Bharti Airtel Q3 Results: ఎయిర్‌టెల్‌ త్రైమాసిక ఫలితాలు.. 2.8 శాతం తగ్గిన లాభం..!

Bharti Airtel Q3 Results: త్రైమాసికంలో టెలికం కంపెనీలు దూసుకుపోతున్నాయి. పోటాపోటీగా తమ తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి. ఇక భారతీ ఎయిర్‌టెల్‌ డిసెంబర్‌తో..

Bharti Airtel Q3 Results: ఎయిర్‌టెల్‌ త్రైమాసిక ఫలితాలు.. 2.8 శాతం తగ్గిన లాభం..!
Follow us
Subhash Goud

|

Updated on: Feb 09, 2022 | 9:36 AM

Bharti Airtel Q3 Results: త్రైమాసికంలో టెలికం కంపెనీలు దూసుకుపోతున్నాయి. పోటాపోటీగా తమ తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి. ఇక భారతీ ఎయిర్‌టెల్‌ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.830 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో పరిశీలిస్తే రూ.854 కోట్లుతో పోల్చితే లాభం స్వల్పంగా 2.8 శాతం తగ్గుముఖం పట్టింది. త్రైమాసిక సమీక్షా కాలంలో ఆదాయం 12.6 శాతం పెరిగి రూ.26,518 కోట్ల నుంచి రూ.29,867 కోట్లకు చేరింది.

అయితే ఇటీవల కాలంలో సవరించిన టారిఫ్‌ ఫలితాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. ఒక్కో వినియోగదారునిపై ఆదాయం రూ.163తో త్రైమాసికంలో అగ్రగామిగా ఉన్నామని కంపెనీ ఎండీ, సీఈఓ గోపాల్‌ విట్టల్‌ తెలిపారు. టారిఫ్‌ల సవరణ పూర్తి ప్రభావం నాలుగో త్రైమాసికంలో స్పష్టంగా కనిపిస్తుందని ఆయన అన్నారు. కాగా డిసెంబరు నాటికి కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర రుణ భారం రూ.1.57 లక్షల కోట్లుంది. 4జీ వినియోగదారుల సంఖ్య భారతదేశంలో 16.56 కోట్ల నుంచి 18.1 శాతం వృద్ధితో 19.5 కోట్లకు చేరుకుంది. ఒక్కో వినియోగదారుడు సగటు డేటా వినియోగం 16.37జీబీ నుంచి 11.7 పెరిగి 18.28జీబీకి చేరినట్లు వెల్లడించారు.  కాగా, నవంబర్‌లో ఎయిర్‌టెల్ ప్రిపెయిడ్ ప్లాన్ల టారిఫ్‌లను పెంచింది. ఆ తర్వాత రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాలు కూడా ఇదే విధంగా చార్జీలను పెంచాయి.

ఇవి కూడా చదవండి:

Jio Calls, Data Free: రిలయన్స్‌ జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. రెండు రోజులు ఉచితంగా కాల్స్‌, డేటా

Home Loan Tax Benefit: హోమ్‌ లోన్‌తో అదిరిపోయే బెనిఫిట్‌.. రూ.5 లక్షల వరకు ఆదా..!

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!