AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Union Budget 2023: ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏమీ బాగోలేదు.. పట్టించుకోండి!

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు నిర్మలమ్మ బడ్జెట్‌పై ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏ వర్గానికి మేలు జరుగుతుందోనని..

Union Budget 2023: ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏమీ బాగోలేదు.. పట్టించుకోండి!
Budget 2023
Subhash Goud
|

Updated on: Jan 19, 2023 | 5:32 PM

Share

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు నిర్మలమ్మ బడ్జెట్‌పై ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏ వర్గానికి మేలు జరుగుతుందోనని అతృతతో ఎదురు చూస్తున్నారు. ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. కొందరైతే తమ సమస్యలను నిర్మలమ్మ ముందుంచుతున్నారు. ఉద్యోగుల ఆశలు అడియాశలు కాకుండా నెరవేర్చేలా చూడాలంటూ అభ్యర్థిస్తున్నారు. అయితే బడ్జెట్‌పై అభిప్రాయాలను తెలియజేయాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కోరడంతో ఎవరికి వారు నిర్మలమ్మకు లేఖలు రాస్తున్నారు. ఈ నేపథ్‌యంలో ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి మనోజ్ కుమార్‌ తన సమస్యలను ఆర్థిక మంత్రికి విన్నవించుకుంటున్నారు.. ఆ ప్రభుత్వ ఉద్యోగి ఏమి కోరుకుంటున్నారో ఆయన మాటల్లోనే..

గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారికి..

నమస్కారములు!

నేను మనోజ్ కుమార్‌ ఏపీలోని అమరావతిలో ఎల్డీసీగా పనిచేస్తున్నాను. ఎంతో ధైర్యంతో మీకు ఉత్తరం రాస్తున్నాను. ఈ ఉత్తరాన్ని గోప్యంగా ఉంచాలని మిమ్మలను అభ్యర్ధిస్తున్నాను. గౌరవనీయులైన మేడమ్, మేము సంవత్సరానికి రెండుసార్లు బోనస్ అందుకుంటున్నాము. ఇది బాగానే ఉంది. కానీ వచ్చే జీతంలోంచి 65 శాతం నేను ఇన్వెస్ట్ చేయాలి. 35 శాతం మాత్రమే నా చేతికి వస్తుంది.

ఇది మాత్రమే కాదు.. మా జీతం ప్రతి సంవత్సరం దాదాపు 3 నుంచి 4 శాతం పెరుగుతుంది. ద్రవ్యోల్బణం వేగం దీని కంటే చాలా ఎక్కువగా ఉందని మీకు తెలుసు. ద్రవ్యోల్బణం కంటే తక్కువ జీతం పెరగడం.. నా కుటుంబ ఆర్థిక ఖర్చులను తీర్చడాన్ని చాలా కష్టంగా మార్చుతుంది. ఇక మూడవ, నాల్గవ తరగతి  ఉద్యోగులు ఏమి చేస్తారు. వచ్చే జీతం ఏ మాత్రం సరిపోవడం లేదు.

ఏ శాఖలోనైనా సంవత్సరానికి రెండుసార్లు జీతాలు పెరుగుతాయి. కానీ మా రెవెన్యూ శాఖ గతి ఏమిటి? మా పరిస్థితులను మీరే గమనించాలండి. మా రెగ్యులర్ డ్యూటీస్ కాకుండా ఎన్నికలకు సంబంధించిన విధులు కూడా మాపై వేస్తున్నారు. కానీ మమ్మల్ని ఎన్నికల కార్యకర్తలుగా కూడా పరిగణించరు. అలాంటి పనికి మాకు ఎలాంటి గౌరవ వేతనం కూడా అందించరు. జనాభా సర్వే సమయంలో కూడా మేము మా విధులను నిర్వహిస్తాము. మేము కిసాన్ సమ్మాన్ యోజన కోసం కూడా పని చేస్తాము. మేము మొత్తం డేటాను సైతం సిద్ధం చేస్తాము. కానీ మొత్తం క్రెడిట్‌ వ్యవసాయ శాఖకు వెళ్తుంది. అయినా మేము అధిక భారం మాపై వేసుకుని విధులు నిర్వహిస్తున్నాము.

జీతం పేరుతో 30 వేల రూపాయలు చేతికి వస్తాయి. HRA కేవలం 800 రూపాయలు. ఇంత కొంచెం డబ్బుకు ఎక్కడైనా ఇల్లు అద్దెకు దొరుకుతుందా? అంతేకాకుండా, పెట్రోల్‌పై నెలవారీ ఖర్చు నెలకు 100 రూపాయలు, స్టేషనరీకి 100 రూపాయలు ఖర్చు ఇస్తారు. నెలకు కేవలం 100 రూపాయల ఖర్చుతో మీరు బైక్ నడపగలరా? ఒక లీటర్ పెట్రోల్ ధర వందకుపైనే ఉంది. మరి ఈ విషయం ప్రభుత్వానికి తెలియదా?.. మాకు క్యాంటీన్ సౌకర్యం లేదు.. అలాగే మాకు ప్రత్యేక చికిత్స సౌకర్యం కూడా లేదు. నేను పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తే 40 శాతం వరకు రీయింబర్స్‌మెంట్ పొందేందుకు అర్హత వస్తుంది. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగంలో ఉండగా మరణిస్తే ఆ కుటుంబానికి కారుణ్య ఉద్యోగం తప్ప మరేమీ రాదు మేడమ్. నేను నా పిల్లల చదువుల కోసం ఖర్చు చేస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగంలో సరైన పదోన్నతి కూడా లేదు. అంతేకాదు ఇతర సౌకర్యాలు లేవు. కొన్ని సందర్భాలలో ఆలోచించినట్లయితే ప్రైవేట్ ఉద్యోగాలు మెరుగ్గా ఉన్నాయనిపిస్తోంది. మేడమ్ జీ, నిజాయితీగా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగులగా ఉండి కూడా ఎంతో పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది.

మాపై కాస్త దయ చూపండి! మేడమ్‌జీ..పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణపై కాస్త ఉదాసీనత చూపండి. కనీసం నా పింఛన్ అయినా అందుతుంది. ఉద్యోగులకు ఈ బడ్జెట్‌లో ఏమైనా మేలు జరుగుతుందోమోనని ఆశగా ఎదరు చూస్తున్నాను.

భవదీయుడు, మనోజ్ కుమార్