కరోనా కష్టాల్లో కేంద్రం గుడ్‏న్యూస్.. అకౌంట్లోకి ఉచితంగా రూ.50 వేలు.. సూపర్ ఛాన్స్.. ఇలా చేస్తే చాలు..

|

May 18, 2021 | 4:16 PM

దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. దీంతో ఈ మహమ్మారి కట్టడికి రాష్ట్రాలు లాక్ డౌన్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది ఉద్యోగులు,

కరోనా కష్టాల్లో కేంద్రం గుడ్‏న్యూస్.. అకౌంట్లోకి ఉచితంగా రూ.50 వేలు.. సూపర్ ఛాన్స్.. ఇలా చేస్తే చాలు..
One India One Ration
Follow us on

దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. దీంతో ఈ మహమ్మారి కట్టడికి రాష్ట్రాలు లాక్ డౌన్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది ఉద్యోగులు, వ్యాపారస్తులు ఇళ్లకే పరిమితం అయిపోయారు. ఇక చాలా మందిలో నైపుణ్యాలు ఉండి.. ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయినవారు చాలా మందే ఉన్నారు. ఇక ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ. 50 వేల క్యాష్ రివార్డు అందిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకమైన కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఇందులో గెలిస్తే రూ. 50 వేలు పొందొచ్చు. ఈ డబ్బులను ఇంట్లో ఉండి ఎటు వెళ్లకుండానే గెలుచుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందామా. One India One Ration

అయితే కేంద్రం అందిస్తోన్న రూ. 50 వేలు గెలుచుకోవడానికి ముందుగా మీరు ఒక పని చేయాల్సి ఉంటుంది. అదేంటీ అని ఆలోచిస్తున్నారా ? అదేం లేదండి.. మీరు ఒక లోగో గీయాల్సి ఉంటుంది. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ గురించి తెలుసుగా.. ఆ పథకం కోసం మీరు ఒక లోగో గీయాల్సి ఉంటుంది. ఇందులో మీరు విజేతగా గెలిస్తే రూ. 50 వేలు వస్తాయి. లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉండేవారికి ఇది మంచి అవకాశం.. ఈ కష్ట సమయంలో డబ్బులు సంపాదించాలనుకునే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని మై గౌ ఇండియా ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫుడ్ అండ్ పబ్లి్క్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ ఈ కాంటెస్ట్ ను నిర్వహిస్తోంది. ఇందుకోసం మే 31 వరకు గడువు ఉంది. తొలి విజేతకు రూ. 50 వేలతోపాటు ఒక సర్టిఫికెట్ కూడా అందిస్తారు. అలాగే మరో ముగ్గురికి కూడా సర్టిఫికెట్స్ లభిస్తాయి.

మీరు మై గౌ పోర్టల్‏లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ కాంటెస్ట్ లో ఎవరైనా సరే పాల్గొనవచ్చు. ఒక్కొక్కరికి మూడు ఎంట్రీస్ ఉంటాయి. లోగో ఫార్మాట్ చాలా క్లియర్ గా ఉండాలి. అలాగే లోగో గురించి 100 పదాలతో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

ట్వీట్.

Also Read: SBI కస్టమర్లకు గుడ్‏న్యూస్.. ఇక నుంచి ఆన్‏లైన్‏లోనే మొబైల్ నంబర్ మార్చుకోవచ్చు… ఎలాగంటే..

గ్రామాల్లో ఈ వ్యాపారాలు చేస్తే మీరే లక్షాధికారులు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం.. ఏఏ బిజినెస్ చేయాలంటే..