Amazon CEO: కీలక నిర్ణయం తీసుకున్న అమేజాన్‌ సీఈఓ… ఈ ఏడాది పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటన..

అమేజాన్‌ను ఈ స్థాయికి తీసుకొచ్చిన జెఫ్‌ బెజోస్‌ కంపెనీ సీఈఓ పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించాడు. 2021 చివరికల్లా ఈ పదవి నుంచి వైదొలగనున్నట్లు జెఫ్‌...

Amazon CEO: కీలక నిర్ణయం తీసుకున్న అమేజాన్‌ సీఈఓ... ఈ ఏడాది  పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటన..
Follow us

|

Updated on: Feb 03, 2021 | 5:47 AM

Amazon CEO Resigning: ఆన్‌లైన్‌ మార్కెట్‌ వ్యాపారం అమేజాన్‌ను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాడు ఆ కంపెనీ సీఈఓ.. జెఫ్‌ బెజోస్‌. అమెరికా నుంచి మొదలు పెడితే అమలాపురం వరకు అమేజాన్ సేవలు అందుబాటులో ఉన్నాయంటే దానికి జెఫ్‌ బెజోస్‌ నాయకత్వమే కారణమని చెప్పాలి. 27 ఏళ్ల క్రితం అమేజాన్‌ సంస్థను ప్రారంభించి ప్రపంచనలుమూలల సేవలను విస్తరించిన బెజోస్‌ ఈ కంపెనీకి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఇక బెజోస్‌ కొన్నేళ్లపాటు ప్రపంచ కుబేరుడిగా అవతరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే అమేజాన్‌ను ఈ స్థాయికి తీసుకొచ్చిన జెఫ్‌ బెజోస్‌ కంపెనీ సీఈఓ పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించాడు. 2021 చివరికల్లా ఈ పదవి నుంచి వైదొలగనున్నట్లు జెఫ్‌ స్వయంగా ప్రకటించారు. బెజోస్‌ స్థానంలో.. అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ హెడ్‌ ఆండీ జెస్సీ సీఈఓగా నియామకం కానున్నారు. మూడో త్రైమాసానికల్లా సీఈఓ పదవి నుంచి తప్పుకుని జెస్సీకి పగ్గాలు అప్పగించేంచుకు బెజోస్‌ ప్రకటించారు.

Also Read: Doomsday Clock : ప్రళయం ముంచుకొస్తోందా…? ప్రపంచం అంతమయ్యే రోజు దగ్గర్లోనే ఉందా..? డూమ్స్ డే ఏం చెబుతోంది..!