Investment Plans: ఇంట్లో నుంచే డబ్బులు సంపాదించడం ఎలా.? ఇలా చేస్తే లచ్చిందేవి వెతుక్కుంటూ వచ్చినట్టే.!

సెమీకండక్టర్లు, సోలార్ ఎనర్జీ, డిఫెన్స్ రంగాలు భారతదేశం భవిష్యత్తుగా కనిపిస్తున్నాయి. ఈ రంగాల్లోని మల్టీబ్యాగర్ స్టాక్స్ కొని పక్కన పెడితే డబ్బు వెతుక్కుంటూ వస్తుంది. ఓపికతో, సరైన సమయంలో పెట్టుబడులు పెడితే మంచి రాబడులు ఉంటాయని బిజినెస్ నిపుణులు సూచించారు. ఆ వివరాలు..

Investment Plans: ఇంట్లో నుంచే డబ్బులు సంపాదించడం ఎలా.? ఇలా చేస్తే లచ్చిందేవి వెతుక్కుంటూ వచ్చినట్టే.!
Stock Market

Updated on: Jan 09, 2026 | 2:05 PM

రాబోయే ఐదు నుంచి పది సంవత్సరాలలో ఈ రంగాలు అభివృద్ధి దిశగా సాగుతున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు, ఓపిక, సరైన రంగాల ఎంపికతో భారీ సంపాదనను మనం సృష్టించవచ్చు. ముఖ్యంగా సెమీకండక్టర్లు, సోలార్ ఎనర్జీ, డిఫెన్స్ రంగాల భవిష్యత్తు మంచిగా కనిపిస్తున్నాయని బిజినెస్ నిపుణులు అంటున్నారు.

ఇది చదవండి: అప్పులు కాదు.. మీ ఇంటి నిండా డబ్బులే.! ఈ 8 సూత్రాలు పాటిస్తే మీరే కోటీశ్వరులు..

1. సెమీకండక్టర్ రంగం:

ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువుకు చిప్ అవసరం. కోవిడ్ సమయంలో చిప్ కొరత ఉత్పత్తిని ఎలా ప్రభావితం చేసిందో మనం చూశాం. ప్రస్తుతం భారతదేశం సెమీకండక్టర్ తయారీని ప్రోత్సహించడానికి పిఎల్ఏ పథకాల కింద అనేక ప్రయత్నాలు చేస్తోంది. గుజరాత్‌లో ఇప్పటికే నానో చిప్‌ల ఉత్పత్తి ప్రారంభమైంది. 2028 నాటికి పూర్తిస్థాయిలో పెద్ద చిప్‌ల ఉత్పత్తి ప్రారంభం అయ్యేలా ఉంది. ప్రస్తుతం సీజీ పవర్, మోస్‌చిప్, డిక్సన్ టెక్నాలజీ, టాటా ఎల్ఎక్స్‌ఐ, వేదాంత, మైక్ ఎలక్ట్రానిక్స్ లాంటి కంపెనీలు ఈ రంగంలో పనిచేస్తున్నాయి. రిలయన్స్, టాటా వంటి దిగ్గజాలు కూడా ఈ రంగంలోకి వచ్చే ప్రణాళికలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

2. సోలార్ ఎనర్జీ:

శిలాజ ఇంధనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల(ఈవి) వైపు మారుతున్న నేపథ్యంలో, పునరుత్పాదక శక్తికి డిమాండ్ పెరిగింది. 2030 నాటికి శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాలని పారిస్ కన్వెన్షన్‌లో లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి అనుగుణంగా సోలార్ శక్తి వినియోగం పెరుగుతుందని, ప్రభుత్వం కూడా డిస్కౌంట్లతో మద్దతు ఇస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గృహ వినియోగదారులు కూడా సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకుంటున్నారని, కాబట్టి సోలార్ రంగంలోని స్టాక్స్ కూడా దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయి.

3. డిఫెన్స్:

పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారత రక్షణ రంగ సామర్థ్యం నిరూపితమైందని, యూరోపియన్ దేశాలు కూడా తమ జిడిపిలో 3-5 శాతం రక్షణ రంగంలో పెట్టుబడులను పెంచుకుంటున్నాయని అంచనా. హెచ్‌ఏఎల్(హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్) బీడీఎల్ (భారత్ డైనమిక్స్ లిమిటెడ్) లాంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు, ప్రైవేట్ కంపెనీలకు కూడా అధిక ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు. అందువల్ల, డిఫెన్స్ రంగ స్టాక్స్ కూడా రాబోయే 5-10 సంవత్సరాలలో మంచి రాబడులను ఇవ్వగలవని బిజినెస్ నిపుణులు అంటున్నారు.

ఇది చదవండి: ‘ఆ సినిమా పూర్తయ్యాక.. తారక్.! నాలుగేళ్లు నీ మొహం ఇక చూపించకు అన్నాడు..’

గమనిక: షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టే ముందు దయచేసి మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. నష్టాలకు టీవీ9 బాధ్యత వహించదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి