Bajaj Electric Scooter : త్వరలో మార్కెట్‌లోకి ‘బజాజ్ చేతక్ స్కూటర్’..! హైదరాబాద్‌లో అమ్మకాలు..?

| Edited By: uppula Raju

Jul 10, 2021 | 11:48 PM

Bajaj Electric Scooter : బజాజ్ చేతక్ స్కూటర్.. ఒకప్పుడు ఎంతో ఫాలోయింగ్ ఉన్న వెహికిల్. స్టేటస్ సింబల్ గా పేరుపొందింది.

Bajaj Electric Scooter : త్వరలో మార్కెట్‌లోకి బజాజ్ చేతక్ స్కూటర్..! హైదరాబాద్‌లో అమ్మకాలు..?
Bajaj Electric Scooter
Follow us on

Bajaj Electric Scooter : బజాజ్ చేతక్ స్కూటర్.. ఒకప్పుడు ఎంతో ఫాలోయింగ్ ఉన్న వెహికిల్. స్టేటస్ సింబల్ గా పేరుపొందింది. అప్పట్లో ప్రతి మిడిల్ క్లాస్ కుటుంబం కల ఈ స్కూటర్. తర్వాతి కాలంలో ఆటోమొబైల్ రంగంలో చోటు చేసుకున్న పలు విప్లవాత్మక మార్పుల కారణంగా కాలగమనంలో కలిసిపోయిన సంగతి తెలిసిందే. తర్వాత చేతక్ పై బజాజ్ కంపెనీ పెద్దగా దృష్టి పెట్టలేదు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తున్నందును మళ్లీ ఈ పేరు తెరపైకి వచ్చింది. బజాజ్ కంపెనీ చేతక్ ను ఎలెక్ట్రిక్ స్కూటర్ గా మార్కెట్లోకి తీసుకువస్తోంది. పేరు మాత్రమే చేతక్ పెట్టారు స్కూటర్ మాత్రం ఎలక్ట్రిక్ వేరియంట్.

ప్రఖ్యాత భారత యోధుడు మహారాణ ప్రతాప్ సింగ్ కు అత్యంత ఇష్టమైన గుఱ్ఱం ఉండేది. దాని పేరు “చేతక్”. దానినే తన స్కూటర్ కు పేరుగా పెట్టారు రాహుల్ బజాజ్. తాజాగా హైదరాబాద్‌లో ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని ప్రవేశ పెట్టేందుకు బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ సిద్ధమైంది. ఇప్పటికే నాగ్‌పూర్‌లో చేతక్‌ ఈవీ షోరూమ్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. నాగ్‌పూర్‌ తర్వాత చెన్నై, హైదరాబాద్‌లలో తమ స్కూటర్‌ తెచ్చేలా బజాజ్‌ ప్లాన్‌ చేస్తోంది. పూణె, బెంగళూరు నగరాల్లో బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. సాధ్యమైనంత త్వరలో బుక్ చేసుకున్న కస్టమర్లకు వాహనాలను అందిస్తామని తెలిపారు.

రెండు వేరియంట్లు
ప్రస్తుతం బజాజ్‌ చేతక్‌ అర్బన్‌, ప్రీమియం వేరియంట్లలో లభిస్తోంది. షోరూమ్‌ ప్రకారం అర్బన్‌ ధర రూ. 1.42,620 ఉండగా ప్రీమియం ధర రూ. 1,44,620గా ఉంది. ఇందులో 2 కిలోవీట్‌ బ్యాటరీలు అమర్చారు. బ్యాటరీలకు 3 ఏళ్లు లేదా 50,000 కి,మీ వారంటీ అందిస్తున్నారు. ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే మోడ్‌ను బట్టి 85 నుంచి 95 కి.మీ వరకు ప్రయాణం చేయవచ్చు. 2021 మార్చిలో ఒకేసారి 30 నగరాల్లో చేతక్‌ అమ్మకాలు ప్రారంభించాలని నిర్ణయించినా తర్వాత ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. క్రమంగా ఒక్కో సిటీలో బజాజ్‌ షోరూమ్స్‌ ప్రారంభిస్తూ పోతుంది.

Katti Mahesh Death: కత్తి మహేష్ మృతిపై తమ సంతాపాన్ని వెలిబుచ్చుతోన్న ఏపీ పొలిటికల్ పార్టీలు

Wimbledon 2021: వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ విజేతగా ఆష్లే బార్టీ.. ఫైనల్‌లో కరోలినా ప్లిస్కోవాపై ఘన విజయం

Midhun Reddy: చంద్రబాబు ఆటలు మా వద్ద సాగవు : వైసీపీ ఎంపీలు.. విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి