Tax Free Countries: ఈ దేశాల్లో ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ ఉండదు!
సాధారణంగా ఒక దేశం నడవాలంటే ప్రజలు ఎంతోకొంత ఆదాయపు పన్ను కట్టడం అవసరం. అయితే కొన్ని దేశాల్లో ఒక్క రూపాయి కూడా పన్ను కట్టాల్సిన పని లేదని మీకు తెలుసా? అలాంటి దేశాలు చాలానే ఉన్నాయి. వాటి గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచవ్యాప్తంగా ప్రతిదేశంలో ప్రజలు ఎంతోకొంత ఆదాయపు పన్ను చెల్లించడం తప్పనిసరి. కానీ, కొన్ని దేశాలు మాత్రం దీనికి మినహాయింపు. ఈ దేశాల్లో ప్రభుత్వాలకు ఇతర మార్గాల ద్వారా సరిపడా ఆదాయం లభిస్తోంది. కాబట్టి మీరు సంపాదించే ప్రతి రూపాయి మీ జేబులోనే ఉంటుంది. ఎలాంటి పన్ను లేకుండా ప్రభుత్వ సేవలను పొందొచ్చు. అలాంటి దేశాల లిస్ట్ ఒకసారి చూద్దాం.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE):
మిడిల్ ఈస్ట్ లో ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE.. ప్రపంచంలోని సంపన్న దేశాల్లో ఒకటి. ఇక్కడ చమురు, గ్యాస్ ఉత్పత్తి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అందుకే ఆ ప్రభుత్వం పన్ను తీసివేసింది. ఇక్కడ నివసించేవారు ఎలాంటి ఆదాయపు పన్ను కట్టాల్సిన పని లేకుండానే దేశంలో నివసించొచ్చు.
బహ్రెయిన్
మిడిల్ ఈస్ట్ లో ఉండే మరోక దేశమైన బహ్రెయిన్ కూడా తమ పౌరులను ఆదాయపు పన్ను నుండి మినహాయించింది. ఈ దేశపు ఆర్థిక వ్యవస్థ చమురు, బ్యాకింగ్ రంగాలపై ఎక్కువగా ఆధారపడి ఉంది. విదేశీ పెట్టుబడులు కూడా కొంత అదనపు ఆదాయాన్ని తెస్తాయి. అందుకే అక్కడి నివాసితులకు ఆదాయపు పన్ను ఉండదు.
కువైట్
కువైట్ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా దాని చమురు నిల్వలపై ఆధారపడింది. కువైట్ కూడా ప్రపంచంలోని సంపన్న దేశాల్లో ఒకటి. ఈ దేశపు పౌరులు కూడా ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. చమురు నుంచి ఎక్కువగా ఆదాయం వస్తుండడంతీ కువైట్.. పౌరులపై ఆదాయపు పన్ను తీసివేసింది.
మొనాకో
యూరోపియన్ దేశమైన మొనాకో లో కూడా ఆదాయపు పన్ను ఉండదు. ఈ దేశ ఆదాయం లగ్జరీ టూరిజం, క్యాసినోలు, రియల్ ఎస్టేట్ నుండి వస్తుంది. అందుకే ఈ దేశం పన్ను రహిత విధానాన్ని అమలు చేస్తోంది.
ఇవి కూడా
ఇకపోతే ఖతర్, బ్రూనై, సౌదీ అరేబియా, బహామాస్ వంటి మరికొన్ని దేశాలు కూడా తమ ప్రజలపై ఆదాయపు పన్ను భారాన్ని తీసివేశాయి. ఈ దేశాలు చమురు, గ్యాస్, పర్యాటకం లేదా అంతర్జాతీయ వాణిజ్యం వంటి సహజ వనరుల నుండి తమ ఆదాయాన్ని సంపాదిస్తాయి. కాబట్టి ఆయా దేశాల్లో ప్రజలు ఆదాయపు పన్ను చెల్లించకుండానే ప్రభుత్వం నడుస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




