SICMA : సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా సౌత్ ఇండియా.. ఒక్కటైన దక్షిణాది రాష్ట్రాల సిమెంట్ కంపెనీలు
తెలంగాణ, ఏపీ, కర్నాటక రాష్ట్రాలు.. సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారాయన్నారు సౌత్ ఇండియా సిమెంట్ మ్యానిఫెక్చర్స్ అసోసియేషన్..
SICMA : తెలంగాణ, ఏపీ, కర్నాటక రాష్ట్రాలు.. సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారాయన్నారు సౌత్ ఇండియా సిమెంట్ మ్యానిఫెక్చర్స్ అసోసియేషన్ (South Indian Cement Manufacturers Association) అధ్యక్షులు శ్రీనివాసన్. దేశంలో 30 శాతం సిమెంట్ తయారీ ఇక్కడే తయారు అవుతుందన్నారు. గతంలో 15, 20 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం.. 500 మిలియన్ టన్నులకు పెరగడం.. సిమెంట్ ఇండస్ట్రీ గ్రోత్‌కు సూచిక అని ఆయన అన్నారు.
ప్రతీ రాష్ట్రంలో సిమెంట్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతోందని… పరిశ్రమ సమస్యలు పరిష్కారం కావాలన్నారు. ఇళ్లను విక్రయించేప్పుడు.. ధరలు తగ్గించని బిల్డర్లు.. సిమెంట్ ధరలు తగ్గించాలని అనడం విడ్డూరంగా ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సిమెంట్ కంపెనీలు శ్రీనివాసన్ అధ్యక్షతన సౌత్ ఇండియా సిమెంట్ మ్యానిఫెక్చర్స్ అసోసియేషన్ (South India Cement Manufacturers’ Association (SICMA) ) గా ఏర్పడ్డాయి.