కొత్తగా కారు కొనాలని అనుకుంటున్నారా.? అయితే మీకో అదిరిపోయే ఆఫర్.. రూ. 95 వేల వరకు తగ్గింపు.!
Business News Latest: కొత్తగా కారు కొనాలని అనుకుంటున్నారా.? అయితే మీకో గుడ్ న్యూస్. జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ అదిరిపోయే..
Business News Latest: కొత్తగా కారు కొనాలని అనుకుంటున్నారా.? అయితే మీకో గుడ్ న్యూస్. జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ అదిరిపోయే ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సదరు సంస్థ నిస్సాన్ కిక్స్ కారుపై అదిరిపోయే ఆఫర్లతో పాటు భారీ తగ్గింపును ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే..
కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం.. నిస్సాన్ కిక్స్ మోడల్‌పై రూ. 95 వేల వరకు బెనిఫిట్స్ సొంతం చేసుకోవచ్చు. ఈ మొత్తం డబ్బులో క్యాష్ డిస్కౌంట్ రూపంలో రూ. 25 వేలు తగ్గింపు ఉండగా.. ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ. 50 వేలు, లాయల్టీ బోనస్ కింద రూ. 20 వేలు పొందవచ్చు.
ఇక ఈ ఆఫర్ మార్చి 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. దగ్గరలోని షోరూమ్ వద్దకు వెళ్లి ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకోవాలని నిస్సాన్ సంస్థ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. కాగా, నిస్సాన్ కిక్స్ మోడల్ 8 వేరియంట్లలో అందుబాటులో ఉండగా.. ఈ ఆఫర్ ఎంపిక చేసిన వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుంది.
Also Read:
ఏపీ విద్యార్ధులకు ముఖ్య గమనిక.. ఆ రెండు పథకాల రిజిస్ట్రేషన్లకు రేపే లాస్ట్ డేట్.. త్వరపడండి.!
తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు అలెర్ట్.. పలు రైళ్ల సమయాల్లో మార్పులు.. వివరాలు ఇవే.!
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్ వేదికగా ప్రకటన.!