AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Pickle: కిలో చికెన్‌ పచ్చడి అమ్మితే ఎంత లాభం వస్తుందే తెలిస్తే వెంటనే ఈ వ్యాపారంలోకి దిగుతారు!

Chicken Pickle Profit: చికెన్ పచ్చడి వ్యాపారం అద్భుతమైన లాభాలను అందిస్తుంది. కిలో పచ్చడి తయారీకి రూ.400-₹550 ఖర్చు అయినప్పటికీ లాభం మాత్రం భారీగానే ఉంటుంది. ఈ వ్యాపారం సీక్రెట్‌ తెలిస్తే మీరు కూడా ఈ వ్యాపార రంగంలో దిగుతారు. నాణ్యత, ప్రచారంపై దృష్టి సారిస్తే రెట్టింపు ఆదాయం ఖాయమంటున్నారు వ్యాపారులు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం..

Chicken Pickle: కిలో చికెన్‌ పచ్చడి అమ్మితే ఎంత లాభం వస్తుందే తెలిస్తే వెంటనే ఈ వ్యాపారంలోకి దిగుతారు!
Chicken Pickle Business
Subhash Goud
|

Updated on: Jan 26, 2026 | 8:44 AM

Share

Chicken Pickle Profit: నెలవారీ ఆదాయం సంపాదించేందుకు రకరకాల మార్గాలు ఉన్నాయి. ఒపిగా చేసుకుంటే బిజినెస్‌లో సక్సెస్‌ కావచ్చంటున్నారు అనుభజ్క్షులు. అయితే మార్కెట్లో రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. ఇక ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు వ్యాపారానికి సంబంధించిన రకరకాల బిజినెస్‌ వీడియోలు కనిపిస్తుంటాయి. అందులో పచ్చళ్ల బిజినెస్‌. అలాగే ప్రమోషన్‌ కూడా భారీగానే చేసుకుంటున్నారు. మా పచ్చడి తక్కువ ధరకే అందుబాటు ధరల్లో ఉన్నాయి.. అద్భుతమైన రుచి ఉంటుందంటూ కుప్పలు తెప్పలుగా యాడ్స్‌ రూపంలో వీడియోలు కనిపిస్తుంటాయి.

నాన్‌వెచ్‌ పచ్చళ్లు:

ఇక చాలా మంది ఇష్టపడేది నాన్‌వెజ్‌ వంటకాలు. ఇందులో నాన్‌వెచ్‌ పచ్చళ్లు. చాలా మంది నాన్‌ వెజ్‌ పచ్చళ్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. గతంలో షాపులకు వెళ్లి కొనేది. కాని ఇప్పుడు ఆన్‌లైన్‌లో కొనుగోలు ఎక్కువైపోయింది. ఇంట్లో కూర్చుండే ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టేస్తున్నారు. అంతేకాదు జనాలను ఆకర్షించేందుకు ఎలాంటి డెలివరీ ఛార్జీలు వేయకుండానే డెలివరీ చేసేస్తున్నారు. దీంతో చాలా మంది ఆన్‌లైన్ ఆర్డర్లకు ఎగబడుతున్నారు. అయితే నాన్‌ వెజ్‌ పచ్చళ్లు ధర కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ కొనుగోళ్లకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.

కిలో చికెన్‌కు ఎంత ఖర్చు అవుతుంది?

ఇక చికెన్‌ పచ్చడికి కిలో చికెన్‌కు సుమారు 400 నుంచి 550 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అయితే ఇందులో వేసే దినుసులు, నూనె, కార, ఇతర పదార్థాలను బట్టి ధరల్లో కాస్త తేడా ఉండవిచ్చు. అయితే తయారు చేసిన తర్వాత కిలో చికెక్‌ పచ్చడికి సుమారు రూ.1100 నుంచి రూ.1500 వరకు విక్రయిస్తున్నారు.

రెట్టింపు లాభంతో..

చికెన్‌ పచ్చడి రెట్టింపు లాభంతో విక్రయిస్తున్నారు. దీంతో వ్యాపారులకు మంచి ఆదాయం వస్తుంది. పచ్చళ్ళ బిజినెస్ చేసేవాళ్ళలో కొంత మందిని వర్కర్లను పెట్టుకుని చేస్తుంటే కొంత ఎక్కవు డిమాండ్‌ చేస్తుండగా, ఎలాంటి వర్కర్లు లేకుండా సొంతంగా ఇంట్లో తయారు చేసే వాళ్లు కాస్త తక్కువ ధరకే ఇస్తున్నారు. అయితే లాభాలు మాత్రం తక్కువేం కాదు. కాస్త అటు ఇటుగా రెట్టింపు లాభంతో వ్యాపారం నిర్వహిస్తున్నారు. అంతేకాదు పెట్టిన పచ్చళ్లు కొనుగోళ్లు జరగకపోతే నష్టం కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అందుకే ధర కూడా ఎక్కువగా ఉంటున్నట్లు కొందరు వ్యాపారులు చెబుతున్నారు.

బోన్ చికెన్ పికెల్ ధరలు కొంతమేర అందుబాటు ధరల్లోనే ఉన్నా బోన్ లెస్ చికెన్ పికెల్ కాస్ట్ మాత్రం ఊహించని స్థాయిలో ఉంది. చికెన్ పచ్చడి తయారు చేయాలంటే చికెన్, నూనె కోసం ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంతమేర ఎక్కువ ఖరీదు కాగా ఇవి కాకుండా వినియోగించే మిగతా పదార్థాలు మొత్తం ఖర్చు 50 రూపాయలకు మించి ఉండదు. అయితే క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఉండటంతో పాటు ప్రమోషన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా జాగ్రత్తగా విక్రయించినట్లయితే ఈ బిజినెస్‌కు తిరుగుండదని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Gas Cylinder: గ్యాస్‌ సిలిండర్‌ వాడేవారు ఈ 3 తప్పులు అస్సలు చేయవద్దు.. లేకుంటే పేలిపొద్ది!

ఇది కూడా చదవండి: Flipkart Republic Day: కేవలం రూ.668కే మోటరోలా 5జి స్మార్ట్ ఫోన్.. షరతులు వర్తిస్తాయ్!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి