GST Rules: జీఎస్టీ నిబంధనలలో కేంద్రం కీలక మార్పు.. ఆగస్టు 1 నుంచి అమలు

|

May 11, 2023 | 8:49 PM

జీఎస్టీ నిబంధనలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రూ. 5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ కలిగిన వ్యాపార సంస్థలు ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి బిజినెస్-టూ-బిజినెస్(బీ2బీ) లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ లేదా ఈ-ఇన్‌వాయిస్‌ని రూపొందించాల్సి ఉంటుంది..

GST Rules: జీఎస్టీ నిబంధనలలో కేంద్రం కీలక మార్పు.. ఆగస్టు 1 నుంచి అమలు
Gst
Follow us on

జీఎస్టీ నిబంధనలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రూ. 5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ కలిగిన వ్యాపార సంస్థలు ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి బిజినెస్-టూ-బిజినెస్(బీ2బీ) లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ లేదా ఈ-ఇన్‌వాయిస్‌ని రూపొందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రూ. 10 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న సంస్థలకు ఈ నిబంధన అమల్లో ఉంది. కేంద్రం ఆర్థిక శాఖ నోటిఫికేషన్ ద్వారా ఈ-ఇన్‌వాయిస్ నమోదు పరిమితిని తగ్గింది.

మే 10న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. బి2బి లావాదేవీల కోసం ఇ-ఇన్‌వాయిస్‌ల జారీ పరిమితిని మునుపటితో పోలిస్తే తగ్గించారు. గతంలో ఈ పరిమితి రూ.10 కోట్లు కాగా, ఇప్పుడు రూ.5 కోట్లకు తగ్గించారు. ఆగస్టు 1 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఈ ప్రకటనతో ఇ-ఇన్‌వాయిసింగ్ కింద మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఇ) కవరేజీ పెరుగుతుందని, ఇ-ఇన్‌వాయిసింగ్‌ను అమలు చేయాల్సి ఉంటుందని డెలాయిట్ ఇండియా లీడర్, పరోక్ష పన్నుల భాగస్వామి మహేష్ జైసింగ్ తెలిపారు.

ఏఎంఆర్‌జీ అండ్‌ అసోసియేట్స్ సీనియర్ భాగస్వామి రజత్ మోహన్ మాట్లాడుతూ.. ఇ-ఇన్‌వాయిస్‌ని దశలవారీగా అమలు చేయడం వల్ల అడ్డంకులు తగ్గాయని, మెరుగైన సమ్మతి, రాబడి పెరిగింది. రూ. 500 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న పెద్ద కంపెనీలకు ఈ-ఇన్‌వాయిసింగ్‌ను మొదట అమలు చేశారు. అలాగే మూడేళ్లలో ఈ పరిమితిని ఇప్పుడు రూ.5 కోట్లకు తగ్గించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి