AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రిటన్ వాసులకు కొత్త గుబులు.. మరో కొత్త రకం వైరస్ వెలుగులోకి వచ్చిందన్న శాస్త్రవేత్తలు

ఇటీవల బ్రిటన్, సౌతాఫ్రికా దేశాల్లో వెలుగు చూసిన కొత్త వేరియంట్ వైరస్ మరింత కలవరానికి గురిచేసింది. తాజాగా వెలుగులోకి మరో కొత్త రకం వైరస్.

బ్రిటన్ వాసులకు కొత్త గుబులు.. మరో కొత్త రకం వైరస్ వెలుగులోకి వచ్చిందన్న శాస్త్రవేత్తలు
Balaraju Goud
|

Updated on: Feb 02, 2021 | 6:27 PM

Share

UK New variant : ఇప్పటికే కరోనా మహమ్మరి ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇటీవల బ్రిటన్, సౌతాఫ్రికా దేశాల్లో వెలుగు చూసిన కొత్త వేరియంట్ వైరస్ మరింత కలవరానికి గురిచేసింది. తాజాగా మరో కొత్త రకం వైరస్ వెలుగుచేసినట్లు యూకేకు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. కరోనా వైరస్ రూపం మార్చుకుని కెంట్ వేరియంట్‌గా మారి బ్రిటన్ చుట్టూ విస్తరించి ఉందని, ఇది కొన్ని కొత్త జన్యు మార్పులతో వ్యాప్తి చెందుతున్నన్నట్లు శాస్త్రవేత్తలు అంటున్నారు.

బ్రిటన్ మీడియా సంస్థ బీబీసీ న్యూస్ ఈ మేరకు ఓ కీలక కథనాన్ని ప్రసారం చేసింది. బ్రిటన్ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించినట్టు తన కథనంలో పేర్కొంది. వేగంగా వ్యాపిస్తూ అలజడి సృష్టిస్తున్న ఈ కొత్త స్ట్రెయిన్‌లో మరో జన్యుమార్పు(మ్యూటేషన్) సంభవించడమనేది సహజంగానే పెద్ద చర్చకు దారితీసింది. కాగా.. శాస్త్రవేత్తలు ఈ మార్పుకు ఈ484K అని నామకరణం చేసినట్లు బీబీసీ పేర్కొంది.

అయితే, ఈ వైరస్‌కు సంబంధించి అతికొద్ది శాంపిళ్లలో మాత్రమే ఈ మార్పు సంభవించినట్లు వెల్లడించారు. కొత్తగా వెలుగుచూసిన వైరస్ వ్యాప్తి పరిమితంగానే ఉండే అవకాశము ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌కు చెందిన స్ట్రెయిన్లలో కూడా ఈ484కే మార్పును నిపుణులు ఇప్పటికే గుర్తించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాల సామర్థ్యంపై ఈ మ్యూటేషన్ కొంత ప్రభావం చూపినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. అయితే, ఈ టీకాలు ఇప్పటికీ ఆశిస్తున్న ఫలితాలు ఇస్తాయని తెలిపారు.

కాగా, ఈ మార్పు టీకా ప్రభావాన్ని తగ్గిస్తున్నప్పటికీ, ప్రస్తుతం వాడుకలో ఉన్నవి ఇంకా పనిచేయాలని నిపుణులు అంటున్నారు. మరోవైపు కొత్త వేరియంట్ల వ్యాప్తిని నియంత్రించే చర్యలను బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటికే ముమ్మరం చేసింది. దక్షిణాఫ్రికా వేరియంట్‌కు సంబంధించిన అత్యవసర పరీక్ష ఇంగ్లాండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమవుతోంది మరియు విదేశాల నుండి మరిన్ని కేసులు ప్రవేశించకుండా ఉండటానికి ప్రయాణ ఆంక్షలు విధించారు. ఇదిలావుంటే, పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్‌తో కలిసి పనిచేస్తున్న నిపుణులు E484K మ్యుటేషన్‌తో యూకే వేరియంట్ కొన్ని కేసుల్లో మాత్రమే కనుగొన్నట్లు తెలిపారు. ముఖ్యంగా 2,14,159 నమూనాలను పరీక్షించగా, కేవలం 11 మందిలో మాత్రమే కొత్త రకం వైరస్ కనిపించిందని బ్రిటన్ అధికారులు ప్రకటించారు.

లీసెస్టర్ విశ్వవిద్యాలయంలోని వైరస్ నిపుణుడు డాక్టర్ జూలియన్ టాంగ్ మాట్లాడుతూ.. వైరస్ మరింత పరివర్తన చెందడానికి అవకాశాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలన్నారు. వ్యక్తుల మధ్య దూరం పెరిగినప్పుడు మాత్రమే కరోనావైరస్ కేసులను తగ్గించగలుగుతామన్నారు.

Read Also… రంగారెడ్డి జిల్లాలో రెచ్చిపోయిన ఉన్మాది.. జైలుకు పంపించారని పగతో యువతిపై గొడ్డలితో దాడి