Ather Rizta: అతిపెద్ద సీటింగ్ కెపాసిటీతో ఏథర్ రిజ్టా.. ఏప్రిల్ 6 నుంచి ప్రీబుక్సింగ్స్ ఓపెన్

ప్రముఖ ఈవీ స్కూటర్ల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ భారతదేశంలో తన మొదటి ఫ్యామిలీ స్కూటర్‌ను ఏథర్ రిజ్టాను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ఈవీ స్కూటర్ భారతదేశంలో ఏప్రిల్ 6న విడుదల కానుంది. అధికారిక ఈవెంట్‌ కంటే ముందు ఈ బ్రాండ్ స్కూటర్‌ను కేవలం రూ.999 చెల్లించి ప్రీ- బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.

Ather Rizta: అతిపెద్ద సీటింగ్ కెపాసిటీతో ఏథర్ రిజ్టా.. ఏప్రిల్ 6 నుంచి ప్రీబుక్సింగ్స్ ఓపెన్
Ather Rizta Family Scooter
Follow us

|

Updated on: Apr 02, 2024 | 3:45 PM

భారతదేశంలో పెరుగుతున్న ఈవీ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని అన్ని కంపెనీలు ఎప్పటిప్పుడు సరికొత్త ఈవీ వాహనాలను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశ ఈవీ మార్కెట్‌లో కార్లతో పోల్చుకుంటే ఈవీ స్కూటర్లను వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్టప్ కంపెనీల నుంచి టాప్ కంపెనీల వరకూ ఈవీ స్కూటర్లను రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ ఈవీ స్కూటర్ల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ భారతదేశంలో తన మొదటి ఫ్యామిలీ స్కూటర్‌ను ఏథర్ రిజ్టాను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ఈవీ స్కూటర్ భారతదేశంలో ఏప్రిల్ 6న విడుదల కానుంది. అధికారిక ఈవెంట్‌ కంటే ముందు ఈ బ్రాండ్ స్కూటర్‌ను కేవలం రూ.999 చెల్లించి ప్రీ- బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏథర్ రిజ్టా ఈవీ స్కూటర్‌ను ఎలా బుక్ చేసుకోవాలి? ఏథర్ రిజ్టా ఫీచర్లు వంటి వివరాలను తెలుసుకుందాం. 

ఏథర్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉండే లింక్ ద్వారా ఏథర్ రిజ్టా ఈవీ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. ఏథర్ రిజ్టా బ్రాండ్‌కు సంబంధించిన లైనప్‌లో తాజా ఉత్పత్తి, అలాగే ఈ ఈవీ స్కూటర్ లైనప్‌లోని అన్ని ఇతర మోడళ్ల కంటే భిన్నంగా ఉంటుంది. నిర్దిష్టంగా చెప్పాలంటే ఏథర్ రిజ్టా ఆ బ్రాండ్‌లోని అతిపెద్ద స్కూటర్. ఏథర్ ఎనర్జీ అనేక సందర్భాల్లో ఈవీ స్కూటర్లను అతి పెద్ద సీటుతో రిలీజ్ చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఏథర్ రిజ్టా ఈవీను అతి పెద్ద సీటుతో రిలీజ్ చేసింది. అలాగే ఈ స్కూటర్ పెద్ద పరిమాణంతో కూడా వస్తుందని భావిస్తున్నారు. ఇది బ్రాండ్ లైనప్‌లో అతిపెద్ద స్కూటర్గా మారుతుంది. అదనంగా రైడర్ల కోసం మంచి మొత్తంలో అండర్సీట్ స్టోరేజ్, ఫ్లోర్‌బోర్డ్ స్పేస్‌ను ఆఫర్ చేస్తుంది. 

రిజ్టా ద్వారా ఏథర్ ఎనర్జీ ఎక్కువ మంది ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుంది . వారి దృష్టికి తగినట్లుగా చేయడానికి బ్రాండ్ టచ్ స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లతో వస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇతర ఈవీ స్కూటర్ల మాదిరిగానే కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ మ్యాప్స్‌తో పాటు యూజర్ ఇంటర్ ఫేస్‌లో ఏథర్ ప్యాక్‌ను పొందవచ్చు. ఏథర్ రిజ్టా స్కూటర్‌ను ఇతర మోడళ్లతో పోల్చినప్పుడు ఈ స్కూటర్ విభిన్న స్టైలింగ్‌తో వస్తుంది. ముఖ్యంగా ఎల్ఎస్ఈడీ లైట్‌లు ఈవీ స్కూటర్‌కు మంచి లుక్‌ను అందిస్తుంది. ముఖ్యంగా ఈ స్కూటర్‌ను నీటిలో నడిపినా పెద్దగా ఇబ్బంది ఉండదని కంపెనీ పేర్కొంటున్నారు. ఏథర్ రిజ్టా స్కూటర్ క్లిక్ అయితే ప్రస్తుతం ఈవీ స్కూటర్ మార్కెట్‌ను ఏలుతున్న టీవీఎస్ ఐక్యూబ్, ఓలా ఎస్1 స్కూటర్లకు మంచి పోటీదారుగా నిలబడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త