AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Biryani Business: బిర్యానీ బిజినెస్‌ గురించి మీకు తెలుసా..? రూ.1.35 లక్షల సంపాదన..!

Biryani Business: బిర్యానీ బిజినెస్.. దేశంలో.. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యాపారానికి బాగా క్రేజ్ ఉంది. బిర్యానీకి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఇది మంచి లాభాలు అందించే వ్యాపారంగా గుర్తింపు పొందింది. మరి బిర్యానీ బిజినెస్‌ చేస్తూ రోజుకు ఎంత సంపాదించవచ్చో తెలుసుకుందాం..

Biryani Business: బిర్యానీ బిజినెస్‌ గురించి మీకు తెలుసా..? రూ.1.35 లక్షల సంపాదన..!
Biryani Business
Subhash Goud
|

Updated on: Aug 15, 2026 | 7:33 PM

Share

Biryani Business: ఈ రోజుల్లో రకరకాల బిజినెస్‌లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడి పెడుతూ ఎక్కువ లాభాలు సంపాదించే బిజినెస్‌ మార్గాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఫుడ్‌కు సంబంధించిన బిజినెస్‌లు ఎప్పుడు కూడా లాభాల్లోన ఉంటాయి. కాకపోతే కష్టపడే తత్వం, ఓర్పు ఉంటే మంచి సక్సెస్‌ సాధించవచ్చు. ఇక మంచి లాభాలు సంపాదించే వ్యాపారలలో బిర్యానీ బిజినెస్‌. ఫుడ్‌ను బాగా తినేవారు అదే ఫుడ్ ద్వారా మంచిగా సంపాదించవచ్చు. తక్కువ పెట్టుబడి.. అధిక రాబడి.. మార్కెటింగ్, అలాగే స్థానికంగా కాంటాక్ట్స్ పెంచుకోవడం, అలాగే క్యాటరింగ్ లాంటివి కూడా చేస్తే మీరు అనుకున్నదానికంటే రెట్టింపు సంపాదించుకోవచ్చంటున్నారు నిపుణులు.

ఇది కూడా చదవండి: POP Ceiling: రేకుల ఇంటికి ఏ సీలింగ్ బెస్ట్? జిప్సం, పీవీసీ, థర్మాకోల్ సీలింగ్స్‌కు ఎంత ఖర్చు.. ప్రయోజనాలు ఏంటి?

బిర్యానీ బిజినెస్..

బిర్యానీ బిజినెస్.. దేశంలో.. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యాపారానికి బాగా క్రేజ్ ఉంది. బిర్యానీకి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఇది మంచి లాభాలు అందించే వ్యాపారంగా గుర్తింపు పొందింది. మరి బిర్యానీ బిజినెస్‌ చేస్తూ రోజుకు ఎంత సంపాదించవచ్చో తెలుసుకుందాం..

ఒక ప్లేట్ బిర్యానీ:

ఇక ఒక ప్లేట్ బిర్యానీ ధర రూ. 90గా నిర్ణయించినట్లయితే రోజుకు కనీసం 50 ప్లేట్లు అమ్మడం ద్వారా మీరు రూ. 4500 వరకు అవుతుంది. ఈ లెక్కన, నెలవారీ మొత్తం సంపాదన రూ. 1.35 లక్షలుగా అవుతుంది. అయితే, ప్రతి వ్యాపారంలో ఖర్చులు ఉంటాయి. బిర్యానీ వ్యాపారానికి సంబంధించి ఆహార పదార్థాలు, రూమ్ లేదా షాప్ అద్దె, సిబ్బంది జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులు కలిపి నెలకు సుమారు రూ. 80 వేలు ఖర్చులు కావచ్చు.

నెలవారీ సంపాదన నుంచి..

ఇక మొత్తం నెలవారీ సంపాదన నుంచి ఖర్చులను తీసివేస్తే.. యజమానికి నెలకు రూ. 55 వేల వరకు మిగులుబాటు ఉంటుంది. ఈ లాభాన్ని సంవత్సరానికి లెక్కిస్తే ఇది రూ. 6.60 లక్షలకు చేరుకుంటుంది.

ఫుడ్ యాప్స్‌తో కూడా..

మీరు ఒక్క ప్రాంతంలోనే వ్యాపారాన్ని నడపకుండా క్యాటరింగ్ అలాగే స్థానిక కాంటాక్టులు మనం సంపాదిస్తే.. ఈజీగా మన బిజినెస్ వృద్ది చెందుతుంది. అలాగే పార్టీలు, ఫంక్షన్‌లు లాంటి వాటికి సప్లై చేయవచ్చు. ఫుడ్ యాప్స్‌తో కూడా కనెక్ట్ అయితే.. మనకు ఇంకా లాభాలు వస్తాయి.

ఇది కూడా చదవండి: Best Scheme: కేవలం రూ.250 పెట్టుబడితో మొదలు పెడితే చేతికి రూ.40 లక్షలు.. కాసులు కురిపించే ప్రభుత్వ స్కీమ్‌

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us