Doomsday Clock : ప్రళయం ముంచుకొస్తోందా…? ప్రపంచం అంతమయ్యే రోజు దగ్గర్లోనే ఉందా..? డూమ్స్ డే ఏం చెబుతోంది..!
ప్రపంచం వినాశనానికి అత్యంత దగ్గరగా ఉన్నట్లు తొలిసారిగా 1953లో ఈ గడియారం చూపించింది. ఆ ఏడు అమెరికా, సోవియట్ యూనియన్‌లు హైడ్రోజన్ బాంబులు పరీక్షించడంతో..

ప్రపంచం అంతమయ్యే రోజు దగ్గర్లోనే ఉందని చెబుతున్నారు నిపుణులు. డూమ్స్ డే క్లాక్ లోని సమయం అర్ధరాత్రికి కేవలం కొద్ది సెకన్ల దూరంలో ఉండటమే ఇందుకు కారణం. ఫలితంగా ప్రపంచ వినాశనం మరెంతో దూరంలో లేదంటూ ‘డూమ్స్ డే క్లాక్’ క్లాక్ హెచ్చరిక చేసింది.
Doomsday Clock : అసలే కరోనా. ఆ పై అణు యుద్ధం ముప్పు. అంతే కాదు పర్యావరణంలో మార్పులు. ఇవన్నీ డూమ్స్ డే క్లాక్ అర్ధరాత్రికి మరింత చేరువ కావడానికి కారణమైందంటున్నారు. గతంలో ఎప్పుడూ ఇంత దగ్గరగా క్లాక్ రాలేదని అటామిక్ సైంటిస్ట్ బులెటిన్ అధ్యక్షుడు రేచెల్ బ్రాన్సన్ చెబుతున్న మాట. సైన్స్ పై విశ్వాసం లేకపోవడం, కరోనా వైరస్ పై పోరుకు సిద్దంగా లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందంటున్నారు. ఆయనే కాదు చాలా మంది నిపుణుల మాట ఇలానే ఉంది. పోయినేడు అర్ధరాత్రికి 2 నిమిషాల దూరంలో ఉన్న ఈ గడియారం ఇప్పుడు 100 సెకన్లకు చేరడంతో విలయం తప్పదనే సంకేతాలు వచ్చాయి.
అసలు ఈ డూమ్స్ డే క్లాక్’ అంటే ఏంటంటే..
డూమ్స్ డే క్లాక్ భూగోళంపై మానవాళి అంతం లేదా ప్రళయాన్ని సూచిస్తోంది. అణ్వాయుధాలను తయారు చేసిన మాన్‌హట్టన్ ప్రాజెక్టులో భాగస్వామ్యులైన అమెరికా సైంటిస్టులు 1945లో బులెటిన్ ఆప్ ద అటామిక్స్ సైంటిస్ట్ జర్నల్‌ను ప్రారంభించారు. ఈ క్లాక్‌ను 1947లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, షికాగో యూనివర్సిటీ విద్యార్థులు కలిసి స్థాపించారు. వారితో పాటు బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్ దీన్ని అభివృద్ధి చేసింది. ఈ బోర్డులో 13 మంది నోబెల్ గ్రహీతలు ఉన్నారు. ప్రపంచం అంతమవడానికి ఎంత దగ్గరలో ఉందో చెప్పేందుకు ఈ గడియారాన్ని నిదర్శనంగా చెబుతారు. మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లకు అనుగుణంగా ఈ గడియారాన్ని సవరిస్తూ ఉంటారు. మొదట్లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఈ గడియారాన్ని అర్ధరాత్రికి 7 నిమిషాల దూరంలో సెట్ చేశారు. ఆ తర్వాత 1991లో కోల్డ్ వార్ ముగిసిన తర్వాత దీనిని 17 నిమిషాలకు సెట్ చేశారు.
డూమ్స్‌డే గడియారం ఏర్పాటు..
ఈ జర్నల్‌ను నిర్వహించే శాస్త్రవేత్తలే డూమ్స్‌డే గడియారం ఏర్పాటు చేశారు. వినాశనాన్ని డూమ్స్‌డే వాచ్ ద్వారా హెచ్చరిస్తు వచ్చేవాళ్లు. పకృతి విపత్తులు, వాతావరణ మార్పులు, అణ్వాయుధాలు, అణు యుద్ధాల వల్ల పొంచి ఉన్న ప్రమాదాన్ని మాత్రమే డూమ్స్‌డే గడియారం ద్వారా చెప్పేవాళ్లు. ఆ తర్వాత 2007 నుంచి వాతావరణ మార్పుల వల్ల కలిగే ముప్పును దీని ద్వారా హెచ్చరిస్తున్నారు. డూమ్స్‌డే వాచ్‌లో ఇప్పటి వరకు 20 సార్లు టైమ్ మార్చారు.
మానవాళి వినాశనానికి ఎంత దూరంలో ఉందన్న దాన్ని బట్టి సమయాన్ని ముందుకు, వెనక్కు మారుస్తూ ఉంటారు. 1991లో అమెరికా, సోవియట్ రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది. ఇది ముగిశాక గడియారంలో సమయాన్ని రాత్రి 11.43కు మార్చిన సంగతి తెలిసిందే. అణ్వాయుధాలు, వాతావరణ మార్పులకు సంబంధించి ఆందోళనలు రేగుతున్నాయి.

doomsday clock
ప్రపంచం వినాశనానికి అత్యంత దగ్గరగా..
ప్రపంచ దేశాల అధినేతలు దీని పై సరైన విధంగా స్పందించడం లేదనే విమర్శలున్నాయి. తర్వాత ఈ కాలాన్ని 11.58కి మార్చారు. ఉత్తర కొరియాపై అణు దాడికి సిద్ధంగా ఉన్నామంటూ గతంలో ట్రంప్ పరోక్షంగా ప్రకటించడం, పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగాలని అమెరికా నిర్ణయం తీసుకోవడం తదితరాలను ఇందుకు కారణాలుగా భావించవచ్చు. ప్రపంచం వినాశనానికి అత్యంత దగ్గరగా ఉన్నట్లు తొలిసారిగా 1953లో ఈ గడియారం చూపించింది. ఆ ఏడు అమెరికా, సోవియట్ యూనియన్‌లు హైడ్రోజన్ బాంబులు పరీక్షించడంతో సమయాన్ని 11.58కి మార్చారు.
ప్రపంచం అణ్వాయుధాలతో అంతమవుతుందని సైంటిస్టుల హెచ్చరిక. అందుకే అణ్వాయుధాలు లేకుండా చేయాలని అటామిక్ సైంటిస్ట్ లోని సభ్యులు పిలుపునిచ్చారు. రష్యా కొత్త అణు ఒప్పందాన్ని ప్రారంభించాలి. ఇరాన్ తో మళ్లీ అణు ఒప్పందంలోకి అమెరికా రావాలనేది వీళ్ల సూచన. అదే సమయంలో కర్బన ఉద్గారాలను నిర్మూలించేందుకు అమెరికా, చైనా, ఇతర పెద్ద దేశాలు కలిసి రావాలని సూచిస్తున్నారు. గతేడాది మిడ్‌నైట్‌కు 2 నిమిషాల దూరంలో ఉన్న ఈ క్లాక్.. ఇప్పుడు 100 సెకన్లకు చేరింది.
మరో హెచ్చరిక జారీ…
డూమ్స్ డే క్లాక్ ఇప్పుడు మరో హెచ్చరిక జారీ చేసింది. అర్ధరాత్రికి కేవలం కొద్ది సెకన్ల దూరంలో నిలిచింది. ప్రపంచం అంతమయ్యే రోజు మరెంతో దూరంలో లేదని ఈ గడియారాన్ని చూసిన నిపుణులు చెబుతున్న మాట. కరోనా మహమ్మారి, అణు యుద్ధం, పర్యావరణంలో మార్పులతో డూమ్స్ డే క్లాక్ అర్ధరాత్రికి మరింత చేరువైంది. గతంలో ఇంత దగ్గరగా ఎప్పుడూ రాలేదని అటామిక్ సైంటిస్ట్స్ బులెటిన్ అధ్యక్షుడు రేచెల్ బ్రాన్సన్ అంటున్నారు. సైన్స్‌పై విశ్వాసం లేకపోవడం, కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణులు చెబుతున్నారు. మానవాళికి కరోనా అనేది ఓ మేలుకొలుపులాంటిది.
అణ్వాయుధాలతోనే ఈ ప్రపంచం అంతమవుతుంది. చాలా రోజులుగా ఉన్న ఆందోళన ఇదే. అందుకే ఈ అటామిక్ సైంటిస్ట్స్‌లోని సభ్యులు అణ్వాయుధాలను లేకుండా చేయాలని పిలుపునిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్‌జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్.. Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..