Richest Woman: పెద్దగా చదువుకోలేదు.. భారతదేశంలోనే అత్యంత ధనికురాలిగా నిలిచారు.. ఆమె ఎవరో మీకు తెలుసా?

Richest Woman: భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు అని అడిగితే టక్కున ముఖేశ్ అంబానీ అని చెబుతాం. మరి అదే అత్యంత ధనికురాలు ఎవరు?

Richest Woman: పెద్దగా చదువుకోలేదు.. భారతదేశంలోనే అత్యంత ధనికురాలిగా నిలిచారు.. ఆమె ఎవరో మీకు తెలుసా?
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 12, 2021 | 7:19 PM

Richest Woman: భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు అని అడిగితే టక్కున ముఖేశ్ అంబానీ అని చెబుతాం. మరి అదే అత్యంత ధనికురాలు ఎవరు? అంటే.. కాస్త తటపటాయిస్తాం. సమాధానం కోసం ఆరా తీస్తాం. మరి ధనవంతుడు ఎవరనేది తెలిసినప్పుడు.. ధనవంతురాలు ఎవరో కూడా తెలుసుకోవాలి కదా? ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఇటీవల బ్లూమ్‌బెర్గ్ విడుదల చేసిన ధనవంతుల జాబితాలో ప్రముఖ జిందాల్ గ్రూప్ చైర్‌పర్సన్ సావిత్రి జిందాల్ చోటు దక్కించుకున్నారు. ఆ జాబితా ప్రకారం.. సావిత్రి జిందాల్ భారతదేపు అత్యంత ధనికురాలిగా గుర్తింపు పొందారు.

బ్లూమ్‌బెర్గ్ తాజాగా ప్రపంచంలోనే అత్యంత ధనికులైన 500 మంది పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో సావిత్రి జిందాల్ చోటు దక్కించుకున్నారు. ఈ జాబితా ప్రకారం.. సావిత్రి జిందాల్ 324వ స్థానంలో నిలిచారు. అదే సమయంలో భారతదేశం ధనవంతుల పరంగా చూసినట్లయితే ఆమె 13వ స్థానంలో ఉన్నారు. ఇక మహిళా ధనవంతుల పరంగా చూస్తే ఆవిడ తొలిస్థానంలో నిలిచారు. ఆమె ఇలా తొలిస్థానంలో నిలవడం ఇదే ప్రథమం కాదు.. చాలా ఏళ్ల నుంచి ఆమె భారతదేశపు అత్యంత ధనికురాలిగా గుర్తింపు పొందుతూ వచ్చారు.

సావిత్రి జిందాల్ ఆస్తులు ఎంతంటే.. జిందాల్ గ్రూప్ భారతేదశంలోనే అతిపెద్ద ఉక్కు పరిశ్రమలలో ఒకటి. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. సావిత్ర జిందాల్ ఆస్తుల విలువ 7.65 బిలియన్ డాలర్లు. మన భారత కరెన్సీలో చూసుకున్నట్లయితే రూ.558 బిలియన్లు. అయితే ఆమె సంపదలో గత కొంతకాలంగా పెరుగుదల నమోదవుతుందని బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది. 2010 కాస్త నష్టాలు చవి చూసినప్పటికీ.. ఆ తరువాత క్రమక్రమంగా పుంజుకున్నట్లు సదరు నివేదిక తెలిపింది. ఆ నివేదిక ప్రకారం.. ఏడాది కాలంలో సావిత్రి జిందాల్ సంపద 13.8 శాతం పెరిగింది. ఇక 2017, 2018 మధ్య సావిత్రి జిందాల్ సంపద 73.7 బిలియన్లు పెరిగిందని బ్లూమ్‌బెర్గ్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. సావిత్రి జిందాల్ జిందాల్ గ్రూప్ కంపెనీలైన జెఎస్‌డబ్ల్యు స్టీల్‌, మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి, వాయు పరిశ్రమలు, పోర్టులను నిర్వహణను చూస్తున్నారు.

అసలు ఈ సావిత్రి జిందాల్ ఎవరు..? ప్రస్తుతం జిందాల్ గ్రూప్ చైర్ పర్సన్‌గా ఉన్న సావిత్రి జిందాల్.. జిందాల్ గ్రూప్ ఫౌండర్ ఓం ప్రకాష్ జిందాల్ సతీమణి. ఓ ప్రకాష్ జిందాల్ మొదటి భార్య విద్యాదేవి చనిపోవడంతో ఆమె చెల్లెలు అయిన సావిత్రిని 15 ఏట వివాహమాడారు. విద్యాదేవి-ఓం ప్రకాష్ జిందాల్‌కు ఆరుగురు సంతానం కాగా.. సావిత్రి-ఓం ప్రకాష్ జిందాల్‌కు ముగ్గురు సంతానం. మొత్తంగా తొమ్మిది మంది సంతానం. అయితే, 2005 వరకు ఆమె గృహిణిగానే ఉన్నారు. 2005లో హెలికాప్టర్ ప్రమాదంలో ఓం ప్రకాష్ జిందాల్ మృతి చెందారు. అలా అప్పటి వరకు గృహిణిగా ఉన్న సావిత్రి జిందాల్.. వ్యాపారంతో పాటు రాజకీయాల్లోకీ అడుగుపెట్టారు. జిందాల్ గ్రూప్ వ్యవహారాలన్నింటిని చక్కబెట్టడంతో పాటు.. తన భర్త నుంచి వచ్చిన రాజకీయ వారసత్వాన్ని కూడా కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున హిస్సార్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె.. మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అలా సావిత్రి జిందాల్.. గృహిణిగా, వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకురాలిగా, సామాజిక కార్యకర్తగా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇలా అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర కనబరుస్తున్న సావిత్రి జిందాల్.. పెద్దగా చదువుకోలేదు.

Also read:

ఓవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం పరుగులు పెడుతున్న దేశాలు.. మరో వైపు షాకింగ్ న్యూస్ చెప్పిన WHO

Bird Flu: బర్డ్ ఫ్లూపై భయం వద్దు.. నిర్భయంగా తినొచ్చు.. మనుషులకు ఆ వ్యాధి రాదు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి..