Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambani and Adani: భారతదేశపు వ్యాపార దిగ్గజం అంబానీ.. అదానీతో గ్రీన్ ఎనర్జీ రంగంలో యుద్ధానికి సిద్ధం అయ్యారా?

Ambani and Adani: అది జూలై 2020. అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేసే ఒప్పందాన్ని చేసుకుంది.

Ambani and Adani: భారతదేశపు వ్యాపార దిగ్గజం అంబానీ.. అదానీతో గ్రీన్ ఎనర్జీ రంగంలో యుద్ధానికి సిద్ధం అయ్యారా?
Ambani And Adani
Follow us
KVD Varma

|

Updated on: Jun 30, 2021 | 2:41 PM

Ambani and Adani: అది జూలై 2020. అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేసే ఒప్పందాన్ని చేసుకుంది. ఇందుకోసం కంపెనీ సుమారు రూ .45,300 కోట్లు బిడ్ వేసింది. అదేవిధంగా, టాటా పవర్ సోలార్ సిస్టమ్స్‌కు ఈ ఏడాది జనవరి, మే నెలల్లో రెండు ప్రభుత్వ ఒప్పందాలు వచ్చాయి. గ్రీన్ ఎనర్జీ రంగంలో తక్కువ పోటీ ఉండడంతో, ఈ కంపెనీలకు ప్రభుత్వ ఒప్పందాలు పొందడం చాలా సులభం అయ్యాయి. కానీ, జూన్ 24 న రిలయన్స్ ఎజిఎం వార్షిక సమావేశంలో ముఖేష్ అంబానీ తమ భవిష్యత్ ప్రణాళికలపై చేసిన ప్రకటన ఇప్పుడు పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సమావేశంలో ముఖేష్ అంబానీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రీన్ ఎనర్జీ వ్యాపారంలో ప్రవేశించడానికి మెగా ప్లాన్ చెప్పారు. ఇందుకోసం వచ్చే మూడేళ్లలో రూ .75,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నారు. అదానీ గ్రూప్ ఇప్పటికే ఈ రంగంలో ఉంది. రిలయన్స్ ప్రకటనతో, అంబానీ..అదానీల మధ్య ప్రత్యక్ష పోటీకి తెరలేచినట్టే!. గ్రీన్ ఎనర్జీ అంటే ఏమిటి? ఈ రంగంలో అంబానీ పెట్టుబడి ఎలాంటి మార్పులు తెస్తుంది? అంబానీ రాకతో అదానీ వ్యాపారం ఎలా ప్రభావితమవుతుంది? గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా రిలయన్స్ జియో మేజిక్ పనిచేస్తుందా? ఈ ప్రశ్నలకు నిపుణులు ఏమంటున్నారో ఒకసారి పరిశీలిద్దాం..

గ్రీన్ ఎనర్జీ అంటే ఏమిటి?

గ్రీన్ ఎనర్జీని సహజ వనరుల నుండి వచ్చే శక్తి అంటారు. ఉదాహరణకు, సూర్యరశ్మి, గాలి లేదా నీరు. ఈ శక్తి పర్యావరణానికి హాని కలిగించదు. గ్రీన్ ఎనర్జీని పునరుత్పాదక శక్తి అని కూడా అంటారు. శిలాజ ఇంధనాలు అంటే బొగ్గు, పెట్రోలియం వంటి హానికరమైన గ్రీన్హౌస్ వాయువులను ఉత్పత్తి చేయనందున గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నారు.

రిలయన్స్ 75 వేల కోట్ల మెగా ప్లాన్

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 60 వేల కోట్ల వ్యయంతో రిలయన్స్ 4 గిగా ఫ్యాక్టరీని నిర్మించనుంది. సౌర ఫలకాలు, బ్యాటరీలు, గ్రీన్ హైడ్రోజన్ మరియు ఇంధన కణాలు ఇక్కడ తయారు చేస్తారు. ఇవి కాకుండా రూ .15 వేల కోట్లు విలువ గొలుసు భాగస్వామ్యంతో భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానం కోసం పెట్టుబడి పెట్టనున్నారు. గ్రీన్ ఎనర్జీ వ్యాపారం కోసం వచ్చే 3 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి 75 వేల కోట్లుగా అంబానీ ప్రకటించారు. రిలయన్స్ 2030 నాటికి 100 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని సాధించాలని కోరుకుంటుంది. అదేవిధమ రిలయన్స్ 2035 నాటికి జీరో కార్బన్ ట్యాగ్ తగిలించుకోవాలని కోరుకుంటోంది.

అంబానీ అదానీ మార్గంలో వస్తారా?

అంబానీ, అదాని ఇప్పటివరకు వేర్వేరు రంగాలలో వ్యాపారం చేసేవారు. అంబానీ దృష్టి డేటా ఆధారిత వినియోగదారు వ్యాపారంపై ఇంతవరకూ ఉంది. ఉదాహరణకు, రిటైల్, టెలికాం వంటి రంగాలు. మరోవైపు అదానీ దృష్టి మౌలిక సదుపాయాలతో పాటు యుటిలిటీ రంగాలపై ఉంది. రిలయన్స్, అదానీ గ్రూప్ ఒకే రంగంలో ఒకరినొకరు అధిగమించడానికి పోటీపడటం ఇదే మొదటిసారి. అదానీ గ్రీన్ ఎనర్జీ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ .3,184 కోట్లు సంపాదించింది. కంపెనీ నికర లాభం రూ .210 కోట్లు. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో అంబానీ ప్రస్తుతానికి ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించడం వ్యాపార వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ప్రస్తుతం, రిలయన్స్ ఈ-కామర్స్ రంగంలో అమెజాన్ మరియు వాల్‌మార్ట్‌లతో పోరాడుతోంది. జియో ఫోన్ నెక్స్ట్ ప్రారంభించడం ద్వారా రిలయన్స్ ఇప్పుడు షియోమి వంటి కంపెనీలను సవాలు చేస్తోంది. 5 జి ప్రారంభించిన తరువాత, హువావే వంటి గ్లోబల్ ప్లేయర్స్ నుండి పోటీ ఉంటుంది. ఇప్పుడు పునరుత్పాదక ఇంధన రంగంలో అదానీతో అంబానీ మధ్య సరికొత్త పోటీ మొదలవబోతోంది. గ్లోబల్ పెట్రోలియం కంపెనీలైన బిపి పిఎల్‌సి, సెవెరాన్, ఎక్సాన్ మొబిల్ కూడా సౌర శక్తి రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు ప్రకటించాయి. కానీ అంబానీకి ప్రధానంగా తీవ్ర పోటీ అదానీ నుంచే ఉంటుందని తెలుస్తోంది.

గ్రీన్ ఎనర్జీలో రిలయన్స్ జియో లాంటి మ్యాజిక్ చేయగలరా?

భారతదేశంలో గ్రీన్ ఎనర్జీ ఇప్పటికీ చాలా ప్రారంభ దశలోనే ఉంది. అయితే, ప్రపంచం మొత్తం జియో ద్వారా కొత్త రంగంలో అంబానీ దూకుడు వైఖరిని చూసింది. అంబానీ డిజిటల్ స్టార్టప్ జియో కేవలం ఐదేళ్లలో 42 కోట్ల మంది సభ్యులను సంపాదించింది. ఈ కారణంగా, భారతదేశంలో అనేక ఇతర టెలికం ఆపరేటర్లు దివాళా తీశారు. రిలయన్స్ ప్రకటన 2016 లో జియో ప్రారంభించడంతో టెలికాం పరిశ్రమలో చేసినట్లే.. ఇంధన పరిశ్రమలో ఇప్పుడు చేసిన ఈ ప్రకటన కూడా సంచలనం సృష్టించింది. 2016 లో ప్రారంభించిన 1 సంవత్సరంలోనే, చౌకైన డేటా ధర కారణంగా జియో ప్రపంచంలోనే అగ్ర మొబైల్ డేటా వినియోగదారుగా అవతరించింది. రిలయన్స్ ప్రవేశం తరువాత, ఒక భారతీయుడి సగటు డేటా వినియోగం ప్రతి నెలా 11 జిబికి చేరుకుంది.

పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, జియో మార్గాన్ని అనుసరిస్తే, అంబానీ న్యూ ఎనర్జీ కోసం 3-దశల ప్రణాళిక ఉండొచ్చు.. వీటి ద్వారా గ్లోబల్ లీడర్ గా ఎదిగే ప్రయత్నాలు రిలయన్స్ చేయవచ్చని భావిస్తున్నారు. అవి ఇవీ..

  1. జ్ఞానం మరియు ఆవిష్కరణల ద్వారా సమగ్ర వ్యవస్థను సృష్టించడం
  2. గ్రీన్ ఎనర్జీకి డిమాండ్ పెంచే, ఖర్చులను తగ్గించే వ్యాపార నమూనా
  3. వస్తువుల సామర్థ్యం, పనితీరు, జీవిత కాలాన్ని మెరుగుపరచడం

2028 నాటికి 37 లక్షల కోట్ల పెట్టుబడి

భారతదేశంలో హరిత, పునరుత్పాదక ఇంధన రంగం వైపు దృష్టి సారించిన సంస్థల్లో రిలయన్స్ మొదటి సంస్థ కాదు. 2019 లో, ఏప్రిల్, డిసెంబర్ మధ్య, ప్రైవేట్ కంపెనీలు రూ .37,000 కోట్లు పెట్టుబడి పెట్టాయి. భారతదేశం పునరుత్పాదక రంగం అవకాశాలతో నిండి ఉంది. నిరంతరం ఇది పెరుగుతూ వస్తోంది. ఫిబ్రవరి 2021 నాటికి, దేశం 94.43 GW సామర్థ్యాన్ని సాధించింది. ఇది 2030 నాటికి 450 GW కి చేరుకుంటుంది. ఈ రంగానికి 2014 నుంచి రూ .3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2028 నాటికి 37 లక్షల కోట్ల పెట్టుబడిని అంచనా వేస్తున్నట్లు ఐబిఇఎఫ్ తెలిపింది. 2040 నాటికి, పునరుత్పాదక శక్తి నుండి 49% విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

Also Read: JioPhone Next: గూగుల్ తో కలిసి ప్రపంచంలోనే చౌకైన స్మార్ట్ ఫోన్ ‘జియోఫోన్ నెక్స్ట్‌’ను ప్రకటించిన రిలయన్స్

Tata Tiago XTO: మార్కెట్ లోకి టాటా టియాగో కొత్త వేరియంట్..స్పెషాలిటీ ఏమిటంటే..