Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిటర్లకు గుడ్ న్యూస్.. ఆ బ్యాంకులో వడ్డీ రేట్లు భారీగా పెంపు.. పూర్తి వివరాలు..
అన్ని బ్యాంకుల్లో దీనిపై వడ్డీ రేటు ఒకేలా ఉండదు. ఒక్కో బ్యాంకులో ఒక్కలా ఉంటుంది. అయితే ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ కెనరా బ్యాంక్ తన ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. రెండు కోట్ల రూపాయల కన్నా తక్కువ ఉండే డిపాజిట్లపై ఈ కొత్త వడ్డీ రేట్లు అమలవతాయని బ్యాంకు పేర్కొంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి ఈ కొత్త రేట్లు అమలవుతాయని వివరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

కరోనా అనంతర పరిణామాల్లో జనాలు డబ్బులను ఆదా చేయడానికి మొగ్గుచూపుతున్నారు. చాలా వరకూ ఆర్థిక అక్షరాస్యత పెరిగింది. అందరూ భవిష్యత్తు కోసం ప్రణాళిక కలిగి ఉంటున్నారు. అందరూ మంచి పెట్టుబడి పథకాలలో పెట్టుబడి పెట్టడానికి మొగ్గుచూపుతున్నారు. సురక్షిత పెట్టుబడి పథకాలలో ఒకటైన ఫిక్స్ డ్ డిపాజిట్ పై ప్రజలకు అధిక నమ్మకం ఉంటుంది. స్థిరమైన రాబడితో పాటు పన్ను మినహాయింపు కూడా ఉంటుండటంతో అందరూ వీటిల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. ఇవి బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ప్రారంభించే అవకాశం ఉంది. అయితే అన్ని బ్యాంకుల్లో దీనిపై వడ్డీ రేటు ఒకేలా ఉండదు. ఒక్కో బ్యాంకులో ఒక్కలా ఉంటుంది. అయితే ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ కెనరా బ్యాంక్ తన ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. రెండు కోట్ల రూపాయల కన్నా తక్కువ ఉండే డిపాజిట్లపై ఈ కొత్త వడ్డీ రేట్లు అమలవతాయని బ్యాంకు పేర్కొంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి ఈ కొత్త రేట్లు అమలవుతాయని వివరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
వడ్డీ రేట్లు ఇలా..
కెనరా బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్లపై సాధారణ కస్టమర్‌లకు 4.00% నుంచి7.25% వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్‌లు కాల్ చేయగల డిపాజిట్‌లకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్‌లకు 4.00% నుంచి 7.40% వడ్డీ రేటును పొందవచ్చు. నాన్-కాల్ డిపాజిట్ల కోసం, కెనరా బ్యాంక్ సాధారణ ప్రజలకు 5.35% నుంచి 7.40% వడ్డీని అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు రూ. 15 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్లపై 5.35% నుంచి 7.90% వడ్డీ రేటును పొందవచ్చు. నాన్-కాల్ డిపాజిట్లలో అకాల ఉపసంహరణ అనుమతించరని గమనించాలి.
కెనరా బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, కెనరా ట్యాక్స్ సేవర్ డిపాజిట్ స్కీమ్ (జనరల్ పబ్లిక్) పై బ్యాంక్ 6.70 % వార్షిక వడ్డీని అందిస్తుంది. గరిష్ట డిపాజిట్ రూ. 1.50 లక్షలుగా ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు 0.50% అదనపు వడ్డీ డిపాజిట్లకు (ఎన్ఆర్ఓ/ఎన్ఆర్ఈ, సీజీఏ డిపాజిట్లు కాకుండా) రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తంపై 180 రోజులు, అంతకంటే ఎక్కువ కాల వ్యవధితో అందుబాటులో ఉంటుందని కెనరా బ్యాంక్ తెలిపింది.
సాధారణ కస్టమర్లకు రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న ఎఫ్‌డీల కోసం కెనరా బ్యాంక్ అత్యధిక వడ్డీ రేటు 7.40%గా ఉంది. సీనియర్ సిటిజన్‌లకు, కాల్ చేయని డిపాజిట్ల కింద ఇది 7.90%గా ఉంది. కాల్ చేయదగిన డిపాజిట్ల కోసం, సాధారణ కస్టమర్‌లు గరిష్టంగా 7.25% వడ్డీ రేటును పొందవచ్చు. సీనియర్ సిటిజన్‌లు 444 రోజులలో మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లపై 7.75% వడ్డీ రేటును పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..