UPI Payments: రూపే క్రెడిట్ కార్డుతో యూపీఐ పేమెంట్స్ చేయడం ఇక చాలా ఈజీ.. పూర్తి వివరాలు
రూపే క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టిన ఎన్పీసీఐ పలు బ్యాంకుల అనుసంధానంతో యూపీఐ ఆధారిత క్రెడిట్ కార్డు లావాదేవీలను అనుమతిస్తోంది. ఇప్పుడు ప్రముఖ క్రెడిట్ ఏజెన్సీ క్రెడ్(CRED) కూడా ఎన్పీసీఐతో కలిసి రూపే క్రెడిట్ కార్డ్ ఆధారిత యూపీఐ పేమెంట్లను అందిస్తోంది. క్రెడ్ కు లింక్ అయిన రూపే క్రెడిట్ కార్డు ద్వారా ఒక సాధారణ స్కాన్‌తో లావాదేవీలను వేగంగా, సురక్షితంగా పూర్తి చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యూపీఐ) ఆధారిత లావాదేవీలకు మార్కెట్లో డిమాండ్ ఉంది. ఎక్కువశాతం మంది ఈ విధానాన్నే వినియోగిస్తున్నారు. సౌకర్యంతో పాటు అధిక భద్రత ఉంటుండంతో అందరూ యూపీఐ లావాదేవీలు చేస్తున్నారు. దీంతో క్రెడిట్ కార్డులకు కూడా యూపీఐలో తీసుకువచ్చారు. రూపే క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టిన ఎన్పీసీఐ పలు బ్యాంకుల అనుసంధానంతో యూపీఐ ఆధారిత క్రెడిట్ కార్డు లావాదేవీలను అనుమతిస్తోంది. ఇప్పుడు ప్రముఖ క్రెడిట్ ఏజెన్సీ క్రెడ్(CRED) కూడా ఎన్పీసీఐతో కలిసి రూపే క్రెడిట్ కార్డ్ ఆధారిత యూపీఐ పేమెంట్లను అందిస్తోంది. క్రెడ్ మెంబర్స్ అందరూ కూడా హెచ్ డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బీఓబీ ఫైనాన్షియల్ సొల్యూషన్స్, కెనరా బ్యాంకు, ఇండియన్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ , పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ లు అందించే రూపే క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ లావాదేవీలు చేయొచ్చని ప్రకటించింది.
ఇలా చేయాలి..
యూపీఐ ద్వారా వ్యాపారులకు చెల్లింపులు చేయడానికి క్రెడ్ సభ్యులు ఇప్పుడు వారి రూపే క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించవచ్చు. క్రెడ్ కు లింక్ అయిన రూపే క్రెడిట్ కార్డు ద్వారా ఒక సాధారణ స్కాన్‌తో లావాదేవీలను వేగంగా, సురక్షితంగా పూర్తి చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. క్రెడిట్ ఎకోసిస్టమ్‌లో వినియోగం, చేరిక పెరగడం వల్ల బ్రాండ్‌లు, వ్యాపారులు ప్రయోజనం పొందుతారని క్రెడ్ తెలిపింది.
ఫీచర్లోని ప్రధానాంశాలు..
క్రెడిట్ కార్డ్‌ల వినియోగం పెరుగుతుంది.. క్రెడిట్ కార్డుల యూపీఐ లావాదేవీలు చేయడం అధికంగా వినియోగంలోకి వస్తే వినియోగదారులకు ఉపయుక్తంగా ఉంటుంది. క్రెడిట్ కార్డు వినియోగం పెరుగుతుంది.
అనుకూలత.. క్రెడిట్ కార్డ్‌లను బయటకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ఇది తొలగిస్తుంది. క్రెడ్ లో సేవ్ చేసిన కార్డ్‌లను ఉపయోగించి చెల్లింపులను పూర్తి చేయొచ్చు. క్రెడ్ యాప్ లోనే బిల్లులు చూడటం, చెల్లించడం పూర్తి చేయొచ్చు.
రివార్డులు.. క్రెడిట్ కార్డ్‌ల ద్వారా యూపీఐ లావాదేవీలు చేయడం ద్వారా కస్టమర్‌లు తమ క్రెడిట్ కార్డ్‌లు, అలాగే క్రెడ్ యాప్ లో కొన్ని రివార్డులను అందిస్తుంది.
ఈ సందర్భంగా ఎన్పీసీఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణా రాయ్ మాట్లాడుతూ యూపీఐతో రూపే క్రెడిట్ కార్డ్‌ల అనుసంధానం క్రెడిట్ వినియోగించే విధానంలో విప్లవాత్మక మార్పులు తెస్తోందన్నారు. క్రెడిట్ మద్దతుతో డిజిటల్ చెల్లింపుల స్వీకరణను ప్రోత్సహిస్తుందన్నారు. ఈ ఫీచర్‌తో, కస్టమర్‌లు ఫిజికల్ కార్డ్‌లను తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండానే, వ్యాపారి అవుట్‌లెట్‌లలో చెల్లింపులు చేసే సౌలభ్యాన్ని పొందుతారని పేర్కొన్నారు. క్రెడ్ వ్యవస్థాపకుడు కునాల్ షా మాట్లాడుతూ భారతదేశం ఆర్థిక ఆవిష్కరణల్లో దూసుకెళ్తోందని చెప్పారు. అందుకు యూపీఐ బాగా దోహదపడుతోందన్నారు.
క్రెడ్ యాప్ లో యూపీఐ ని ఇలా యాక్టివేట్ చేయాలి..
- క్రెడ్ యాప్ ని తెరిచి, హోమ్‌పేజీలో కుడి వైపు ఎగువన సెట్టింగ్‌లలోకి వెళ్లండి. వచ్చిన ఆప్షన్లలో నుంచి యూపీఐ సెట్టింగ్‌లను ఎంచుకోండి.
- మీ క్రెడిట్ కార్డ్‌లలో యాక్టివేట్ యూపీఐని ఎంచుకోండి.
- రూపే కార్డ్‌లోని చివరి 6 అంకెలు, గడువు తేదీని నమోదు చేయండి.
- ప్రామాణీకరించడానికి మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయండి.
- రూపే కార్డ్‌ని ఉపయోగించడం కోసం మీ యూపీఐ పిన్‌ని సెట్ చేయండి.
- వ్యాపారులకు యూపీఐ చెల్లింపులు చేసేటప్పుడు రూపే క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోండి. వ్యాపారులకు చెల్లించేటప్పుడు మీరు దీన్ని డిఫాల్ట్ ఎంపికగా కూడా సెట్ చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..