AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇకపై అడ్రప్ ప్రూప్ అవసరం లేకుండానే గ్యాస్ సిలిండర్ పొందవచ్చు.. ఎలానో తెలుసా?

నగరాల్లో నివసించే వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అధిరిపోయే శుభవార్త చెప్పింది. వలస కార్మికులు తాము నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఎలాంటి అడ్రస్ ప్రూప్ లేకుండా సిలిండర్లను పొందేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వ తాజాగా నిర్ణయం ప్రకారం.. వినియోగదారులు చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రం చూపించి గ్యాస్ స్టేషన్స్‌ నుంచి సిలిండర్లు తెచ్చుకోవచ్చు. ఇంతకు ఈ సిలిండర్‌ ఎలా పొందాలో తెలుకుందాం.

ఇకపై అడ్రప్ ప్రూప్ అవసరం లేకుండానే గ్యాస్ సిలిండర్ పొందవచ్చు.. ఎలానో తెలుసా?
Migrant Workers Lpg
Anand T
|

Updated on: Apr 07, 2026 | 3:44 PM

Share

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా కొనసాగుతున్న గ్యాస్ సరఫరా ఒత్తిళ్ల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరాల్లో నివసించే వలస కార్మికులకు ఊరట కల్గించేందకు దేశవ్యాప్తంగా 5 కేజీల చిన్న ఎల్పీజీ సిలిండర్ల అమ్మకాలను, లభ్యతను పెంచింది. ఇదే సమయంలో వలస కార్మికులకు ప్రభుత్వం బిగ్‌ రిలీఫ్‌ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. సాదారణంగా గ్యాస్ కనెక్షన్ కావాలంటే అడ్రస్ ప్రూట్ సమర్పించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న 5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్లను ఎలాంటి అడ్రస్ ప్రూప్ సమర్పించకుండానే కొనుగోలు చేయవచ్చని పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కేవలం గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది.

అడ్రస్ ప్రూప్ లేకుండా 5 కేజీల సిలిండర్ ఎలా పొందాలి

  • వినియోగదారులు కేవలం ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించి ఈ సిలిండర్‌ను పొందవచ్చు. ఇందుకు కావాల్సిన పత్రాలు ఇవే
  • ఆధార్ కార్డ్
  • పాన్ కార్డ్
  • డ్రైవింగ్ లైసెన్స్
  • ఓటర్ ఐడి
  • రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర గుర్తింపు పత్రం

వలస కార్మికుల కోసం ప్రత్యేక సాయం

వలస కార్మికులకు సహాయం చేయడానికి ప్రభుత్వం HPCL అవుట్‌లెట్ల వద్ద 11 ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవి వినియోగదారులకు సమీపంలోని డిస్ట్రిబ్యూటర్ల వివరాలను అందించడంలో, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సిలిండర్లు పొందేలా చేయడంలో సహాయపడతాయి. ప్రభుత్వం తీకొచ్చిన ఈ కొత్త విధానం వల్ల స్థిరమైన నివాసం లేని వారికి, చిన్న కుటుంబాలకు మరియు బ్యాచిలర్లకు వంట గ్యాస్ పొందడం మరింత సులభతరం కానుంది.

అక్రమాలపై కఠిన చర్యలు

అలాగే గ్యాస్ కొరత నేపథ్యంలో కొందరు అక్రమంగా గ్యాస్‌ సిలిండర్లలను గోడౌన్‌లు, ఇళ్లలో నిల్వ చేస్తున్నారు. దీనిపై దృష్టి పెట్టిన కేంద్రం గ్యాస్ సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు సోదాలను ఉధృతం చేసింది. సిలిండర్లను నిల్వ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుని, మార్చి నుండి ఇప్పటివరకు 50,000 కంటే ఎక్కువ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు 1,400 మంది డిస్ట్రిబ్యూటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరో 36 మంది డీలర్‌షిప్‌లను సస్పెండ్ చేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us