AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2023: ఆదాయపు పన్ను స్లాబ్ అంటే ఏమిటి? దాని ప్రయోజనాన్ని ఎలా పొందాలో తెలుసుకోండి

ఈనెల చివరి నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నాయి. అయితే..

Budget 2023: ఆదాయపు పన్ను స్లాబ్ అంటే ఏమిటి? దాని ప్రయోజనాన్ని ఎలా పొందాలో తెలుసుకోండి
Tax
Subhash Goud
|

Updated on: Jan 27, 2023 | 6:58 AM

Share

ఈనెల చివరి నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నాయి. అయితే ముఖ్యంగా పన్ను విషయంలో చర్చ జరుగుతోంది. కేంద్ర బడ్జెట్‌ను సమర్పించినప్పుడల్లా ఆదాయపు పన్ను స్లాబ్ గురించి చర్చ జరుగుతుంది. ఆదాయపు పన్ను అంటే మన ఆదాయంపై విధించే పన్ను. కానీ ఆదాయపు పన్ను స్లాబ్ అర్థం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పన్ను స్లాబ్ గురించి తెలుసుకుందాం. ఆదాయాన్ని పన్ను శ్లాబులుగా విభజించారు. వివిధ ఆదాయాల స్లాబ్ తయారు చేయబడింది. దాని ఆధారంగా ప్రజలు పన్ను చెల్లిస్తారు.

ప్రస్తుతం కొత్త పన్ను శ్లాబ్, పాత పన్ను స్లాబ్‌లు ఉన్నాయి. ఇది మీరు ఎన్ని లక్షల ఆదాయంపై ఎంత పన్ను చెల్లించాల్సి ఉంటుందో తెలియజేస్తుంది. దీనితో పాటు ఏ వయస్సు వ్యక్తులు వారి ఆదాయంపై పన్ను చెల్లించాలి? ఎంత మొత్తంలో పన్ను రహితం అని కూడా పన్ను స్లాబ్‌లో ఉంటుంది. ఆదాయపు పన్ను మొత్తం నేరుగా ప్రభుత్వ ఖాతాకే చేరుతుంది. పరిశ్రమలు, కంపెనీలు చెల్లించే పన్నుకు బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేస్తారు.

వివిధ ఆదాయ సంపాదకులు వేర్వేరు పన్నులు చెల్లించాలి:

పన్ను స్లాబ్‌ల ద్వారా ఆదాయం నిర్ణయిస్తారు. దాని ఆధారంగా ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పన్ను శ్లాబ్ మారుతున్న కొద్దీ దానిపై విధించే పన్ను కూడా పెరుగుతుంది. ప్రస్తుతం దేశంలో రెండు రకాల పన్ను వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి కొత్త పన్ను శ్లాబ్ కాగా, మరొకటి పాత పన్ను శ్లాబ్. గత బడ్జెట్‌లలో ప్రభుత్వం పాత పన్ను శ్లాబులను రద్దు చేయలేదు. ప్రభుత్వం రెండింటికి ఆప్షన్‌ ఇచ్చింది. మీరు ఏ పన్ను స్లాబ్‌తో పన్ను చెల్లించాలో నిర్ణయించుకోవాలి.

ఇవి కూడా చదవండి

కొత్త, పాత పన్ను స్లాబ్‌లు ఏమిటి?

పాత పన్ను శ్లాబ్ ప్రకారం.. మీ ఆదాయం రూ. 2.5 లక్షల వరకు ఉంటే, మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ఆదాయం ఉంటే 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో కూడా ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల పన్ను మినహాయింపు పొందితే.. కొత్త పన్ను శ్లాబ్ ప్రకారం.. మీ ఆదాయం 5 నుండి 7.50 లక్షల వరకు ఉంటే మీరు మొత్తం 10 శాతం పన్ను చెల్లించాలి. ఇది కాకుండా 60 నుండి 80 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులకు రూ.3 లక్షలు, 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు రూ.5 లక్షల వరకు ఆదాయం పన్ను మినహాయింపు ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..