AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Score: రుణాలు, క్రెడిట్‌ కార్డు బకాయిలు ఆలస్యంగా చెల్లిస్తున్నారా..? ఇలా చేస్తే నష్టమే..!

Credit Score: మీరు క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారా..? లేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారా..? సమయానికి రుణాలు గానీ, క్రెడిట్‌ కార్డు బిల్లులు చెల్లించడం లేదా..?..

Credit Score: రుణాలు, క్రెడిట్‌ కార్డు బకాయిలు ఆలస్యంగా చెల్లిస్తున్నారా..? ఇలా చేస్తే నష్టమే..!
Subhash Goud
|

Updated on: Feb 09, 2022 | 8:01 AM

Share

Credit Score: మీరు క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారా..? లేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారా..? సమయానికి రుణాలు గానీ, క్రెడిట్‌ కార్డు బిల్లులు చెల్లించడం లేదా..? ఇలాంటి వారు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. రుణాలు తీసుకున్న వారు, క్రెడిట్‌ కార్డు ఉపయోగిస్తున్నవారికి క్రెడిట్‌ స్కోర్‌ అనేది చాలా ముఖ్యం. క్రెడిట్‌ స్కోర్‌ అనేది రుణగ్రహిత క్రెడిట్‌ విలువను సూచిస్తుంది. రుణాలు తీసుకున్న వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా క్రెడిట్‌ బ్యూరోలు క్రెడిట్‌ స్కోర్‌ అందిస్తాయి. క్రెడిట్ స్కోరు ఎక్కువగా ఉంటే, భవిష్యత్తులో త‌క్కువ రేట్లతో రుణం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న రుణగ్రహీతలు అధిక రుణం ఉన్నవారు క్రమంగా రుణాన్ని చెల్లించ‌క‌పోతే, బ్యాంకులు తక్కువ మొత్తంలో రుణాలు ఇవ్వడం, లేదా రుణ దరఖాస్తులను తిరస్కరించడం చేస్తుంటాయి.

అయితే ప్రస్తుతం 750కి మించి క్రెడిట్‌ స్కోర్‌ ఉన్నప్పుడే రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతాయి బ్యాంకులు. ఈ స్కోర్‌ దాటిన వారికి బ్యాంకులు అధిక ప్రాధాన్యత ఇస్తుంటాయి. అయితే ఈ స్కోర్‌ను దాటాలంటే పెద్ద కష్టమైన పని కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మీరు చెల్లించాల్సిన వాయిదాలు, క్రెడిట్‌ కార్డు బిల్లులు సకాలంలో చెల్లిస్తే చాలు క్రెడిట్‌ స్కోర్‌ పెరుగుతుంది. కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది వాయిదాలు, క్రెడిట్‌ కార్డు బిల్లులను ఆలస్యంగా చెల్లించారు. దీంతో వారిపై స్కోర్‌ ప్రభావం పడుతుంది.

సెటిల్‌మెంట్‌తో ఇబ్బందే..

చాలా మంది రుణాలు, క్రెడిట్‌ కార్డు బిల్లులు చెల్లించకపోవడం వల్ల క్రెడిట్‌ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. రుణ గ్రహిత వరుసగా మూడు నెలలపాటు వాయిదాలు చెల్లించనట్లయితే బ్యాంకులు దానిని నిరర్ధక ఆస్తిగా పరిగణిస్తాయి. చెల్లింపులు పూర్తిగా నిలిచిపోతే డిఫాల్ట్‌గా పరిగణించి, బ్యాంకులు ఏదో ఒక విధంగా కొంత మొత్తాన్ని కట్టించుకునే ప్రయత్నాలు చేస్తాయి. దీనినే సెటిల్‌మెంట్‌ అని పిలుస్తారు. అంగీకరించిన మొత్తాన్ని చెల్లిస్తే ఆ అప్పును పూర్తి స్థాయిలో రద్దు చేస్తారన్నట్లు.

బ్యాంకులు ఈ విషయాన్ని క్రెడిట్ బ్యూరోలకు సమాచారం అందిస్తాయి. దీని వల్ల ఆయా రుణాలను సెటిల్డ్‌ అని పేర్కొంటారు. క్రెడిట్‌ నివేదికలో ఇది కనిపించినప్పుడు బ్యాంకులు కొత్త రుణాలు ఇచ్చేందుకు వెనుకంజ వేస్తాయి. ఒక వేళ వాయిదా పడ్డ రుణాన్ని సెటిల్‌మెంట్‌ చేసుకుంటే వీలైతే దాని మొత్తం చెల్లించేందుకు ప్రయత్నించండి. దీని వల్ల సెటిల్‌ నుంచి క్లోజ్డ్‌కు మారుతుంది. క్రెడిట్‌ స్కోరు పెరిగేందుకూ వీలవుతుంది. మీ రుణ వాయిదాలను ఒక్కసారి ఆలస్యంగా చెల్లిస్తే క్రెడిట్‌ స్కోర్‌ 100 పాయింట్లకు పైగా ప్రభావితం చేస్తుందని బ్యాంకు నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Jio Calls, Data Free: రిలయన్స్‌ జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. రెండు రోజులు ఉచితంగా కాల్స్‌, డేటా

Home Loan Tax Benefit: హోమ్‌ లోన్‌తో అదిరిపోయే బెనిఫిట్‌.. రూ.5 లక్షల వరకు ఆదా..!