Free Treatment: పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం.. రూ.5 లక్షల వరకు ఫ్రీ.. దేశవ్యాప్తంగా అందరికీ..
పేదలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఎప్పటినుంచో అమలు చేస్తోంది. కోట్లాది మంది పేదలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. వైద్య చికిత్సలకు రూపాయి ఖర్చు లేకుండా చేయించుకోవచ్చు. ఈ పథకం వివరాలు చూద్దాం.

కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథంక కింద ఆయుష్మాన్ భారత్ కార్డులను జారీ చేస్తోన్న విషయం తెలిసిందే. రేషన్ కార్డు కలిగిన పేదలకు ఈ పథకం వర్తింపచేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా లబ్దిదారులు దేశంలోని ఏదైనా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.5 లక్షల వరకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ పొందవచ్చు. ప్రస్తుతం వైద్య ఖర్చులు పెరిగిపోతున్నాయి. పేదలకు లక్షల్లో ఖర్చు పెట్టి వైద్యం చేయించుకునే ఆర్ధిక స్తోమత ఉండదు. దీంతో కేంద్రం వారికి అండగా నిలిచేసేందుకు ఈ పథకం ప్రవేశపెట్టింది. గత కొన్నేళ్లుగా ఈ పథకం అమలు అవుతుండగా.. కోట్లామంది మంది లబ్ది పొందుతున్నారు. తాజాగా ప్రభుత్వం ఈ స్కీమ్ అమలుపై కీలక ప్రకటన చేసింది. అయుష్మాన్ భారత్ కార్డుల సంఖ్య 44 కోట్లకు చేరిందని తెలిపింది . ఈ పథకం 12 కోట్ల కుటుంబాలకు కవర్ అవుతుందని, అంటే దేశ జనాభాలో సుమారు 40 శాతం మందికి సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజీని అందిస్తుందని స్పష్టం చేసింది.
వారికి మరింత ప్రయోజనం
మార్చి 2024లో సుమారు 37 లక్షల ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల కుటుంబాలను కూడా ఈ పథకంలో చేర్చుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లను చేర్చడానికి ఈ పథకాన్ని విస్తరించారు. ఈ లబ్ధిదారులు సుమారు 4.5 కోట్ల కుటుంబాలకు చెందినవారు ఉండగా.. వీరికి సామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అయుష్మాన్ భారత్ కార్డు కింద బీమా వర్తింపచేస్తున్నారు.
ఎక్కువ ఖాతాలు మహిళలవే..
అటు పలు సంక్షేమ పథకాలపై కేంద్ర ప్రభుత్వం ఫ్యాక్ట్‌షీట్ విడుదల చేసింది. ఇందులో పేద కుటుంబాలకు వంటగ్యాస్ అందించేందుకు 10 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు జారీ చేసినట్లు తెలిపింది. అలాగే మోదీ ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద పేద కుటుంబాల కోసం 4 కోట్ల శాశ్వత గృహాలను నిర్మించినట్లు స్పష్టం చేసింది. అటు దేశవ్యాప్తంగా పేదల కోసం ప్రవేశపెట్టిన జన్ ధన్ బ్యాంకు ఖాతాలపై ఆర్శికశాఖ కీలక వివరాలు వెల్లించింది. జన్ ధన్ బ్యాంక్ అకౌంట్ల సంఖ్య 58.15 కోట్లకు పెరిగినట్లు పేర్కొంది. ఈ ఖాతాలలో మొత్తం డిపాజిట్లు కూడా రూ. 3 లక్షల కోట్లకు పెరిగినట్లు తెలిపింది. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు బ్యాంక్ అకౌంట్లు తెరిచారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 56 శాతం జన్ ధన్ ఖాతాలు మహిళల పేర్ల మీద ఉన్నాయి
