AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSNL: అతి తక్కువ ధరకే 50రోజుల వ్యాలిడిటీ.. డైలీ 2GB డేటా.. ఆ కంపెనీలకు బీఎస్ఎన్ఎల్ షాక్..

మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేయాల్సిన పనిలేకుండా.. తక్కువ ధరకే ఎక్కువ బెనిఫిట్స్ కావాలా..? అయితే బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఈ కొత్త బడ్జెట్ ప్లాన్‌ మీకు బెస్ట్ ఆప్షన్. కేవలం రూ.347తో తీసుకొచ్చిన ఈ ప్లాన్‌లో అదిరే బెనిఫిట్స్ ఉన్నాయి. ఏకంగా 50రోజుల వ్యాలిడిటీ వస్తుంది. ఈ ఆఫర్ వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

BSNL: అతి తక్కువ ధరకే 50రోజుల వ్యాలిడిటీ.. డైలీ 2GB డేటా.. ఆ కంపెనీలకు బీఎస్ఎన్ఎల్ షాక్..
Krishna S
|

Updated on: Nov 03, 2025 | 8:13 PM

Share

గత కొన్ని రోజులుగా ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ జియో, ఎయిర్‌టెల్‌కు షాక్ ఇస్తూ సరికొత్త ఆఫర్లను తీసుకొస్తుంది. ఇప్పటికే చాలా మంది బీఎస్ఎన్ఎల్‌కు మారుతున్నారు. ఇప్పుడు మరో ఆఫర్‌తో ప్రైవేట్ టెలికాం సంస్థలకు గట్టి ఝలక్ ఇచ్చింది. బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం సరికొత్త బడ్జెట్-ఫ్రెండ్లీ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. కేవలం రూ.347 ధరకు లభించే ఈ ప్లాన్‌లో అదిరే బెనిఫిట్స్ ఉన్నాయి. తక్కువ ధరకు మెరుగైన ఫీచర్లను కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్లాన్ ప్రత్యేకంగా రూపొందించబడింది.

బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ ఇదే..

బీఎస్ఎన్ఎల్ ఇటీవల సోషల్ మీడియాలో ఈ కొత్త రూ.347 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ రోజుకు 2GB హైస్పీడ్ డేటాను అందిస్తుంది. రోజువారీ డేటా పరిమితి అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 80 kbpsకి తగ్గుతుంది. వినియోగదారులు దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు పొందుతారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ50 రోజులు.. అంటే వినియోగదారులు నెలకే రీచార్జ్ చేసుకునే బాధ తప్పుతుంది. దీర్ఘకాలిక ఉపయోగంతో సరసమైన ప్లాన్ కోసం చూస్తున్న యూజర్లకు ఇది అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ ప్లాన్ ఎందుకు బెటర్..

ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ రూ.347 ప్లాన్ చాలా చౌకగా, ఫీచర్-రిచ్‌గా ఉంది. ఇతర టెలికాం ఆపరేటర్లు దాదాపు ఇలాంటి ప్లాన్‌లను చాలా ఎక్కువ ధరకు అందిస్తున్నాయి. కానీ బీఎస్ఎన్ఎల్ తక్కువ ధరకే అందించడం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్ 4G సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాలలో, ఈ ప్లాన్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు.

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ విస్తరణ

ఇటీవలి కాలంలో బీఎస్ఎన్ఎల్ తన నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచింది. అనేక నగరాల్లో 4G సేవలను ప్రారంభించింది. కంపెనీ ఇప్పుడు వినియోగదారులకు మెరుగైన కాల్ నాణ్యత, వేగవంతమైన డేటా, నమ్మదగిన సేవలను అందించడంపై దృష్టి పెట్టింది. ఈ కొత్త రూ.347 ప్లాన్‌ను తన కస్టమర్ బేస్‌ను విస్తరించడానికి, కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా చూడొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి