Car Price Hike: కొత్త ఏడాదిలో కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఏయే కంపెనీలు ధరలను పెంచబోతున్నాయో తెలుసా..?

|

Dec 17, 2022 | 5:35 PM

మీరు రాబోయే రోజుల్లో కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వార్త మీకోసమే. రానున్న రోజుల్లో చాలా కార్ల కంపెనీలు తమ మోడల్స్ ధరలను పెంచే అవకాశం ఉంది. వీటిలో మారుతీ సుజుకి..

Car Price Hike: కొత్త ఏడాదిలో కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఏయే కంపెనీలు ధరలను పెంచబోతున్నాయో తెలుసా..?
Car Price Hike
Follow us on

మీరు రాబోయే రోజుల్లో కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వార్త మీకోసమే. రానున్న రోజుల్లో చాలా కార్ల కంపెనీలు తమ మోడల్స్ ధరలను పెంచే అవకాశం ఉంది. వీటిలో మారుతీ సుజుకి నుండి టాటా మోటార్స్ వంటి ప్రముఖ దేశీయ కంపెనీలు ఉన్నాయి. వచ్చే నెలలో తమ వివిధ మోడళ్ల ధరలను పెంచనున్నట్టు ఈ కంపెనీలు ప్రకటించాయి. పెరుగుతున్న ధరల ప్రభావమే దీనికి కారణమని కంపెనీలు పేర్కొంటున్నాయి. వచ్చే సంవత్సరంలో ఏ కంపెనీలు తమ మోడల్స్ ధరలను పెంచబోతున్నాయో తెలుసుకుందాం.

  1. మారుతీ సుజుకీ వచ్చే నెలలో ధరలను పెంచబోతోంది. ధర పెంపు పరిమాణం కారు మోడల్, స్పెసిఫికేషన్‌లపై ఆధారపడి ఉంటుంది. Alto, Alto K 10, Baleno, Brezza, Celerio, Ciaz, Dzire, Eeco, Ertiga, Grand Vitara, Ignis, S-Presso, Swift, Wagon R మరియు XL6 ధరలను కంపెనీ పెంచబోతోంది.
  2. జనవరి 23 నుంచి హోండా తన మొత్తం శ్రేణి ధరలను పెంచనుంది. కంపెనీ తన మోడల్స్ ధరలను రూ.30,000 వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. జపనీస్ కార్ల తయారీ సంస్థ ధరల పెరుగుదలకు ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం, BS-VI నిబంధనలను అనుసరించడానికి గల కారణాలని తెలిపింది.
  3. ఆడి ఇండియా తన మొత్తం శ్రేణి ధరలను 1.7 శాతం వరకు పెంచుతుంది.
  4. మెర్సిడెస్ తన మోడళ్ల ధరలను జనవరి 1 నుంచి ఐదు శాతం వరకు పెంచనుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. కియా ఇండియా కూడా తమ మోడల్స్ ధరలను రూ.50,000 వరకు పెంచనున్నట్లు తెలిపింది. ధరల పెరుగుదల మోడల్, ఫీచర్స్‌ను బట్టి ఉంటుందని తెలిపింది. డిసెంబర్ 31, 2022 తర్వాత చేసిన బుకింగ్‌లకు ఈ పెంపు వర్తిస్తుంది.
  7. రెనాల్ట్ కూడా జనవరి నుంచి ధరలను పెంచబోతోంది. అయితే ఈ పెంపుదల గురించి కంపెనీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
  8. ఎంజీ మోటార్ ఇండియా మోడల్స్, వేరియంట్‌లను బట్టి తన కార్ల ధరలను రెండు నుండి మూడు శాతం వరకు పెంచనుంది.
  9. హ్యుందాయ్ ఇండియా వచ్చే నెల నుంచి ధరలను పెంచబోతోంది. అయితే, ఎంత పెంచుతారనేది మాత్రం కంపెనీ వెల్లడించలేదు.
  10. టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాల ధరలను జనవరి నుంచి పెంచబోతోంది. ధరల పెరుగుదల మోడల్, వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది. రెండు శాతం వరకు ధరలు పెరుగుతాయని కంపెనీ తెలిపింది.
  11. ఇతర కంపెనీలు ధరల పెంపును ఇంకా ప్రకటించలేదు. అయితే, మహీంద్రా ఏప్రిల్‌లో పెంచింది. ఈ పెరుగుదల 2.3 శాతం కంటే ఎక్కువ.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి