on: Jul 15, 2024 | 5:47 PM

నేటి డిజిటల్ యుగంలో ప్రతి పనీ ఆన్ లైన్ లో చాలా సులువుగా జరుగుతోంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక అనేక వెసులుబాట్లు కల్పించింది. టెక్నాలజీని ఉపయోగించుకుని చాలా వేగంగా లావాదేవీలు పూర్తి చేసుకోవచ్చు. ప్రధానంగా యూపీఐ లావాదేవీలు ప్రజలకు బాగా అందుబాటులోకి వచ్చాయి. ఏమి కొన్నాలన్నా, తినాలన్నా, వేరొకరికి డబ్బులు పంపించాలన్నా యూపీఐ ద్వారా క్షణాల్లో జరిగిపోతోంది. స్మార్ట్ ఫోన్ తో పాటు బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉంటే లావాదేవీలన్ని నిర్వహించవచ్చు.

పొరపాటు జరిగితే..

యూపీఐ ద్వారా డబ్బులు పంపేటప్పుడు కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి. నంబర్ ఏమాత్రం తప్పుగా కొట్టిన మనం పంపాల్సిన వారికి కాకుండా వేరొకరికి డబ్బులు వెళ్లిపోతాయి. వాళ్లు మన మిత్రులు, బంధువులు అయితే వెంటనే వెనక్కి వేసేస్తారు. కానీ బయటి వాళ్లు అయ్యి, డబ్బులు వెనకకు పంపడానికి ఇష్టపడకపోతే ఇబ్బంది ఎదురవుతుంది.

కంగారొద్దు..

యూపీఐ ద్వారా పొరపాటును వేరొకరికి డబ్బులు పంపినా కంగారు పడకూడదు. కొన్ని పద్ధతులు పాటించి మన సొమ్మును వెనకకు రప్పించుకోవచ్చు. దానికోసం ఈ కింద తెలిపిన విధానాలను అనుసరించాలి.

  • ముందుగా యూపీఐ లావాదేవీలో పొరపాటు ఎక్కడ జరిగిందో నిర్ధారణ చేసుకోవాలి. మీరు నంబర్ తప్పుగా ఎంటర్ చేయవచ్చు. పంపిన మొత్తం తప్పు కావచ్చు. లేదా క్యూాఆర్ కోడ్‌ వల్ల పొరపాటు జరగవచ్చు. ఏ విషయంలో తప్పు జరిగిందో ముందు గమనించాలి.
  • మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పొరపాటున డబ్బు పంపినప్పుడు తిరిగి పొందడం సులభం. కానీ మీకు తెలియని వ్యక్తికి మీరు డబ్బు పంపినప్పుడు, అతడు వెనక్క ఇవ్వడానికి ఒప్పుకోనప్పుడు ఈ కింద పద్ధతులు పాటించాలి.
  • నేరుగా బ్యాంక్‌ని సంప్రదించాలి. తప్పు క్రెడిట్ ఛార్జ్‌ బ్యాక్ కోసం అభ్యర్థనను అందజేయాలి.
  • లావాదేవీకి సంబంధించిన యూటీఆర్ వివరాలు బ్యాంకు అధికారులకు తెలియజేయాలి.
  • మీరు డబ్బు పంపిన వ్యక్తి కూడా అదే బ్యాంక్‌లో ఖాతాను కంటే.. మీ బ్యాంక్ నేరుగా అతనితో సంప్రదింపులు జరుపుతారు.
  • ఒకవేళ ఆ వ్యక్తి వేరే బ్యాంకు ఖాతాదారుడైతే అతడి వివరాలు మాత్రమే అందజేస్తారు. మీరు వాటిని తీసుకుని సంబంధిత బ్యాంకుకు వెళ్లాలి.
  • ఆ వ్యక్తి (రిసీవర్) అంగీకరిస్తే డబ్బు వెనుకకు వస్తుంది. ఇందుకోసం సుమారు 7 రోజులు పడుతుంది.
  • కానీ రిసీవర్ తిరస్కరించినా, బ్యాంక్ మీకు సహాయం చేయకపోయినా మీరుnpci.org.inలో ఫిర్యాదు చేయాలి.
  • ఆ ఫిర్యాదు పంపిన తర్వాత 30 రోజులకు మించి ఎటువంటి చర్య తీసుకోనట్లు కనిపిస్తే, మీరు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించి, సమస్యను పరిష్కరించవచ్చు.

బ్యాంకుల దర్యాప్తు..

యూపీఐ తప్పు లావాదేవీపై మీరు ఫిర్యాదు అందించిన తర్వాత బ్యాంకులు వెంటనే చర్యలు ప్రారంభిస్తున్నాయి. మీకు న్యాయం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాయి. అయితే సమస్య పరిష్కారం కావడానికి రిసీవర్ సహకారం చాలా అవసరం.

ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో..

  • ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో మీ యూపీఐ లావాదేవీ తప్పుగా జరిగితే ఈ విధంగా చర్యలు తీసుకోవాలి.
  • ఫోన్‌లో ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ను తెరవాలి.
  • సహాయ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • సహాయం కోసం చాట్‌బాట్‌ని అడగండి.
  • అవసరమైన సమాచారాన్ని నమోదు చేయండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Horoscope Today: ఆర్థిక విషయాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
Horoscope Today: ఆర్థిక విషయాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఆర్మీ.. ఈ ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్..
ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఆర్మీ.. ఈ ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్..
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా
తెరపైకి సరికొత్త చర్చ.. ఆ పార్టీలో మొదలైన ప్రోటోకాల్ రచ్చ..
తెరపైకి సరికొత్త చర్చ.. ఆ పార్టీలో మొదలైన ప్రోటోకాల్ రచ్చ..
చూడ ముచ్చటైన డిజైన్‌తో సీఎమ్‌ఎఫ్‌ ఇయర్‌ బడ్స్‌..
చూడ ముచ్చటైన డిజైన్‌తో సీఎమ్‌ఎఫ్‌ ఇయర్‌ బడ్స్‌..
ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం.. పట్టు తప్పితే అంతే సంగతులు..
ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం.. పట్టు తప్పితే అంతే సంగతులు..
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. పంత్ ఔట్?
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. పంత్ ఔట్?
కాంగ్రెస్ గూటికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి..
కాంగ్రెస్ గూటికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి..
Controversy:వివాదస్పదమైన టీమిండియా మాజీ క్రికెటర్ల స్టెప్పులు..
Controversy:వివాదస్పదమైన టీమిండియా మాజీ క్రికెటర్ల స్టెప్పులు..
ఢిల్లీలో ఘనంగా జగన్నాథుని రథోత్సవం.. పాల్గొన్న కేంద్ర మంత్రులు..
ఢిల్లీలో ఘనంగా జగన్నాథుని రథోత్సవం.. పాల్గొన్న కేంద్ర మంత్రులు..