Best Airport: భారత్‌లో బెస్ట్‌ ఎయిర్‌పోర్టు అదే.. దక్షిణాసియాలో అత్యుత్తమ విమానాశ్రయంగా ఎంపిక

|

Jun 18, 2022 | 4:48 PM

Best Airport: దక్షిణాసియాలో అత్యుత్తమ విమానాశ్రయంగా టైటిల్‌ను కైవసం చేసుకుంది. ప్రపంచంలోనే టాప్‌ 50లో ఉన్న ఏకైక భారతీయ విమానాశ్రయంగా అవతరించింది...

Best Airport: భారత్‌లో బెస్ట్‌ ఎయిర్‌పోర్టు అదే.. దక్షిణాసియాలో అత్యుత్తమ విమానాశ్రయంగా ఎంపిక
Follow us on

Delhi Airport: ఢిల్లీ విమానాశ్రయం 2022లో వరుసగా నాలుగో సంవత్సరం భారతదేశం, దక్షిణాసియాలో అత్యుత్తమ విమానాశ్రయంగా టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఢిల్లీ ఇందీరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం గత సంవత్సరం 45వ స్థానం నుంచి 37వ స్థానానాకి చేరుకుంది. ప్రపంచంలోనే టాప్‌ 50లో ఉన్న ఏకైక భారతీయ విమానాశ్రయంగా అవతరించింది. విమానాశ్రయంలో పని చేస్తున్న సిబ్బంది, అందించే సేవల కారణంగా ఢిల్లీ విమానాశ్రయాన్ని భారతదేశం, దక్షిణాసియాలో అత్యుత్తమ విమానాశ్రయంగా మారింది. ఇప్పుడు ఢిల్లీ విమానాశ్రయం ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకోవడం ఎంతో గర్వంగా ఉంది. ఢిల్లీ విమానాశ్రయం తన ప్రయాణీకులందరికీ అత్యుత్తమ విమానాశ్రయ అనుభవాన్ని అందించడంలో ఎల్లప్పుడూ కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుంది.. ఇది ఎప్పటికి కొనసాగుతుందని GMR ఇన్‌ఫ్రా నేతృత్వంలోని కన్సార్టియం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అథారిటీ లిమిటెడ్ (DIAL) CEO విదేహ్ జైపురియార్ అన్నారు.

16 జూన్ 2022న ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లోని ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్‌పోలో జరిగిన 2022 వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డ్స్‌లో హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రెండవ సంవత్సరం ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా పేరుపొందింది. ఇతర ప్రధాన విజేతలలో సింగపూర్ చాంగి ఎయిర్‌పోర్ట్, అవార్డులను గెలుచుకుంది. ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ సర్వీస్, వరల్డ్స్ బెస్ట్ ఎయిర్‌పోర్ట్ డైనింగ్ కోసం ఇస్తాంబుల్ విమానాశ్రయం ప్రపంచంలోని ఉత్తమ విమానాశ్రయం, అత్యుత్తమ ఎయిర్‌పోర్టుగా అవార్డులను గెలుచుకుంది. టోక్యో హనేడా విమానాశ్రయం ప్రపంచంలోని పరిశుభ్రమైన విమానాశ్రయం, ప్రపంచంలోని ఉత్తమ దేశీయ విమానాశ్రయం, ఆసియాలో అత్యుత్తమ విమానాశ్రయం, ఉత్తమ విమానాశ్రయం PRM & యాక్సెస్ సౌకర్యాలు వంటి అవార్డులను గెలుచుకుంది. రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత మెరుగైన విమానాశ్రయంగా అవార్డును పొందింది. నగోయా చుబు సెంట్రైర్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా పేరుపొందింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి