Maruti Suzuki: అత్యధికంగా అమ్ముడవున్న కారు ఇదే.. ప్రతినెల 12 వేల మంది కొనుగోలు
దేశంలోని వివిధ కార్ల విభాగాల్లో అనేక రకాల మోడల్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, వ్యాన్ సెగ్మెంట్ విషయానికి వస్తే మారుతి ఈకో పేరు మాత్రమే అగ్రస్థానంలో ఉంది. గత నెలలో అంటే మే నెలలో కూడా 10,960 యూనిట్లు విక్రయాలు జరిగాయి. మారుతికి చెందిన టాప్-10 కార్లలో ఇది ఎల్లప్పుడూ ఉంటుంది. విశేషమేమిటంటే గత 6 నెలలుగా ప్రతినెలా 10 నుంచి..

దేశంలోని వివిధ కార్ల విభాగాల్లో అనేక రకాల మోడల్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, వ్యాన్ సెగ్మెంట్ విషయానికి వస్తే మారుతి ఈకో పేరు మాత్రమే అగ్రస్థానంలో ఉంది. గత నెలలో అంటే మే నెలలో కూడా 10,960 యూనిట్లు విక్రయాలు జరిగాయి. మారుతికి చెందిన టాప్-10 కార్లలో ఇది ఎల్లప్పుడూ ఉంటుంది. విశేషమేమిటంటే గత 6 నెలలుగా ప్రతినెలా 10 నుంచి 12 వేలకు పైగా యూనిట్లు అమ్ముడవుతున్నాయి. ఈ యుటిలిటీ కారును 5, 6,7 సీట్ల ఫార్మాట్లలో కొనుగోలు చేయవచ్చు. వాణిజ్య విభాగంలో దీని డిమాండ్ అత్యధికం. ఇది స్కూల్ వ్యాన్, అంబులెన్స్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.29 లక్షలు.
గత ఆరు నెలలుగా విక్రయాల యూనిట్లు:
- డిసెంబర్ 2023-10,034 యూనిట్లు
- జనవరి 2024- 12,019 యూనిట్లు
- ఫిబ్రవరి 2024 -12,147 యూనిట్లు
- మార్చి 2024- 12,019 యూనిట్లు
- ఏప్రిల్ 2024- 12,060 యూనిట్లు
- మే 2024 -10,960 యూనిట్లు ఇలా ఆరు నెలల్లో మొత్తం 69,239 యూనిట్ల విక్రయాలు జరిగినట్లు కంపెనీ తెలిపింది.
కొత్త మారుతి ఈకో ఇంటీరియర్ అప్‌డేట్
మారుతి ఈకో కొలతలు గురించి మాట్లాడితే.. 2022 Eeco పొడవు 3,675mm, వెడల్పు 1,475mm, ఎత్తు 1,825mm. అంబులెన్స్ వెర్షన్ 1,930mm ఎత్తును కలిగి ఉంది. కంపెనీ తన పాత G12B పెట్రోల్ మోటార్‌ను కొత్త K సిరీస్ 1.2-లీటర్ ఇంజన్‌తో భర్తీ చేసింది. కొత్త Eeco 13 వేరియంట్‌లలో విడుదల చేసింది. ఇందులో 5-సీటర్, 7-సీటర్, కార్గో, టూర్, అంబులెన్స్ బాడీ స్టైల్స్ ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








