Employees Fired: తనను విమర్శించారని ఉద్యోగులను తొలగించిన వ్యాపార కుబేరుడు.. ఎక్కడంటే..

Employees Fired: కార్పొరేట్ ప్రపంచంలో ఒక విషయం చెప్పబడింది. అదేంటంటే.. బాస్ నిర్ణయం ఎప్పుడూ సరైనదే. ఉద్యోగులు బాస్ ఏది చెబితే దానిని చేయాలి.

Employees Fired: తనను విమర్శించారని ఉద్యోగులను తొలగించిన వ్యాపార కుబేరుడు.. ఎక్కడంటే..
Employees Fired
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Jun 18, 2022 | 5:05 PM

Employees Fired: కార్పొరేట్ ప్రపంచంలో ఒక విషయం చెప్పబడింది. అదేంటంటే.. బాస్ నిర్ణయం ఎప్పుడూ సరైనదే. ఉద్యోగులు బాస్ ఏది చెబితే దానిని చేయాలి. తాజాగా స్పేస్‌ఎక్స్‌లోనూ ఇదే జరిగింది. కంపెనీలోని కొందరు ఉద్యోగులు కొందరు తమ యజమానికి బహిరంగ లేఖలు రాస్తూ ‘విమర్శలు’ చేయడంతో.. వారు తమ ఉద్యోగాలను కోల్పోవలసి వచ్చింది. ఇది జరిగింది ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా ఉన్న ఎలాన్ మస్క్ కు చెందిన సంస్థలో కావటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

వాస్తవానికి ఈ మొత్తం విషయం స్పేస్‌ఎక్స్ ప్రెసిడెంట్ గ్వైన్ షాట్‌వెల్ నుంచి వచ్చిన ఈ-మెయిల్ ద్వారా వెల్లడైంది. ఎలాన్ మస్క్ వ్యవహారశైలిని విమర్శిస్తూ బహిరంగ లేఖ రాసిన ఉద్యోగుల తొలగింపును ఈ-మెయిల్ ప్రస్తావించినట్లు న్యూయార్క్ టైమ్స్ తొలిసారిగా నివేదించింది. అయితే ఎంత మంది ఉద్యోగాలు కోల్పోయారు అనేది మాత్రం వెల్లడించలేదు. ఉద్యోగులు రాసిన లేఖలో ఎలాన్ మస్క్ ట్వీట్లపై విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగులు లైన్ దాటి ప్రవర్తించినట్లు భావించి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఎలాన్ మస్క్ తొలిసారి ట్విట్టర్ ఉద్యోగులతో మాట్లాడిన రోజే ఉద్యోగులను తొలగించారు. ఇటీవల టెస్లా 44 బిలియన్ డాలర్లు ఆఫర్ చేయడం ద్వారా ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఎలాన్ మస్క్ ట్విటర్ విధానానికి, ముఖ్యంగా నకిలీ ఖాతాల విషయమై తీవ్ర విమర్శకుడిగా కూడా ఉన్నారు. ఇటీవల డాగ్‌కాయిన్ గురించి ట్వీట్ చేసినందుకు ఎలాన్ మస్క్ నుంచి ఒక వ్యక్తి 258 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 20,13,730 కోట్లు) నష్టపరిహారం కోరాడు. కీత్ జాన్సన్ అనే వ్యక్తి మాన్‌హట్టన్‌లోని ఫెడరల్ కోర్టులో డాగ్‌కాయిన్‌లో పెట్టుబడుల నుంచి నష్టపరిహారం కోసం ఒక పిటిషన్‌ను దాఖలు చేశాడు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!