Bank Holidays : బ్యాంకు ఖాతాదారులకు గమనిక..! ఆగస్టులో 15 రోజులు బ్యాంకులు బంద్..
Bank Holidays : వినియోగదారులకు నిత్యం బ్యాంకులో ఏదో ఒక పని ఉంటుంది. కానీ కొంతమంది వాటిని వాయిదా వేస్తూ తర్వాత చేద్దాంలే
Bank Holidays : వినియోగదారులకు నిత్యం బ్యాంకులో ఏదో ఒక పని ఉంటుంది. కానీ కొంతమంది వాటిని వాయిదా వేస్తూ తర్వాత చేద్దాంలే అనుకుంటారు. ఇలా అనుకునేవారు ఈ విషయాలను గమనించుకోవాలి. లేదంటే సరైన సమయంలో మీ లావాదేవీలు ఆగిపోవచ్చు. అందుకే బ్యాంకుకు ఏ రోజు సెలవు ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
వచ్చే నెల అంటే ఆగస్టులో బ్యాంకులకు చాలా సెలవులు వస్తున్నాయి. అందువల్ల మీరు బ్యాంకులు ఏ ఏ రోజుల్లో పని చేయవో ముందే తెలుసుకుంటే మంచిది. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీకు ఏదైనా పని ఉన్న ఒక రోజు ముందు చేసుకోవడానికి వీలుకలుగుతుంది. దేశీ కేంద్ర బ్యాంక్, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI బ్యాంక్ హాలిడే క్యాలెండర్ ప్రకారం చూస్తే.. ఆగస్ట్‌లో బ్యాంకులకు 15 రోజులు సెలవులు. శ్రావణ మాసం కావడంతో సెలవులు ఎక్కువగా వస్తున్నాయి.
ఆగస్ట్ 1 ఆదివారం 8 ఆదివారం 13 దేశభక్తుల దినోత్సవం (ఇంపాల్) 14 రెండో శనివారం 15 ఆదివారం ఇండిపెండెన్స డే 16 పార్సి కొత్త సంవత్సరం (ముంబై, నాగపూర్, బెలాపూర్) 19 మొహరం 20 ఓనమ్ (బెంగళూరు, చెన్నై, కొచ్చి, కేరళ) 21 తిరుఓనం (కొచ్చి, కేరళ) 22 రక్షాబంధన్ 23 శ్రీ నారాయణ గురు జయంతి (కొచ్చి, కేరళ) 20 ఓనమ్ (బెంగళూరు, చెన్నై, కొచ్చి, కేరళ) 21 తిరుఓనం (కొచ్చి, కేరళ) 22 రక్షాబంధన్ 23 శ్రీ నారాయణ గురు జయంతి (కొచ్చి, కేరళ) ఇలా ఆగష్టు నెలలో పదిహేను రోజులు బ్యాకులకు సెలవులు ఉన్నాయి. అయితే ఈ సెలవు దినాలు అనేవి రాష్ట్రం ప్రాతిపదికన బ్యాంక్ సెలవులు మారతాయని గుర్తించుకోవాలి.