AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business: 7 శాతం వడ్డీతో రుణం.. వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ అద్భుత పథకం

సొంతంగా చిరు వ్యాపారాలను ప్రారంభించాలనుకునే వారి కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం స్వానిధి యోజన పేరుతో పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోంది. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా సుమారు 70 లక్షల మందికి పైగా లబ్ధి పొందారు. కరోనా మహమ్మారి సమయంలో, చిన్న వ్యాపారులను ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతో...

Business: 7 శాతం వడ్డీతో రుణం.. వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ అద్భుత పథకం
Pm Svanidhi
Narender Vaitla
|

Updated on: Jun 14, 2024 | 12:36 PM

Share

సొంతంగా వ్యాపారం చేయాలని చాలా మంది ఆశపడుతుంటారు. అయితే వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడి కోసం ఇబ్బందులు పడితుంటారు. బయట ఎక్కడైనా అప్పు చేస్తే అసలు కంటే వడ్డీనే ఎక్కువ అవుతుంది. పోనీ ఏదైనా బ్యాంకులో రుణం తీసుకోవాలంటే గతంలో లోన్స్‌ తీసుకున్న చరిత్రను అడిగి తెలుసుకుంటారు. అయితే వ్యాపారం చేయాలని ఉండి, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఓ చక్కటి పథకాన్ని తీసుకొచ్చింది. ఇంతకీ ఏంటీ పథకం.? దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

సొంతంగా చిరు వ్యాపారాలను ప్రారంభించాలనుకునే వారి కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం స్వానిధి యోజన పేరుతో పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోంది. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా సుమారు 70 లక్షల మందికి పైగా లబ్ధి పొందారు. కరోనా మహమ్మారి సమయంలో, చిన్న వ్యాపారులను ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

ఈ పథకం ద్వారా మీరు ఎలాంటి హమీ లేకుండా మొదటిసారి రూ. 10,000 రుణం పొందొచ్చు. దీనికి కేవలం 7 శాతం చొప్పున వడ్డీ రాయితీ కూడా అందిస్తారు. రుణం మొత్తాన్ని 12 నెలల్లోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మీకు దగ్గర్లోని ఏ ప్రభుత్వ రంగ బ్యాంకులో అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటిసారి తీసుకున్న రూ. 10 వేల రుణాన్ని తిరిగి చెల్లించిన వారికి తర్వాత రూ. 20 నుంచి గరిష్టంగా రూ. 50 వేల వరకు లోన్‌ పొందొచ్చు. ఇందుకోసం బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. తిరిగి చెల్లింపులు సక్రమంగా చేస్తే సిబిల్ స్కోర్‌ పెరగడంతో పాటు మరోసారి రుణం పొందే అవకాశం లభిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us