AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : స్టార్ హీరోయిన్లకే చెమటలు పట్టించింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది.. ఆమె జీవితం తెలిస్తే..

ఒక్క సినిమాతోనే రాత్రికి రాత్రే స్టార్స్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందం, అభినయంతో ఇండస్ట్రీని ఊపేసిన ముద్దుగుమ్మలు.. ఆ తర్వాత అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ సైతం ఫస్ట్ మూవీతోనే సినీరంగాన్ని షేక్ చేసింది. కానీ అనుకోకుండా జరిగిన ప్రమాదం ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. ఇంతకీ ఆమె ఎవరంటే.

Tollywood : స్టార్ హీరోయిన్లకే చెమటలు పట్టించింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది.. ఆమె జీవితం తెలిస్తే..
Anu Aggarwal
Rajitha Chanti
|

Updated on: Apr 11, 2026 | 10:33 AM

Share

సినీరంగంలో అదృష్టం ఎవరికి ఎప్పుడు అండగా నిలుస్తుందో చెప్పక్కర్లేదు. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ సెన్సేషన్ అయిన తారలు చాలా మంది ఉన్నారు. మొదటి సినిమాతోనే తమకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న పలువురు తారలు అనుహ్యంగా సినిమాలకు దూరమైపోతుంటారు. కొందరు వ్యక్తిగత విషయాలు, అనవసర వివాదాలతో కెరీర్ పోగొట్టుకుంటారు. కానీ మరికొందరు మాత్రం విధి రాతకు బలైపోతుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ సైతం కాలం పెట్టిన పరీక్షకు తలవంచింది. స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలగాల్సిన ఆమె.. ఒక్క ప్రమాదంతో జీవితం తలకిందులైంది. ఆమె ఒక్క సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. ఆ తర్వాత, నిర్మాతలు డబ్బు సంచులతో ఆమె ఇంటికి వచ్చి ఆఫర్లు ఇచ్చేవారు.

ఎక్కువ మంది చదివినవి : Trisha Krishnan : సినిమాలకు త్రిష గుడ్ బై.. వ్యాపారవేత్తతో పెళ్లి.. స్పందించిన హీరోయిన్..

మనం మాట్లాడుకుంటున్న ఆమె పేరు అను అగర్వాల్. హిందీలో ఆషిఖీ సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషన్ అయ్యింది. ఈ నటి జీవితం కూడా ఇలాంటి ఒడిదుడుకులనే చవిచూసింది. ఒక్క ప్రమాదం ఆమె కెరీర్‌ను దాదాపు ముగించేసింది. అయితే ఆ ప్రమాదం తర్వాత ఆమె కొన్నాళ్లు కోమాలో ఉండిపోయింది. మతిమరుపుతో ఇబ్బందిపడింది. నెమ్మదిగా తాను కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ‘ఆషిఖీ’ సినిమాతో అను అగర్వాల్ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు. ఆమెను సినిమాల్లోకి తీసుకోవడానికి నిర్మాతలు పెద్ద పెద్ద ఆఫర్లతో వచ్చేవారు. కానీ 1999లో జరిగిన ఒక ఘోరమైన కారు ప్రమాదం ఆమె జీవితాన్ని మార్చేసింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్‏తో మాత్రమే నా బాధలను చెప్పుకుంటాను.. అతడే నా బెస్ట్ ఫ్రెండ్.. టాలీవుడ్ హీరోయిన్..

ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడి, సుదీర్ఘకాలం చికిత్స చేయించుకోవలసి వచ్చింది. ఆమె ఇటీవల ఒక దిగ్భ్రాంతికరమైన అనుభవాన్ని పంచుకున్నారు. ప్రమాదం తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆమెకు తప్పుడు సిరలో ఇంజెక్షన్ ఇవ్వడంతో, ఆమె మళ్లీ స్పృహ కోల్పోయారు. ఇన్ని జరిగినా ఆమె సంకల్పం ఏమాత్రం తగ్గలేదు. స్పృహలోకి వచ్చిన మరుసటి రోజే ఆమె నేరుగా సినిమా సెట్‌కు చేరుకుని చిత్రీకరణ ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె సినిమాల్లో చురుకుగా లేనప్పటికీ, జీవితం పట్ల ఆమె దృక్పథం చాలా సానుకూలంగా ఉంది.

ఎక్కువ మంది చదివినవి : Mrunal Thakur : అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Sekhar Kammula : ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను.. 6 నెలలు బాధపడ్డాను.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..

Follow Us