జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం ఇక చిటికెలో పని..
దానిమ్మ ఆరోగ్యానికి చాలా మంచిది అన్న విషయం మనందరికీ తెలుసు. కానీ, ఆ గింజలను తీయడమే ఒక పెద్ద యుద్ధం.. గింజలు తీసే క్రమంలో రసం బట్టలపై పడటం, గోళ్లు నల్లగా మారడం చూసి చాలామంది దానిమ్మ పండు తినడమే మానేస్తుంటారు. అయితే ఇకపై ఆ చింత వద్దు.. కేవలం ఒక నిమిషంలో ఒక్క రసం చుక్క కూడా కింద పడకుండా దానిమ్మ గింజలను ముత్యాల్లా బయటకు తీసే ఒక అద్భుతమైన ట్రిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒక దానిమ్మ వంద రోగాలను నయం చేస్తుంది.. ఇది అక్షర సత్యం. దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ ఆ దానిమ్మ గింజలను తీయడమే ఒక పెద్ద యుద్ధంలా అనిపిస్తుంది. గింజలు తీసే క్రమంలో రసం బట్టలపై పడటం, చేతులు నల్లగా మారడం వంటి ఇబ్బందుల వల్ల చాలామంది దానిమ్మ పండు తినడమే మానేస్తుంటారు. మీరు కూడా ఆ కోవలో ఉన్నారా..? అయితే మీకోసం ఒక అదిరిపోయే మ్యాజిక్ ట్రిక్ సిద్ధంగా ఉంది..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పండి..
చాలామంది దానిమ్మను మధ్యలోకి సగానికి కోస్తారు. దీనివల్ల లోపల ఉండే గింజలు నలిగిపోయి రసం వృథా అవుతుంది. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ కొత్త పద్ధతిని పాటిస్తే, కేవలం 60 సెకన్లలో ముత్యాల్లాంటి గింజలన్నీ గిన్నెలోకి రాలిపోతాయి.
కావలసినవి: ఒక పదునైన కత్తి – ఒక పెద్ద చెంచా
దశలవారీగా వలిచే పద్ధతి:
స్టెప్ 1: కిరీటం కోత
ముందుగా దానిమ్మ పైభాగంలో పువ్వులా ఉండే కిరీటాన్ని తీసేయాలి. కత్తితో లోతుగా కోయకుండా, కేవలం తొక్క వరకు గుండ్రంగా కోసి ఆ ‘టోపీ’ని తొలగించండి.
స్టెప్ 2: పొరలను గమనించండి
పై టోపీ తీశాక లోపల తెల్లటి పీచు పొరలు కనిపిస్తాయి. అవి దానిమ్మను వివిధ గదులుగా విభజిస్తాయి.
స్టెప్ 3: గాట్లు పెట్టండి
ఆ తెల్లటి పొరలు ఎక్కడైతే ఉన్నాయో, దానికి సరిగ్గా పైన తొక్క మీద కత్తితో పై నుంచి కింది వరకు నిలువుగా గాట్లు పెట్టండి. కేవలం తొక్క మీద గాటు పడితే చాలు.
స్టెప్ 4: పువ్వులా విడదీయండి
ఇప్పుడు మీ వేళ్లతో మధ్యలో సున్నితంగా నొక్కితే, ఆ దానిమ్మ పండు ఒక అందమైన తామర పువ్వులా విచ్చుకుంటుంది. ఒక్క గింజ కూడా నలగదు.
స్టెప్ 5: చెంచా మ్యాజిక్
విచ్చుకున్న దానిమ్మను మీ అరచేతిలో తలక్రిందులుగా పట్టుకోండి. మరో చేత్తో చెక్క లేదా స్టీల్ చెంచా తీసుకుని దానిమ్మ తొక్కపై మెల్లగా తట్టండి. ఆశ్చర్యకరంగా 30 సెకన్లలోనే గింజలన్నీ గిన్నెలోకి రాలిపోతాయి.
స్మార్ట్ టిప్స్
క్లీనింగ్: గింజల్లో తెల్లటి పీచు ఉంటే గింజలను నీళ్ల గిన్నెలో వేయండి. పీచు పైకి తేలుతుంది, గింజలు అడుగున ఉంటాయి. సులభంగా క్లీన్ చేసుకోవచ్చు.
తొక్కల ప్రయోజనం: దానిమ్మ తొక్కలను పారవేయకండి. వాటిని ఎండబెట్టి పొడి చేస్తే చర్మ సౌందర్యానికి, కడుపు నొప్పి నివారణకు అద్భుతంగా పనిచేస్తాయి.
ఈ పద్ధతి వల్ల లాభాలు
- పది నిమిషాల పని ఒక్క నిమిషంలో పూర్తవుతుంది.
- చేతులు, గోళ్లు నల్లగా మారవు.
- రసం చిందదు, బట్టలు పాడవ్వవు.
