Electric Vehicles: ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు చేసేవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త..!

| Edited By: Ram Naramaneni

Sep 29, 2021 | 11:46 AM

Electric Vehicles: ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారు కస్టమర్లు. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా వాహనాల తయారీ కంపెలు కూడా..

Electric Vehicles: ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు చేసేవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త..!
Electric Vehicles
Follow us on

Electric Vehicles: ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారు కస్టమర్లు. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా వాహనాల తయారీ కంపెలు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ద్విచక్ర వాహనాలు అందుబాటులోకి రాగా, మరి కొన్ని వాహనాలు మార్కెట్లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలని భావించే వారికి కేంద్రం ప్రభుత్వం శుభవార్త అందించే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఫేమ్ 2 స్కీమ్‌ కింద ఎలక్ట్రిక్ బైకులు, కార్లు కొనేవారికి భారీ సబ్సిడీ లభిస్తుంది. అయితే ఈ ఫేమ్ 2 స్కీమ్‌ గడువు తేదీని పొడగించాలని చూస్తున్నట్లు సమాచారం. ఎలక్ట్రికల్‌ వెహికల్‌ మార్కెట్‌కి మరింత ఊతం ఇచ్చే దిశగా గతంలో కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రికల్‌ వెహికల్‌ తయారీ సంస్థలకు ఇస్తున్న సబ్సిడీని రెట్టింపు చేసింది. దీని వల్ల ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ధరలు తగ్గి అమ్మకాలు పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

సబ్సిడీ శాతం పెంచుతూ..

కాగా, ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి సంబంధించి కిలోవాట్‌ పర్‌ అవర్‌ సామర్థ్యం కలిగిన బైక్‌ తయారీ ధరలో 20 శాతంగా ఉన్న సబ్సిడీని 40 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక కిలోవాట్ పర్‌ అవర్‌ సామర్థ్యం కలిగిన బైక్‌పై రూ.15,000 సబ్సిడీ లభిస్తోంది. ఇలా 2 కిలోవాట్‌ బైక్‌పై రూ. రూ.30,000 సబ్సిడీ 3 కిలోవాట్‌ బైక్‌పై రూ. 45,000 వరకు సబ్సిడీ లభిస్తోంది. లక్షన్నర ధర మించని బైకులకు ఈ సబ్సిడీ వర్తిస్తుందని కేంద్రం ప్రకటించింది. కంపెనీలకు ఇచ్చే సబ్సిడీ మార్చి 31, 2022 వరకు కొనసాగనుంది.

గడువు పొడిగించే అవకాశం..

ఇప్పుడు ఫేమ్ 2 స్కీమ్‌ సబ్సిడీ గడువు తేదీని మార్చి 31, 2024 వరకు పొడగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై కేంద్ర సర్కార్‌ ఇంకా ధృవీకరించలేదు. ఇప్పటి వరకు ఈ స్కీమ్‌ కింద సుమారు 1,24,415 వాహన కొనుగోలుదారులు ప్రయోజనం పొందారు. ఇందులో 99,652 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాదారులు, 23,059 ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాదారులు, 1,693 ఎలక్ట్రిక్ నాలుగు చక్రాల వాహనాదారులు ఉన్నారు. రాష్ట్రాల వారీగా రిజిస్ట్రేషన్ల పరంగా కర్ణాటక(25,725 ఈవీలు), తమిళనాడు (19,222 ఈవీలు), మహారాష్ట్ర (13,384 ఈవీలు), ఉత్తరప్రదేశ్(7,990 ఈవీలు), రాజస్థాన్ (10,010 ఈవీలు), ఢిల్లీ (8,897 ఈవీలు) ఈ స్కిమ్‌ కింద ఎక్కువగా బెనిఫిట్స్‌ పొందాయి. ప్రస్తుతం ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ర్టిక్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

ఇవీ కూడా చదవండి:

Electric Scooter: ఒక్కసారి చార్జ్‌ చేస్తే 480 కిలోమీటర్లు.. మార్కెట్లోకి రానున్న మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..!

Toyota Yaris: భారత్‌లో టొయోటా యారిస్ కార్ల విక్రయాల నిలిపివేత.. కారణం ఏంటంటే..!