10000 Note: భారత్‌లో పది వేల రూపాయల నోటు ఉండేదని తెలుసా? నిలిపివేతకు అసలు కారణం ఏంటంటే?

|

Dec 04, 2024 | 5:15 PM

భారతదేశంలో అతి పెద్ద విలువైన కరెన్సీ నోటు ఏదంటే అందరూ ఇప్పుడు 500 నోటు అంటారు. గతంలో అయితే రెండు వేల నోటు ఉండేది. ఆర్‌బీఐ రెండు వేల నోటును రద్దు చేశాక రూ.500 నోటే అతి పెద్ద నోటుగా ఉంది. అయితే భారతదేశం ఒకప్పుడు రూ.10,000 కరెన్సీ నోటును విడుదల చేసిందని మీకు తెలుసా? ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. భారతదేశంలో పది వేల రూపాయల నోటు 1938లో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో పది వేల నోటు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

10000 Note: భారత్‌లో పది వేల రూపాయల నోటు ఉండేదని తెలుసా? నిలిపివేతకు అసలు కారణం ఏంటంటే?
10000 Note
Follow us on

దేశంలోని కరెన్సీ వ్యవస్థ ఒక అణా (రూపాయిలో 1/16వ వంతు), రెండు అణాల వంటి నాణేలపై ఆధారపడే సమయంలో రూ.10,000 నోటు మన కరెన్సీ చరిత్రలోనే అతిపెద్ద డినామినేషన్‌గా గుర్తింపు పొందింది. 1938లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రూ. 10,000 నోటును విడుదల చేసింది. ఆశ్చర్యకరంగా ఉన్నా 25 పైసలు, 50 పైసలు వంటి చిన్న నాణేలు కూడా 1957 వరకు ప్రవేశపెట్టలేదు కానీ రూ.10 వేల నోటు మాత్రం ప్రవేశపెట్టారు. రూ. 10,000 నోటు ప్రధానంగా వ్యాపారస్తులకు పెద్ద లావాదేవీలను సులభతరం చేయడానికి ప్రవేశపెట్టారు. అవును మీరు వింటున్నది నిజమే అప్పట్లో కేవలం వ్యాపార రంగానికి అనుబంధంగా ఉన్న వారే ఈ నోటును చూశారు. సాధారణ ప్రజలకు ఇది అందుబాటులో ఉండేది కాదు. 

పది వేల రూపాయల నోటు ప్రవేశపెట్టిన ఎనిమిది సంవత్సరాల తర్వాత అంటే 1946 జనవరిలో బ్రిటిష్ ప్రభుత్వం రూ.10,000 నోటును ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో హోర్డింగ్, బ్లాక్-మార్కెట్ కార్యకలాపాల పెరుగుదలపై ఆందోళనల మధ్య ఈ రద్దు నిర్ణయం తీసుకున్నారు. అలాంటి అధిక విలువ కలిగిన కరెన్సీని నిలిపివేయడం ఈ సమస్యలను అరికట్టడంలో సహాయపడుతుందని ప్రభుత్వం విశ్వసించి రూ.10 వేల నోటును రద్దు చేసింది. మొదట ఉపసంహరించుకున్నప్పటికీ రూ. 10,000 నోటు 1954లో, రూ. 5,000 నోటు వంటి ఇతర పెద్ద నోట్లతో పాటు తిరిగి ప్రవేశపెట్టారు. 1978 నాటికి మళ్లీ రూ. 5,000, రూ. 10,000 నోట్లు రెండూ మళ్లీ నిలిపివేశారు. 

1970ల మధ్య నాటికి చెలామణిలో ఉన్న రూ.10,000 నోట్ల మొత్తం విలువ రూ.7,144 కోట్లకు చేరుకుంది. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రతిపాదనతో సహా భవిష్యత్తులో రూ.5,000, రూ.10,000 నోట్లను మళ్లీ ప్రవేశపెట్టడంపై చర్చలు జరిగినప్పటికీ చివరికి ఈ సూచనలు తిరస్కరణకు గురయ్యాయి. చివరికి రూ. 10,000 నోటు ఒకప్పుడు భారతదేశంలో అతిపెద్ద డినామినేషన్‌గా చరిత్రలో నిలిచిపోయింది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి