Byjus: దేశంలో అత్యంత విలువైన స్టార్టప్‌గా అవతరించిన బైజూస్.. రూ. 1.20 లక్షల కోట్లు దాటిన మార్కెట్ విలువ..
Byjus: భారతదేశంలో సంచలనంగా దూసుకొచ్చింది ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ యాప్ బైజూస్. సరికొత్త టెక్నాలజీని పరిచయం చేస్తూ చిన్నారుల నుంచి ఐఎస్ కోచింగ్ తీసుకునే వారి వరకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తోందీ యాప్. ఇప్పటికే దేశంలోని...
Byjus: భారతదేశంలో సంచలనంగా దూసుకొచ్చింది ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ యాప్ బైజూస్. సరికొత్త టెక్నాలజీని పరిచయం చేస్తూ చిన్నారుల నుంచి ఐఎస్ కోచింగ్ తీసుకునే వారి వరకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తోందీ యాప్. ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే బైజూస్ దేశంలోనే అత్యంత విలువైన స్టార్టప్‌గా అవరించింది. కంపెనీ చేపట్టిన నిధుల సేకరణ ప్రయత్నాల్లో భాగంగా తాజాగా సుమారు రూ. 2,500 కోట్లను సమీకరించింది. దీంతో రౌండ్ ఫండింగ్‌లోభాగంగా బైజూస్ మార్కెట్ విలువ ఏకంగా రూ. 1.20 లక్షల కోట్లు దాటేసింది. దీంతో బైజూస్ ఇప్పటి వరకు అగ్ర స్థానంలో ఉన్న మరో స్టార్టప్ అయిన పేటీఎంను అధిగమించింది. ప్రస్తుతం పేటీఎమ్ మార్కెట్ విలువ 1600 కోట్ల డాలర్లు ఉంది. కరోనా కారణంగా విద్యా సంస్థలు మూతపడడంతో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కు బాగా డిమాండ్ పెరిగింది. బైజూస్ కూడా ఇందుకు అనుగుణంగా ట్యూషన్స్ వంటి రకరకాల సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడంతో పెద్ద ఎత్తున యూజర్లను ఆకర్షించింది. ప్రస్తుతం 8 కోట్ల మందికి పైగా విద్యార్థులు బైజూస్ సేవలను వినియోగించుకుంటున్నారు. అందులో 5.5 కోట్ల మంది వార్షిక చందాదారులని కంపెనీ తెలిపింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2020-21)లో కంపెనీ ఆదాయం 100 శాతం పెరిగి రూ.5,600 కోట్లకు చేరుకుంది.
Also Read: Sarpgandha Farming : ఈ ఔషధ మొక్క రైతులను లక్షాధికారి చేస్తుంది..! తక్కువ ఖర్చు.. ఎక్కువ లాభం..?
Egg Price: ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. కొండెక్కుతున్న కోడిగుడ్డు ధర..
ATM Currency: ఏటీఎం నుంచి చిరిగిన, చెల్లని నోట్లు వచ్చాయా..? ఇలా చేసి మంచి నోట్లు తీసుకోండి..!