Footwear Prices: పాదరక్షలపై నిబంధనల బాదుడు.. భారీగా పెరగనున్న చెప్పుల ధరలు

ఇటీవల భారతదేశంలో మెరుగైన జీవనశైలి ఆధారంగా బట్టలు, చెప్పులకు అధిక ధర వెచ్చించే వారి సంఖ్య పెరిగింది. అయితే ఒక్కోసారి మనం మార్కెట్‌లో వేల రూపాయలు పోసి చెప్పులు కొనుగోలు చేస్తూ ఉంటాం. అయితే ఎంత ధరతో చెప్పులను కొనుగోలు చేసినా పెట్టిన ధరకు వచ్చిన నాణ్యతకు అస్సలు సంబంధం ఉండదు. అయితే ఆగస్టు 1 నుంచి పాదరక్షల అమ్మకాల విషయంలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

Footwear Prices: పాదరక్షలపై నిబంధనల బాదుడు.. భారీగా పెరగనున్న చెప్పుల ధరలు
Footwear Prices

Updated on: Aug 04, 2024 | 11:26 AM

ఎదుటి వారు ధరించే షూ ఆధారంగా ఆ వ్యక్తి ఎలాంటి వాడో? చెప్పవచ్చని కొందరు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఆర్మీలో పని చేసే వారు ఈ విషయంలో చాలా కరెక్ట్ ఉంటారు. ఇటీవల భారతదేశంలో మెరుగైన జీవనశైలి ఆధారంగా బట్టలు, చెప్పులకు అధిక ధర వెచ్చించే వారి సంఖ్య పెరిగింది. అయితే ఒక్కోసారి మనం మార్కెట్‌లో వేల రూపాయలు పోసి చెప్పులు కొనుగోలు చేస్తూ ఉంటాం. అయితే ఎంత ధరతో చెప్పులను కొనుగోలు చేసినా పెట్టిన ధరకు వచ్చిన నాణ్యతకు అస్సలు సంబంధం ఉండదు. అయితే ఆగస్టు 1 నుంచి పాదరక్షల అమ్మకాల విషయంలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. మార్కెట్లో విక్రయించే బూట్లు, చెప్పులు విషయంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అప్‌డేటెడ్ నాణ్యత మార్గదర్శకాలను పాటించాలని క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్  పేర్కొంది. అయితే నిబంధనలు పాటించడం వల్ల దేశీయంగా పాదరక్షల ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే ధర పెరిగినా నాణ్యమైన వస్తువు మనకు చేరుతుందని గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాణ్యతాప్రమాణాలు మెరుగుపర్చడం ద్వారా చెప్పుల ధరలు ఏ స్థాయిలో పెరుగుతాయో? ఓ సారి తెలుసుకుందాం. 

ఆగస్టు 1, 2024 నుంచి పాదరక్షల పరిశ్రమకు సంబంధించిన కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త నిబంధనలు మార్కెట్‌లో లభించే పాదరక్షల ఉత్పత్తుల నాణ్యత, భద్రతను మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. పాదరక్షల భాగాలు, లోపలి లైనింగ్ నుంచి బయటి సోల్ వరకు, రసాయన కూర్పు, మన్నిక వంటి వివరాల కోసం కఠినమైన పరీక్షలు చేయాల్సి ఉంటుంది. బీఐఎస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఇది భారతదేశ జాతీయ ప్రమాణాల సంస్థ. బీఐఎస్ నిబంధనలు సాధారణంగా తయారీదారులు, వినియోగదారులు, నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులతో సహా వివిధ వాటాదారులతో కూడిన ఏకాభిప్రాయ ఆధారిత ప్రక్రియ ద్వారా అభివృద్ధి చేస్తారు. ఈ సహకార విధానం ప్రమాణాలు ఆచరణాత్మకంగా, సంబంధిత అన్ని పక్షాలకు ఆమోదయోగ్యమైనవని నిర్ధారిస్తుంది.

నాణ్యతా ప్రమాణాలు

పాదరక్షల తయారీదారులు ఇప్పుడు తప్పనిసరిగా ఐఎస్ 6721, ఐఎస్ 10702 మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి, ఇవి ముడి పదార్థాలు, నిర్మాణం, మొత్తం మన్నికపై కఠినమైన నిబంధనలు ఉంటాయి. 

ఇవి కూడా చదవండి

ధరలపై ప్రభావం

ఈ కొత్త ప్రమాణాలకు అనుగుణంగా పెరిగిన ఖర్చుల కారణంగా పాదరక్షల ధర పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే నిబంధనలను అమలు చేసిన తర్వాత చూడాల్సి ఉంటుంది. 

స్టాక్‌కు గ్రేస్ పీరియడ్

విక్రేతలు పాత స్టాక్‌ను విక్రయించడాన్ని కొనసాగించవచ్చు కానీ ఈ ఇన్వెంటరీ వివరాలను తప్పనిసరిగా బీఐఎస్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. మొత్తంగా 46 రకాల పాదరక్షల వస్తువులు సవరించిన బీఐఎస్ నిబంధనలకు లోబడి ఉంటాయి.

మినహాయింపులు ఇలా

వార్షిక టర్నోవర్ రూ.50 కోట్ల కంటే తక్కువ ఉన్న తయారీదారులకు బీఐఎస్ నియమం వర్తించదు. అందువల్ల స్టార్టప్ కంపెనీలను ఈ నిర్ణయం పెద్దగా ప్రభావితం చేయదు. 

మ‌రిన్ని బిజినెస్ వార్త‌ల కోసం క్లిక్ చేయండి…