BSNL: ప్రైవేట్‌ కంపెనీలకు టెన్షన్‌ పెడుతున్న బీఎస్‌ఎన్‌ఎల్‌.. 3 ప్లాన్లు మరింత చౌకగా..

|

Sep 05, 2024 | 11:45 AM

ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియాల టెన్షన్‌ను బిఎస్‌ఎన్‌ఎల్ మళ్లీ పెంచింది. ప్రభుత్వ టెలికాం కంపెనీ తన మూడు ప్లాన్‌లను చౌకగా చేసింది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఇంటర్నెట్‌ను విస్తృతంగా ఉపయోగించే వినియోగదారులకు ప్రయోజనాలను అందించింది. గత నెలలోనే ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్‌లను 15 శాతం ఖరీదైనవిగా..

BSNL: ప్రైవేట్‌ కంపెనీలకు టెన్షన్‌ పెడుతున్న బీఎస్‌ఎన్‌ఎల్‌.. 3 ప్లాన్లు మరింత చౌకగా..
Bsnl
Follow us on

ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియాల టెన్షన్‌ను బిఎస్‌ఎన్‌ఎల్ మళ్లీ పెంచింది. ప్రభుత్వ టెలికాం కంపెనీ తన మూడు ప్లాన్‌లను చౌకగా చేసింది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఇంటర్నెట్‌ను విస్తృతంగా ఉపయోగించే వినియోగదారులకు ప్రయోజనాలను అందించింది. గత నెలలోనే ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్‌లను 15 శాతం ఖరీదైనవిగా చేశాయని, దీని తర్వాత ప్రజలు తమ నంబర్‌లను నిరంతరం BSNLకి పోర్ట్ చేస్తున్నారు.

ఈ మూడు ప్లాన్లు చౌకగా..

బీఎస్‌ఎన్‌ఎల్‌ తన మూడు ప్రారంభ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల రేట్లను తగ్గించింది. ఈ మూడు ప్లాన్‌లలో వినియోగదారులు ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ వేగంతో ఇంటర్నెట్‌కు యాక్సెస్ పొందుతారు. కంపెనీ ఇప్పుడు నెలకు రూ. 249, రూ.299, రూ. 329 చవక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల కోసం ఇంటర్నెట్ వేగాన్ని 25Mbpsకి పెంచింది. ఇంతకుముందు, వినియోగదారులు 10Mbps నుండి 20Mbps వరకు వేగం పొందేవారు.

ఈ ప్రయోజనాలు

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ మూడు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP)పై ఆధారపడి ఉంటాయి. రూ.249 ప్లాన్‌లో మొత్తం 10GB ఇంటర్నెట్ డేటాను వినియోగదారులకు నెల మొత్తం అందిస్తోంది. ఈ ప్లాన్‌లో 10GB డేటా అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 2 Mbpsకి తగ్గుతుంది. దీని తర్వాత రూ. 299 ప్లాన్ FUP పరిమితి 20GB కాగా, మూడవ రూ. 329 ప్లాన్ FUP పరిమితి 1000GB. అదే సమయంలో డేటా అయిపోయిన తర్వాత 4Mbps వేగంతో అపరిమిత డేటా అందించబడుతుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ. 249, రూ.299 ప్లాన్‌లు కొత్త వినియోగదారుల కోసం మాత్రమే ఉన్నాయి. అదే సమయంలో రూ. 329 ప్లాన్ వినియోగదారులందరికీ అందుబాటులో ఉంది. ఈ మూడు ప్లాన్‌లలో హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్‌తో పాటు ఏ నంబర్‌కైనా కాల్ చేసుకునే సదుపాయం కూడా కల్పించింది.

ఇది కూడా చదవండి: Taxpayers: పన్ను కట్టేవారిలో వీరే తోపులు.. ఫస్ట్ ప్లేస్‌లో ఎవరున్నారో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి