Ration Card: రేషన్ కార్డులు ఉన్నవారికి బ్యాడ్ న్యూస్.. ఇకపై 7 కేజీలే.. కీలక మార్పులకు శ్రీకారం..
కేంద్ర ప్రభుత్వం రేషన్ పంపిణీలో కీలక మార్పులు చేసింది. అంత్యోదయ కార్డుదారులకు రేషన్ కోటాలో కొత విధించింది. ఇక నుంచి వ్యక్తి చొప్పున రేషన్ అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు చట్ట సవరణ చేయనుంది. ఇందుకోసం ప్రజల అభిప్రాయాలను ప్రస్తుతం స్వీకరిస్తోంది.

రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. ప్రస్తుతం అందిస్తున్న రేషన్ కోటాలో కొత విధించింది. అంత్యోదయ అన్న యోజన కార్డు ఉన్నవారికి పంపిణీ చేస్తున్న రేషన్‌లో కొత్త నిబంధన తీసుకురాబోతుంది. ఇక నుంచి కుటుంబంలో ఒక్కొ వ్యక్తి చొప్పున రేషన్ కోటా పంపిణీ చేయనున్నారు. ఒక్కొ వ్యక్తికి 7 కేజీల బియ్యం లేదా గోధుములు అందించనున్నారు. ఇప్పటివరకు ఎంతమంది కుటుంబసభ్యులు ఉన్నా నెలకు 35 కిలోలు ఉచితంగా అందించేవారు. కానీ ఇక నుంచి వ్యక్తి చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జాతీయ ఆహార భద్రత చట్టం- 2013లో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
కొత్త విధానం ఏంటి..?
ఇప్పటివరకు కుటుంబసభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా నెలకు 35 కిలోల రేషన్ అందించేవారు. అయితే కొత్త విధానంలో కార్డులోని నెలకు ప్రతీ వ్యక్తి కి 7 కిలోల చొప్పున అందిస్తారు. ఇద్దరు వ్యక్తులు ఉంటే 14 కిలోలు అందిస్తారు. అదే ఐదుగురు కంటే ఎక్కువమంది ఉంటే 35 కిలోలు పంపిణీ చేస్తారు. కుటుంబానికి అందిస్తున్న గరిష్ట పరిమితి మాత్రం అలాగే ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే రేషన్ కోటాలో కాస్త కొత విధించినట్లేనని చెప్పవచ్చు. ఈ విధానం అమలు చేసేందుకు జులై 13 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చట్ట సవరణ బిల్లులపై నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రతీ వ్యక్తికి తగిన పరిమాణంలో మాత్రమే ఆహార ధాన్యాలు అందించడం కోసం ఈ మార్పులు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
సాధారణ రేషన్ కార్డులకు ఎలా..
ఇక సాధారణ రేషన్ కార్డు ఉన్నవారికి నెలకు ఒక్కొ వ్యక్తి 5 కేజీల చొప్పున కొనసాగనుంది. కేవలం కేంద్ర ప్రభుత్వం అందించే అంత్యోదయ పథకం కింద రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే కొత్త నిబంధనలు వర్తిస్తాయి. చిన్న కుటుంబాలకు ఉన్నవారికి సంబంధించి రేషన్ పంపిణీలో ఎలాంటి మార్పులు లేనప్పటికీ.. పెద్ద కుటుంబాలకు సభ్యుల సంఖ్యను బట్టి కేటాయింపులు జరుగుతాయి కాబట్టి లబ్ది పొందుతారని కేంద్రం తెలిపింది. కుటుంబ ఆధారిత రేషన్ విధానం అత్యంత నిరుపేదలకు ఆదుకోవాలనే లక్ష్యంతో తీసుకొచ్చారు. అయితే కుటుంబ పరిమాణాన్ని బట్టి లబ్దిదారుల మధ్య అసమానతలకు దారితీస్తోంది. దీంతో ఈ సవరణలు తెచ్చినట్లు కేంద్రం పేర్కొంది. నాణ్యమైన ఆహార ధాన్యాలను తగినంత పరిమాణంలో తీసుకురావడం ద్వారా ఆహార భద్రతను బలోపేతం చేయడంలో చేపడుతున్న చర్యల్లో భాగంగానే ఈ సవరణలు తీసుకొచ్చినట్లు కేంద్రం స్పష్టం చేసింది.
