Budget 2023: నిర్మలమ్మ గారూ ఈ బడ్జెట్‌లోనైనా మాకు ఇన్సూరెన్స్‌ సదుపాయం కల్పించండి

|

Jan 24, 2023 | 6:41 PM

ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో మంత్రి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేదానిపై ఎంతో ఆసక్తి నెలకొంది. మోడీ సర్కార్‌కు ఇదే చివరి బడ్జెట్‌..

Budget 2023: నిర్మలమ్మ గారూ ఈ బడ్జెట్‌లోనైనా మాకు ఇన్సూరెన్స్‌ సదుపాయం కల్పించండి
Life Insurance
Follow us on

ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో మంత్రి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేదానిపై ఎంతో ఆసక్తి నెలకొంది. మోడీ సర్కార్‌కు ఇదే చివరి బడ్జెట్‌. ఈ బడ్జెట్‌ సందర్భంగా ప్రజల అభిప్రాయాలను కోరుతోంది మోడీ ప్రభుత్వం. ఇందులో భాగంగా చాలా మంది తమ అభిప్రాయాలను లేఖల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. మరి ఏపీకి చెందిన రాకేష్‌ అనే వ్యక్తి బడ్జెట్‌పై ఏమంటున్నారు చూద్దాం.

నమస్కారం మేడమ్,

నా పేరు రాకేష్. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా వాసి.. ప్రస్తుతం హైదరాబాద్ లోని చందానగర్ లో నివసిస్తున్నాను. నేను బీఏ పాసయ్యాను. గ్రామంలోని కొంతమంది కుర్రాళ్లు హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. అందువల్ల వారి సహాయంతో ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు Zomato కోసం డెలివరీ చేస్తున్నాను. ఇంతకుముందు స్విగ్గీలో చేశాను. కొంత కాలం ఓలా ఉబర్‌లో డ్రైవర్‌గా కూడా పని చేశాను. పదే పదే ఉద్యోగం మారడం మంచిది కాదు, కానీ ఏం చేయాలి… మాలాంటి ఉద్యోగాలకు చోటు తక్కువ. కొన్నిసార్లు ఎక్కడో, కొన్నిసార్లు మరెక్కడో పనిచేయాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి

చూస్తూండగానే హైదరాబాద్ లో మూడేళ్లు గడిచిపోయాయి. దాదాపుగా పది ఉద్యోగాలు మారాను. ఎక్కడ చేసినా పొట్ట నిండలేదు. ఏసీ, వాషింగ్ మెషిన్ రిపేర్ పనులు చేశాను. . అలాగే అర్బన్ కంపెనీలో 6 నెలలు పనిచేశాను. ఇప్పుడు నేను సెలవులో ఉన్నాను. ఈ సెలవులు విశ్రాంతి కోసం కాదు. బలవంతంగా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న ఫుడ్ డెలివరీ చేస్తున్న సమయంలో వర్షంలో బైక్ జారీ పడింది. దీంతో నా కాలికి దెబ్బ తగిలింది. నొప్పి ఎక్కువగా ఉండడంతో పనికి వెళ్లలేక పోయాను. ఇది నా రోజూ కూలీని నాశనం చేసింది. అంతేకాదు.. నేను ఇంటర్నెట్ కోసం రోజుకు 1 GB డేటా ప్లాన్ తీసుకున్నాను. అది కూడా అయిపోయింది. కాలి నొప్పితో.. ఆర్ధిక ఇబ్బందులతో ఆలోచిస్తూ పడుకున్న నాకు మీకు నా బాధలు తెలియచెబుతూ లెటర్ ఎందుకు రాయకూడదు అనిపించింది. ఎందుకంటే, బడ్జెట్ రాబోతోంది.. మాలాంటి వారి బాధలు వింటే బహుశా ప్రభుత్వానికి మాపై జాలికలుగుతుంది అని అనిపించింది.

మా ఊరిలో మా ఆర్ధిక పరిస్థితికి తగినంతలో పెద్ద చదువే చదివాను. అయినా ఈ చదువుకు నాకు ఉద్యోగం రాదు. ఇప్పుడు ఏది దొరికినా పని చేయడం తప్పదు. ఒక సమస్య నాకు ఎప్పుడూ బాధ కలిగిస్తుంది. మిగిలిన పనులు. ఉద్యోగాలు చేసేవాళ్ళు. 8 గంటలు పని చేస్తే చాలు. కానీ, మేము మాత్రం 12 నుంచి 14 గంటలు పనిచేయాలి. కష్టానికి భయపడం. కానీ.. కష్టానికి తగ్గ జీతం మాత్రం అందుకోలేకపోతున్నాం.

రోజూ 700 నుంచి 1000 రూపాయలు సంపాదించినా నెలలో 30 రోజులు గ్యారెంటీగా పని దొరుకుతుందా? మరి 20-22 రోజులు పని దొరికినా హైదరాబాద్ లో 18-20 వేలతో ఎలా బతకగలం? ఆ కష్టం మాకు మాత్రమే తెలుసు. మేడమ్ జీ, ఇన్సూరెన్స్ పొందడం అందరికీ అవసరమనే విషయాన్ని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు పర్మినెంట్ ఉద్యోగం ఉన్న వారికి పిఎఫ్‌తోపాటు మెడికల్‌ ఇన్సూరెన్స్ కూడా అందుతుంది. అలాగే ప్రమాద బీమా కూడా అందుబాటులో ఉంటుంది. కానీ మా కంపెనీ గానీ, ప్రభుత్వం గానీ మా గురించి ఆలోచించడం లేదు.

ఇప్పుడు మీరు ఆలోచించండి.. వర్షంలో తడుస్తాం.. మేము కస్టమర్ దురుసుతనాన్ని సహిస్తాం.. ట్రాఫిక్ జయం భారాన్ని భరిస్తాం.. పొంచి ఉన్న ప్రమాదాల మధ్య రిస్క్ తీసుకుని డ్రైవ్ చేస్తాం. మా కంపెనీ లాభాలు పొందుతుంది. ప్రభుత్వం టాక్స్ వసూలు చేసుకుంటుంది. కానీ.. మా పరిస్థితి. కనీసం మా హక్కులపై ప్రశ్నించడానికి కంపెనీకి వ్యతిరేకంగా సమ్మె కూడా చేయలేము. ఓలా నడిస్తే బావుంటుందని, ఉబర్‌ని నడపితే బావుంటుంది అని అందరూ అనుకుంటారు. అయితే అలా నడిపే వారి పరిస్థితి ఏం అంతా బాలేదు. ఊరు వదిలి రావాల్సి వచ్చింది. ఇక్కడ నలుగురు కలిసి ఒక గదిలో నివాసిస్తున్నాం. నలుగురు కలిసి ఉండడం వలన కొంత డబ్బు ఆదా అవుతుంది. దానిని గ్రామంలోని తల్లిదండ్రులు.. భార్యకు పంపిస్తున్నాము. మా పిల్లలు ఆ ఊరిలోని స్కూల్ లోనే చదువుతున్నారు. ఇక్కడ నగరానికి వారిని తీసుకువచ్చే పరిస్థితి లేదు.

ఈ బడ్జెట్ లో కాస్త సాయం చేయగలరా?

మీరు ఈ బడ్జెట్ లో కాస్త సాయం చేయగలరా? మీరు సహాయం చేస్తే మా పరిస్థితి కచ్చితంగా మారుతుంది. మాకు ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయండి. అలాగే ఫ్రీ ట్రీట్మెంట్ కోసం ఏర్పాట్లు చేయండి. మీరు మా కంపెనీలను మాలాంటి వ్యక్తులకు మరింత అందుబాటులో ఉంచగలిగితే మీరు మాకు మేలు చేసినవారవుతారు. మా దగ్గర కూడా పీఎఫ్ కట్ అవ్వడం మొదలైతే కాస్త భరోసా దొరుకుతుంది. మేడమ్, ఈ ఉత్తరం మీకు అందితే ఒక్కసారి మా గిగ్ వర్కర్ల గురించి ఆలోచించండి. మీ నుంచి ఎన్నో అంచనాలు ఉన్నాయి. మీరు మాకు సహాయం చేస్తే నాలాంటి లక్షలాది మంది రాకేశ్ లు మీ కోసం ప్రార్థిస్తారు.

మీ
రాకేష్

మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి