AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holiday: ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? సెప్టెంబర్‌ సెలవుల జాబితా!

చాలా మంది వినియోగదారులు ప్రతి రోజు బ్యాంకు పనుల నిమిత్తం వెళ్తుంటారు. లావాదేవీలు, చెక్స్‌, ఇతర పనుల కోసం బ్యాంకులను సందర్శిస్తుంటారు. అయితే సెప్టెంబర్‌ 7ఈ రోజు గణేష్‌ చతుర్థి. ఈ పండగను దేశ మంతటా ఘనంగా జరుపుకొంటారు. పండగ కారణంగా బ్యాంకులు బంద్‌ ఉంటాయా? లేదా అనే అనుమానం కలుగుతుంటుంది..

Bank Holiday: ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? సెప్టెంబర్‌ సెలవుల జాబితా!
Subhash Goud
|

Updated on: Sep 07, 2024 | 8:15 AM

Share

చాలా మంది వినియోగదారులు ప్రతి రోజు బ్యాంకు పనుల నిమిత్తం వెళ్తుంటారు. లావాదేవీలు, చెక్స్‌, ఇతర పనుల కోసం బ్యాంకులను సందర్శిస్తుంటారు. అయితే సెప్టెంబర్‌ 7ఈ రోజు గణేష్‌ చతుర్థి. ఈ పండగను దేశ మంతటా ఘనంగా జరుపుకొంటారు. పండగ కారణంగా బ్యాంకులు బంద్‌ ఉంటాయా? లేదా అనే అనుమానం కలుగుతుంటుంది. దీని సమాధానం అవుననే సమాధానం వస్తుంది. ఈ రోజు బ్యాంకులకు సెలవు. దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. అలాగే సెప్టెంబర్‌ 8న ఆదివారం. ఇలా బ్యాంకులు రెండు రోజుల పాటు మూసి ఉండనున్నాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తో సహా భారతదేశంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు రెండు రోజుల పాటు మూసి ఉండనున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన జాబితా ఈ నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకుందాం.

  • సెప్టెంబర్ 1 ఆదివారం
  • సెప్టెంబర్ 5, గురువారం: శ్రీమంత శంకరదేవ తిథి (అస్సాంలో సెలవు)
  • సెప్టెంబర్ 7, శనివారం: వినాయక చతుర్థి
  • సెప్టెంబరు 8: ఆదివారం సెలవు (ఒడిషాలో నౌకై పండుగ)
  • సెప్టెంబర్ 13, శుక్రవారం: రామ్‌దేవ్ జయంతి, తేజ దశమి (రాజస్థాన్‌లో సెలవు)
  • సెప్టెంబర్ 14: రెండవ శనివారం (కేరళలో ఓనం)
  • సెప్టెంబర్ 15: ఆదివారం సెలవు (కేరళలోని తిరువోణం)
  • సెప్టెంబర్ 16, సోమవారం: ఈద్ మిలాద్
  • సెప్టెంబర్ 17, మంగళవారం: ఇంద్ర జాత్ర (సిక్కింలో సెలవు)
  • సెప్టెంబర్ 18, బుధవారం: శ్రీ నారాయణగురు జయంతి (కేరళలో సెలవు)
  • సెప్టెంబర్ 21, శనివారం: శ్రీ నారాయణగురు సమాధి (కేరళలో సెలవు)
  • సెప్టెంబర్ 22: ఆదివారం సెలవు
  • సెప్టెంబర్ 23, సోమవారం: బలిదాన్ డే (హర్యానాలో సెలవు)
  • సెప్టెంబర్ 28: నాల్గవ శనివారం
  • సెప్టెంబర్ 29: ఆదివారం సెలవు

ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు:

ఇదిలా ఉండగా, బ్యాంకులకు సెలవు రోజుల్లో ఆన్‌లైన్‌ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. వాటికి ఎలాంటి అంతరాయం ఉండదు. నగదు అత్యవసర పరిస్థితుల కోసం అన్ని బ్యాంకులు వారాంతపు లేదా ఇతర సెలవులతో సంబంధం లేకుండా తమ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు, మొబైల్ బ్యాంకింగ్ సేవల యాప్‌లను నిర్వహిస్తాయి. బ్యాంకులు మూసి ఉన్న సమయాల్లో ఆన్‌లైన్‌ సర్వీసులు కొనసాగుతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి