AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Government: కేంద్రం సూపర్ ఛాన్స్.. నేరుగా మీ అకౌంట్లోకి రూ.10 వేలు.. జస్ట్ మొబైల్ ఉంటే చాలు..

కేంద్ర ప్రభుత్వం కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్‌ను తీసుకొచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి దీనిని అమలు చేస్తోంది. పాత ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం క్విజ్ నిర్వహిస్తోంది

Central Government: కేంద్రం సూపర్ ఛాన్స్.. నేరుగా మీ అకౌంట్లోకి రూ.10 వేలు.. జస్ట్ మొబైల్ ఉంటే చాలు..
Indian Money
Venkatrao Lella
|

Updated on: Apr 11, 2026 | 11:45 AM

Share

కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025ను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది పార్లమెంట్‌లో ఈ చట్టాన్ని ఆమోదించగా.. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ చట్టంలో అనేక మార్పులు చోటుచేసుకోగా.. పన్ను చెల్లింపుదారులకు సులువుగా సేవలు అందించేలా అనేక కొత్త నిర్ణయాలు తీసుకొచ్చారు. ఐటీ నిబంధనలు, నియమాలు, రూల్స్ సులువుగా తెలుసుకునేలా, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఈజీగా ఫైల్ చేసేలా అనేక మార్పులు చేశారు. సామాన్యులు కూడా అర్థం చేసుకునే భాషలో ఐటీ చట్టాలు తీసుకొచ్చారు. అయితే కొత్త ఐటీ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

క్విజ్ గెలిస్తే రూ.10 వేలు

కొత్త ఐటీ చట్టంపై ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ క్విజ్ నిర్వహిస్తోంది. మైగవ్ అనే ప్రభుత్వ పోర్టల్‌తో కలిసి దీనిని నిర్వహిస్తోంది. ఈ క్విజ్‌లో 80 మందిని ఎంపిక చేస్తారు. వారికి ప్రైజ్‌మనీ అందిస్తారు. మార్చి 20,2025 నుంచి ఈ క్విజ్ పోటీలు ప్రారంభమవ్వగా.. ఈ ఏడాది ఏప్రిల్ 20 వరకు కొనసాగనున్నాయి. గెలిచిన టాప్ 10 విజేతలకు రూ.10 వేల బహుమతి, ఆ తర్వాత 20 మందికి రూ.5 వేలు, ఆ తర్వాత నిలిచే 50 మందికి రూ.3 వేలు అందిస్తారు. ఇక క్విజ్‌లో పాల్గొన్నవారికి పార్టిషిపేషన్ సర్టిఫికేట్ అందిస్తారు. ఎవరైనా ఈ క్విజ్‌లో పాల్గొనవచ్చు. ఆన్ లైన్‌లోనే ఈ క్విజ్ ఉంటుంది. కొత్త ఐటీ చట్టం గురించి క్విజ్‌లో క్వశ్చన్లు ఉంటాయి. ఇక క్విజ్‌లో పాల్గొన్న తర్వాత ఈ-సర్టిఫికేట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

మొత్తం 10 ప్రశ్నల క్విజ్

గెలుపొందిన వారిని ఏప్రిల్ 20 తర్వాత ప్రకటిస్తారు. ఆ తర్వాత మీ బ్యాంక్‌ తీసుకుని నేరుగా డబ్బులు బదిలీ చేస్తారు. క్విజ్‌లో మొత్తం 10 ప్రశ్నలు ఉండగా.. 300 సెక్షన్లలో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎలాంటి నెగిటివ్ మార్కులు అనేది ఉండవు. క్విజ్‌కు కొంత టైమ్ ఉంటుంది. ఆ టైమ్ లోపల క్విజ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి మాత్రమే క్విజ్‌లో పాల్గొనే నిబంధన ఉంటుంది. మైగవ్ పోర్టల్‌లోకి వెళ్లి ముందుగా లాగిన్ అవ్వండి. ఆ తర్వాత మీ వివరాలతో లాగిన్ అవ్వాలి. అనంతరం ఇన్‌కమ్ ట్యాక్స్ క్విజ్ అనే ఆప్షన్‌ను ఎంచుకుని పాల్గొనాలి. గెలుపొందాక మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను అందించాల్సి ఉంటుంది. ప్రతిఒక్కరూ ఈ క్విజ్‌లో పాల్గొనాలని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కోరుతోంది. కొత్త చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా క్విజ్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

Follow Us
నేరుగా మీ అకౌంట్లోకి రూ.10 వేలు.. కేంద్రం సూపర్ న్యూస్
నేరుగా మీ అకౌంట్లోకి రూ.10 వేలు.. కేంద్రం సూపర్ న్యూస్
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఇంటర్ ఫలితాల డేట్‌ అండ్ టైం ఫిక్స్.. రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఇంటర్ ఫలితాల డేట్‌ అండ్ టైం ఫిక్స్.. రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే
సినిమాల్లో నవ్వులు పూయించింది.. చివరకు అనాథ శవంలా..
సినిమాల్లో నవ్వులు పూయించింది.. చివరకు అనాథ శవంలా..
హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్..రక్తంతో గోడపై రాసిన రాతలు?
హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్..రక్తంతో గోడపై రాసిన రాతలు?
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
"వాడి జీవితం ఇలా అవుతుంది అని కలలో కూడా అనుకోలేదు"
గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై..నీటితో పనిచేసే సరికొత్త స్టవ్ మీ కోసం
గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై..నీటితో పనిచేసే సరికొత్త స్టవ్ మీ కోసం
పోలీస్ స్టేషన్ పక్కనే దారుణం.. ఏటీఎం మిషన్‌తో పరారైన దుండగులు
పోలీస్ స్టేషన్ పక్కనే దారుణం.. ఏటీఎం మిషన్‌తో పరారైన దుండగులు
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..