AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: మీరుంటున్న ఊరిలోనే ఎవరి సహాయం లేకుండా సొంత కాళ్ల మీద చేసే వ్యాపారం..నెలకు రూ. 1 లక్ష పక్కా..

వ్యాపారం చేసేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా.. అయితే ఓ చక్కటి బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Business Ideas: మీరుంటున్న ఊరిలోనే ఎవరి సహాయం లేకుండా సొంత కాళ్ల మీద చేసే వ్యాపారం..నెలకు రూ. 1 లక్ష పక్కా..
business ideas
Madhavi
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 08, 2023 | 8:19 AM

Share

వ్యాపారం చేసేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా.. అయితే ఓ చక్కటి బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. అది కూడా ఇంటి వద్ద ఉండే మీరు ఆదాయం పొందవచ్చు. ఇక ఎందుకు ఆలస్యం ఆ బిజినెస్ ప్లాన్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కరోనా అనంతరం చాలామందిలో ఆరోగ్యం పట్ల స్పృహ బాగా పెరిగింది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి కోసం ప్రతి ఒక్కరు కూడా బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకుంటున్నారు. అయితే బలవర్ధకమైన ఆహారంలో మాంసాహారం ముందు స్థానంలో ఉంటుంది. చికెన్ మటన్ చేపలు ఇతర మాంసాహారాలు తీసుకోవడం వల్ల ప్రోటీన్ మన శరీరానికి లభిస్తుంది తద్వారా రోగనిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంది. కానీ మాంసాహారం ప్రతిరోజు తీసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని దాని స్థానంలో ప్రత్యామ్నాయంగా కోడిగుడ్లను తీసుకుంటే పుష్కలంగా ప్రోటీన్లు ఇతర మినరల్స్ విటమిన్లు లభిస్తాయి.

అందుకే కరోనా అనంతరం ప్రతి ఇంట్లోనూ కోడిగుడ్ల వాడకం పెరిగింది ముఖ్యంగా పిల్లలు పెద్దలు అన్ని వయసుల వారు కోడిగుడ్లను ఇష్టంగా తింటారు. కోడిగుడ్లను ఆమ్లెట్లు వేసుకొని లేదా ఉడకబెట్టుకొని తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. అయితే కోడిగుడ్ల వాడకం పెరిగిన నేపథ్యంలో మీరు కోడిగుడ్లను హోల్సేల్ ప్రాతిపదికన విక్రయిస్తే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ముందుగా హోల్సేల్ పద్ధతిలో కోడిగుడ్ల వ్యాపారం చేయడానికి మార్కెట్లో ఉన్న ప్రముఖ పౌల్ట్రీ సంస్థల నుంచి డీలర్ షిప్ తీసుకోవాలి అనంతరం. మీరు కోడిగుడ్ల సప్లై పొందవచ్చు కోడిగుడ్లను దాచుకునేందుకు ఒక గోడౌన్ ఏర్పాటు చేసుకోవాలి లేదా ఒక పెద్ద షాపును ఏర్పాటు చేసుకొని అందులోనే కోడిగుడ్లను భద్రపరుచుకోవాలి ఆ తరువాత మీ సమీపంలోని గ్రామాలు లేదా కాలనీలోని కిరాణా షాపులు, కూరగాయల షాపుల్లో కోడిగుడ్లను సప్లై చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ఒక కమర్షియల్ ట్రక్కును మెయింటైన్ చేస్తే మంచిది. . ఈ ట్రక్కులో మీరు కోడిగుడ్లను అన్ని షాపులకు సప్లై చేయాల్సి ఉంటుంది.

కోడిగుడ్లకు అన్ని సీజన్లోనూ డిమాండ్ ఉంటోంది కార్తీకమాసము శ్రావణమాసం మినహా దాదాపు అన్ని సీజన్లోనూ ప్రజలు కోడిగుడ్లను తింటున్నారు. ముఖ్యంగా హోటల్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, కర్రీ పాయింట్లకు కోడిగుడ్ల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళతోని ఒప్పందం కుదుర్చుకుంటే మీకు రెగ్యులర్గా ఆర్డర్లు లభిస్తూ ఉంటాయి. . మీరు నేరుగా పౌల్ట్రీ ఫారం లో నుంచి కూడా కోడిగుడ్ల సప్లైను పొందవచ్చు. నాటుకోడి గుడ్లకు అదనంగా లాభం లభిస్తుంది వీటి ధర మార్కెట్లో కొద్దిగా ఎక్కువగా ఉంటుంది.

ఇక కోడిగుడ్ల వ్యాపారానికి మీరు స్థానిక మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే జీఎస్టీ నెంబర్ కూడా పొందాల్సి ఉంటుంది. మీ వ్యాపారం పెరిగే కొద్దీ గోడౌన్లో సంఖ్య పెంచుకుంటూ పోవాల్సి ఉంటుంది ఇతర తినుబండారాల డిస్ట్రిబ్యూషన్ కూడా పెట్టుకుంటే మీకు లాభదాయకంగా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం…