Britannia: బిస్కెట్ కంపెనీకి జరిమానా విధించిన అధికారులు.. కారణం ఏంటో తెలుసా.?

వినియోగదారుల హక్కులను ఉల్లంఘించిన సందర్భాల్లో అధికారులు సదరు సంస్థలకు జరిమానాలు విధించడం సర్వసాధారణమైన విషయమే. తాజాగా కేరళలో ప్రముఖ బిస్కెట్ తయారీ కంపెనీ బ్రిటానియాకు అధికారులు ఏకంగా రూ. 60,000 జరిమానా విధించారు. బిస్కెట్ ప్యాకెట్‌ కొనుగోలు చేసిన వ్యక్తికి ఈ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు...

Britannia: బిస్కెట్ కంపెనీకి జరిమానా విధించిన అధికారులు.. కారణం ఏంటో తెలుసా.?
Biscuit
Follow us

|

Updated on: May 26, 2024 | 7:01 AM

వినియోగదారుల హక్కులను ఉల్లంఘించిన సందర్భాల్లో అధికారులు సదరు సంస్థలకు జరిమానాలు విధించడం సర్వసాధారణమైన విషయమే. తాజాగా కేరళలో ప్రముఖ బిస్కెట్ తయారీ కంపెనీ బ్రిటానియాకు అధికారులు ఏకంగా రూ. 60,000 జరిమానా విధించారు. బిస్కెట్ ప్యాకెట్‌ కొనుగోలు చేసిన వ్యక్తికి ఈ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇంతకీ ఆ కంపెనీ చేసిన తప్పేంటి.? ఎందుకు జరిమానా చెల్లించాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం..

వివరాల్లోకి వెళితో.. కేరళలోని త్రిస్సూర్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి స్థానికంగా ఉన్న ఓ బేకరీలో బ్రిటానియా కంపెనీకి చెందిన రెండు ‘న్యూట్రి ఛాయిస్‌ థిన్‌ యారో రూట్‌ బిస్కెట్స్‌’ను కొనుగోలు చేశాడు. వాటి ప్యాకేజీపైన బిస్కెట్స్‌ బరువు 300 గ్రాములగా ఉంది. అయితే బరువు తక్కువగా ఉన్నట్లు అనుమానించిన సదరు కస్టమర్‌ వాటిని ఓసారి తూకం వేసి చెక్‌ చేయించాడు. దీంతో ఆ ప్యాకెట్ల బరువు 268 గ్రాములు, 248 గ్రాములుగా ఉంది. కంపెనీ పేర్కొన్న బరువు కంటే తక్కువగా ఉండడంతో కస్టమర్‌ త్రిస్సూర్ లోని లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్‌కు ఫిర్యాదు చేశాడు.

వాటిని పరిశీలించిన అధికారులు సైతం బిస్కెట్‌ పాకెట్ల బరువు తక్కువ ఉన్నట్లు నిర్ధారించారు. వినియోగదారుల రక్షణ చట్టం, 2009 లీగల్ మెట్రాలజీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ దోపిడీ, అన్యాయమైన వాణిజ్య పద్ధతుల నుంచి విముక్తి పొందే వినియోగదారుడి హక్కును బ్రిటానియా కంపెనీ, స్థానిక బేకరీ ఉల్లంఘించాయని కమిషన్ గుర్తించింది. దీంతో ఫిర్యాదుదారుడికి నష్ట పరిహారం కింద రూ.50 వేలు, అతను భరించిన లిటిగేషన్ ఖర్చుల కింద రూ.10 వేలు చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. అటు బ్రిటానియా ఇండస్ట్రీస్‌తో పాటు, స్థానిక బేకరీని జరిమానా చెల్లించాలని కమిషన్‌ ఆదేశించింది. దీంతో ఈ సంఘటన స్థానికంగా ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..