ఎండాకాలంలో కారు టైర్లు పేలడం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది. చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఇలాంటి ప్రమాదాలు పెరిగిపోయాయి. రాష్ట్రంలో రోడ్ల నాణ్యత పెరగడం, హైవేలు పెరగడంతో రోడ్డెక్కిన ప్రతి కారు హై స్పీడ్‌తో తీసుకెళ్తుంది. అయితే స్పీడ్‌గా వెళ్లడం ఈ ప్రమాదానికి కారణమా అంటే కచ్చితంగా కాదు. తమ వాహనానికున్న టైర్ ఎంత స్పీడ్ వరకు వెళ్లొచ్చు అనే విషయం తెలియకుండా వెళ్లడమే ప్రాణాల మీదికి వస్తుంది. మీ కారుకున్న టైరు నాణ్యత, స్పీడ్, లోడింగ్ కెపాసిటీ ఎంతో మీకు తెలుసా. కారు సామర్థ్యాన్ని బట్టి ఆ స్పీడ్‌లో వెళుతుంటారు. కానీ అందుకు సూటబుల్ టైర్లు ఉన్నాయా లేదో ఎప్పుడైనా చూసుకున్నారా ? అయితే ఇలా తెలుసుకోండి.
సాధారణంగా టైర్లు బాగున్నాయి ఎంత స్పీడ్ అయినా వెళ్లొచ్చు అని అందరు భావిస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో కొత్త టైర్లు కూడా పగిలిపోవడం గమనిస్తున్నాం. ఎందుకు కారణం ఇలాంటి విషయాలు తెలియకపోవడమే. టైర్ల కంపెనీలు కూడా సేల్స్ మార్కెటింగ్‌పై పెట్టిన దృష్టి కస్టమర్లను ఈ అంశాలపై అవగాహన కల్పించడంపై కొంచ కూడా పెట్టకపోవడం దురదృష్టం. టైర్లు కొనేటప్పుడే దాంతోపాటు ఒక మాన్యువల్, లేదా కనీసం ఒక పేపర్ మీద అయినా ఈ విషయాలు ప్రింట్ చేసి ఇస్తే చాలా ప్రమాదాలను అరికట్టవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..