Car Maintenance: కారు ఇంజిన్ లైఫ్ పెంచే సూపర్ టిప్ ఇది.. ఇంట్లో ఉండే చేసుకోవచ్చు..

సంప్రదాయ ఇంధన ఇంజిన్ కలిగిన కారులోని ప్రధాన భాగాలలో రేడియేటర్ కూడా ఒకటి. ఇది ఇంజిన్ కూలింగ్ వ్యవస్థలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఈ రేడియేటర్ సక్రమంగా పనిచేస్తేనే ఇంజిన్ కూడా బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇంజిన్ ను పనిచేస్తూ ఉండటం వల్ల ఉద్భవించే వేడిని ఈ రేడియేటరే కూల్ చేస్తుంది. దీనిలో రేడియేటర్ లోని ట్యూబ్ ద్వారా కూలెంట్ సర్క్యూలేట్ అవుతూ ఇంజిన్ మరీ అధిక వేడి అయిపోకుండా దానిని క్రమ పరుస్తుంది.

Car Maintenance: కారు ఇంజిన్ లైఫ్ పెంచే సూపర్ టిప్ ఇది.. ఇంట్లో ఉండే చేసుకోవచ్చు..
Car Radiator Flush
Follow us
Madhu

| Edited By: Ravi Kiran

Updated on: Nov 24, 2023 | 8:15 PM

కారును కలిగి ఉన్న వారు దాని మెయింటెనెన్స్ పై ఫోకస్ పెట్టాల్సిందే. కారు అంటే దానిలో అనేక భాగాలుంటాయి. ఇంజిన్ దగ్గర నుంచి క్లచ్, గేర్ బాక్స్, స్విచ్ గేర్, టైర్లు, ఇంటీరియర్ ఇలా ప్రతి భాగానికి మెయింటెనెన్స్ అవసరం. తరచూ ప్రతి భాగాన్ని సక్రమంగా సర్వీసింగ్ చేయిస్తూ ఉంటేనే కారు ఫంక్షనింగ్ సజావుగా ఉంటుంది. అయితే ఈ కార్ల సర్వీసింగ్ లో కొన్ని భాగాలను ఎక్స్ పర్ట్ లు మాత్రమే చేయాలి. మన చేస్తే ఉన్నది కూడా పాడైపోతుంది. కానీ కొన్ని భాగాలను మనం ఇంటి దగ్గర ఉండే చేసుకోవచ్చు. దానికి పెద్దగా నైపుణ్యం కూడా అవసరం లేదు.

సంప్రదాయ ఇంధన ఇంజిన్ కలిగిన కారులోని ప్రధాన భాగాలలో రేడియేటర్ కూడా ఒకటి. ఇది ఇంజిన్ కూలింగ్ వ్యవస్థలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఈ రేడియేటర్ సక్రమంగా పనిచేస్తేనే ఇంజిన్ కూడా బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇంజిన్ ను పనిచేస్తూ ఉండటం వల్ల ఉద్భవించే వేడిని ఈ రేడియేటరే కూల్ చేస్తుంది. దీనిలో రేడియేటర్ లోని ట్యూబ్ ద్వారా కూలెంట్ సర్క్యూలేట్ అవుతూ ఇంజిన్ మరీ అధిక వేడి అయిపోకుండా దానిని క్రమ పరుస్తుంది. ఒక వేళ రేడియేటరే లేకపోతే కారు ఇంజిన్ ఓవర్ హీట్ అయిపోయి, ఇంజిన్ పనిచేయడం ఆగిపోతుంది. అందుకే రేడియేటర్ ను తరచూ నీటితో ఫ్లష్ చేస్తూ ఉండాలి. దీనిని కూలెంట్ ఫ్లష్ అని కూడా అంటారు. మీరు కారు కొని చాలా కాలం అయితే తప్పనిసరిగా దీనిని చేయాల్సి ఉంటుంది. దీని కోసం మీరు సర్వీసింగ్ సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

ఎప్పుడు చేయాలి.. రేడియేటర్ కూలెంట్ ఫ్లస్ చేయాలి ఎప్పుడు చేయాలో తెలుసుకోవడం ముఖ్యం. సాధారణంగా కారు 50,000 కిలోమీటర్ల తిరిగిన తర్వాత ఈ రేడియేటర్ ఫ్లష్ అవసరం అవుతుంది. కార్ మోడల్ ను బట్టి వాడే కూలెంట్ కూడా మారుతుంటుంది. అలాగే రేడియేటర్ ను ఎప్పుడు ఫ్లష్ చేయాలో నిర్ణయించడానికి మీ కారు యజమాని మాన్యువల్ ని చెక్ చేయండి. అదే విధంగా కారు కూలెంట్ లీక్ అవుతున్నా, ఇంజిన్ బేలో కూలెంట్ కాలిపోతున్నట్లు వాసన వస్తున్నా.. కూలెంట్ కలర్ మారినా, ఇంజిన్ తరచూ ఓవర్ హీట్ అవుతున్నా.. మీ రేడియేట్ కూలెంట్ ఫ్లష్ చేయాలని చెప్పే సంకేతాలని గుర్తించాలి.

ఇవి కూడా చదవండి

ఇంజిన్ కూల్ అవ్వనివ్వండి.. కారు రేడియేటర్కు ఫ్లష్ అవసరం అని నిర్ధారించాక, కారు ఓ పక్కను పార్క్ చేసి, ఇంజిన్ ఆఫ్ చేయాలి. ఇంజిన్ వేడిగా ఉందా చల్లగా ఉందా తనిఖీ చేయాలి. ఒకవేళ వేడిగా ఉంటే వేడిగా ఉంటే పూర్తిగా చల్లబడ నివ్వాలి. అలాగే మీ కారులోపల ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్లో కూలెంట్ టెంపరేచర్ కూడా తనిఖీ చేసుకోవాలి.

పాత కూలెంట్ ని తొలగించండి.. మీరు కారు ఇంజిన్, కూలెంట్ చల్లబడిన తర్వాత కారు కింద రేడియేటర్ డ్రైన్ పెట్ కాక్ కోసం వెతకండి. అది రేడియేటర్ కింద ఒక పక్కకు ఉంటుంది. ఆ పెట్ కాక్ అంటే లోపలి కూలెంట్ ను బయటకు తీయడానికి మూతను తీసి ఓ గిన్నెను కింద పెట్టి దానిని పూర్తిగా డ్రెయిన్ చేయాలి. పాత కూలెంట్ అంతా బయటకు వచ్చాక.. తిరిగి ఆ పెట్ కాక్ టైట్ గా పెట్టేయాలి. ఈ సమయంలో చేతులకు సంరక్షణ గ్లౌవ్లు, కంటి సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

డిస్టిల్డ్ వాటర్, క్లీనర్.. పాత కూలెంట్ మొత్తం బయటకు తీసేశాక, ఇంజిన్ బ్లాక్ హుడ్ ను ఓపెన్ చేసి, కారుకు ముందు రేడియేటర్ పైనే ఉండే మెటల్ క్యాప్ ను తొలగించండి. ఆ తర్వాత దానిలో నుంచి డిస్టల్డ్ వాటర్(దీనిలో సాల్ట్స్ అండ్ మినరల్స్ ఉంటాయి)ను రేడియేటర్ రిజర్వాయర్ లో పోయాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ట్యాప్ ఎట్టి పరిస్థితుల్లోనూ పోయే కూడదు. దానిలో మలినాలు ఇంజిన్ కూలింగ్ సిస్టమ్ ను దెబ్బతీస్తుంది. ఆ తర్వాత రేడియేటర్ క్లీనర్ ను అందులో పోయాలి. అది మీ ఇష్టాన్ని వాడుకోవచ్చు. అయితే కారు మాన్యువల్ లో ఉన్న దాని ప్రకారం క్లీనర్ వాడితే బాగుంటుంది.

ఇంజిన్ ఆన్ చేయాలి.. ఈ తర్వాత రేడియేటర్ ఫ్లష్ చేయడానికి ముందు కారు ఇంజిన్ ఆన్ చేస 15 నిమిషాల పాటు ఆడించాలి. ఆ తర్వాత మళ్లీ ఆఫ్ చేసి ఇంజిన్ మళ్లీ కూల్ అవ్వ నివ్వాలి. ఆ తర్వాత కింద నుంచి మొత్తం నీటిని క్లీనర్ మళ్లీ డ్రెయిన్ చేసేయాలి. మళ్లీ ఇంజిన్ ఆన్ చేసి మిగిలి ఉన్న కూలెంట్ మొత్తాన్ని కిందకి డ్రయిన్ చేసేయాలి.

కొత్త కూలెంట్.. ఆ తర్వాత కింద పెట్ కాక్ టైట్ గా పెట్టేసి.. కొత్త రేడియేటర్ కూలెంట్ తో రేడియేటర్ రిజర్వాయర్ ను నింపాలి. చాలా కార్లు కూలెంట్, యాంటీ ఫ్రీజ్ ను సమపాళ్లలో కలిపుతారు. మీరు కారు మాన్యువల్లో పేర్కొన్న విధంగా దానిని చేయాలి. ఆ తర్వా ఇంజిన్ ఆన్ చేసి యథాతథంగా ప్రయాణాలు చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంజిన్ ఎఫిషీయన్సీ పెరుగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..